Posts

Showing posts from October, 2026

విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి

Image
 విజయవాడ మేయర్ అభ్యర్థి  వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి   విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయుచున్న అభ్యర్థులందరికి మంచి స్పందన ఎదురవుతున్నది.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్నినెరవేరుస్తున్నాము  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని.  అమరావతి తో పాటు విజయవాడ కూడా అభివృద్ధి చెందాలంటే వంగవీటి రాధాకృష్ణ ను మేయర్ గా గెలిపించుకోవాలని.  అలాగే 22 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆమె అన్నారు.  వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు తనను నమ్మి వచ్చిన వారి కి అందరికీ అండగా ఉంటారు:: గాదిరెడ్డి అమ్ములు   గత చరిత్రలో చూసుకున్నట్లయితే వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రాణి గారి తోట వాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.  అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా లేని ఏకైక ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.  అలాంటి వంగవీటి ఫ్యామిలీ...

విజయవాడ నగర అభివృద్ధి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి నా సవాల్ :: మమ్మనేని ప్రసాద్

Image
 విజయవాడ నగర అభివృద్ధి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి నా సవాల్ :: మమ్మనేని ప్రసాద్   వైసీపీ హయాంలో ఉన్నప్పుడు నగరపాలక సంస్థను బ్రష్టు పట్టించింది మీరు కదా.  నగరంలో మంచి నీటి సమస్యకు కారణం మీరు కదా. కౌన్సిల్ జరిగేటప్పుడు అర్థమంతమైన చర్చను ఏనాడైనా జరిపారా.  కౌన్సిల్ నిర్వహణలో మీరు పూర్తిగా విఫలం చెందారు.  ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు అందుకనే మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు.  19 వ డివిజన్ నుండి గత కొన్ని సంవత్సరాలకు కార్పొరేటర్ గా నేను పనిచేస్తున్నాను. ఇక్కడి ప్రజల అవసరతలు నాకు బాగా తెలుసు.  సైకిల్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ గా నన్ను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి వంగవీటి రాధాకృష్ణను గెలిపించవలసినదిగా కోరుకుంటున్నానని అన్నారు.

రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు

Image
 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*  *రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు**  విజయవాడ వెటర్నరీ కాలనీ లో రాధ కృష్ణ జన్మదిన సందర్భంగా " సి ఆర్ కే లా ఛాంబర్స్ "ఆఫీసు ప్రాంగణం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.. 49వ డివిజన్ బిజెపి కార్యాలయం నందు అడ్డూరి శ్రీరామ్ చేతుల మీదుగా హైకోర్టు లాయర్ మరియు "సి ఆర్ కే లా ఛాంబర్" అధినేత సి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మరియు ఆయన అభిమానులకు  పేదలకు పండ్లు మరియు స్వీట్స్ పంచడం జరిగింది  ..

డా. శంకరరావు కొచ్చెర్ల కు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం

Image
డా. శంకరరావు కొచ్చెర్ల కు డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అరుణోదయ యూనివర్సిటీలో పరిశోధన మార్గదర్శకులుగాh సేవలందిస్తున్న డా. శంకరరావు కొచ్చెర్ల గారికి ప్రతిష్ఠాత్మకమైన డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జాతీయ విద్యావేత్త పురస్కారం (Dr. A. P. J. Abdul Kalam National Academician Award) లభించింది. WELRED FOUNDATION సంస్థ ఈ పురస్కారాన్ని ఆయనకు అందించింది. విద్యారంగంలో ఆయన చేసిన కృషి, పరిశోధన మార్గదర్శకత్వంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. విద్యా ప్రమాణాల అభివృద్ధి, పరిశోధన మార్గదర్శకత్వం, యువత సాధికారత, సమాజ అభివృద్ధి పట్ల డా. కొచ్చెర్ల గారు చూపుతున్న నిబద్ధతకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలుస్తుంది. విద్యావేత్తగా, సామాజిక నాయకుడిగా ఆయన విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యావకాశాలను మెరుగుపరచడం, సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో భాగస్వామిగా ఉన్నారు. స్టూడెంట్ సక్సెస్ సొసైటీ (Student Success Society) అధ్యక్షుడిగా డా. శంకరరావు కొచ్చెర్ల గారు విద్యార్థుల విజయానికి తోడ్పడటం, విద్యపై అవగాహన పె...

వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో

Image
 *ఎన్టిఆర్ జిల్లా విజయవాడ* వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో  17వ సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ సిరి నగర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని  ఏమూరి సురేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ అన్నారు. *వేమూరి సురేష్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ కామెంట్స్*: ఈ సంవత్సరం 8 కళ్యాణాలు,5 అభిషేకాలు,ఈ రోజు స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ అన్న ప్రసాదం కు  దాదాపుగా 30 వేల నుంచి 35 వేల మంది వరకు రావడం జరిగింది  అన్న ప్రసాదం కు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  రేపు ఉదయం స్వామి వారి పూజ అనంతరం స్వామి వారు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 125 కేజీల లడ్డు వేలం,బురతకల్పం, గోదారంగనాథ స్వామి,వెంకటేశ్వర స్వామి,సీతారాముల కళ్యాణం,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు మన దక్షిణాది మద్రాసులో ఎక్కువగా చేయడం జరుగుతుంది మద్రాస్ లో ఎక్కువగా కావేడి ఉత్సవాలు చేస్తారు  కావేడీ ఉత్సవం పురవీధుల్లో ఊరేగింపు కావడంతో  350 ...

గాంధీ జయంతి సందర్భంగా

Image
మన్యం జిల్లా సాలూరులో ఈ.  రోజు గాంధీ జయంతి సందర్భంగా రాజన్నదొరగారు  మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు   వేసి నివాళులర్పించారు...

మాంసపు దుకాణాలు బంద్

Image
 *గాంధీ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలు బంద్* *కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ పి శ్రీహరి బాబు* చిలకలూరిపేట పట్టణంలో రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని మాంసపు దుకాణాలు, మాంసాహారం విక్రయించే రెస్టారెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాంసం విక్రయాలు నిలిపివేయాలని ఇప్పటికే సంబంధిత వ్యాపారులందరికీ ముందస్తు నోటీసులు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, మాంసం అమ్మకాలు చేపట్టినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి. శ్రీహరి బాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.