వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు
వినియోగదారుల హక్కుల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తున్న వినియోగదారుల సంఘం నాయకులు
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
– *మురికిపూడి ప్రసాద్, సీఆర్పీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు*
*చిలకలూరిపేట* .................
వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఆర్పీఎఫ్ (కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం) పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పిలుపునిచ్చారు.
మంగళవారం చిలకలూరిపేట పట్టణంలో నరసరావుపేట సెంటర్, చోత్ర సెంటర్ కృష్ణ మహల్ సెంటర్లో సీనియర్ సిటిజన్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు, గ్రామీణ ప్రాంత నాయకులకు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లేని వస్తువులు విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, లోపభూయిష్ట సేవలు అందించడం, ఆన్‌లైన్ మోసాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1915 టోల్-ఫ్రీ సేవతో పాటు consumerhelpline.gov.in పోర్టల్, NCH మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రతి వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన బిల్లులు, వారంటీ కార్డులు, రసీదులను భద్రంగా ఉంచుకోవాలని, అవసరమైతే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని మురికిపూడి ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం నాయకులు, డాక్టర్ విద్యాసాగర్,బేబీ విక్రమ్ , రవి నాయక్, పుష్పవల్లి,పొన్నం శ్రీనివాసరావు,బోనం శ్రీనివాసరావు, గాలయ్య,సభ్యులు పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు.

Comments
Post a Comment