“సాలూరులో మత సామరస్యానికి నిదర్శనం!”

 మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం కుటుంబం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన చోటుచేసుకుంది.









సాలూరు పట్టణంలోని వడ్డివీధికి చెందిన మహమ్మద్ అబ్దుల్ హక్ కుటుంబం వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కొనుగోలు చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.

మహమ్మద్ అబ్దుల్ హక్‌తో పాటు సల్మా, షాను, పర్హానా బేగం కుటుంబ సభ్యులు కలిసి విఘ్నేశ్వరుని కొనుగోలు చేశారు.

మతాలకు అతీతంగా మానవత్వం, సోదరభావం, పరస్పర గౌరవమే ముఖ్యమని చాటి చెప్పేలా ఈ కుటుంబం వ్యవహరించడంతో స్థానికులు అభినందిస్తున్నారు.

మత సామరస్యం, సౌభ్రాతృత్వానికి ఈ కుటుంబం ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం