రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలికలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* *రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలి..* - *ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని కొనసాగించాలి* - *ప్రతి దశలోనూ చేయాల్సిన పనులపై అప్రమత్తంగా ఉండాలి* - *కేతనకొండ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ* సమగ్ర రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలని.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో సర్వే కార్యకలాపాలు కొనసాగించాలని, ప్రతిదశలోనూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్లో గ్రామానికి సంబంధించి రీసర్వే స్థితిగతులను పరిశీలించారు. గ్రామం పరిధిలో 608 ఎకరాలకు గ్రౌండ్ ట్రూతింగ్ జరిగినట్లు సర్వేయర్లు వివరించగా.. అందుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. తర్వాత చేపట్టాల్సిన గ్రామ సభలు, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితరాలపై కలెక్టర్ క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశనం చేశారు...