Skip to main content

Posts

Showing posts from December, 2023

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - ఎంపీ చింతా అనురాధ

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ నూతన సంవత్సర (2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమంతో పాటు, అభివృద్ధి జరుగుతోందని, పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు సరికొత్త దశ దిశా ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలను అందించాలని, వారు ఆశించినవన్ని జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ చింతా అనురాధ తెలిపారు. ఎంపీ క్యాంపు కార్యాలయం, మొగళ్లమూరు

ప్రమాదకర స్థాయికి భారత అప్పులు..!

జిడిపిలో 100 శాతానికి మించొచ్చు..ఐఎంఎఫ్‌ హెచ్చరిక న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యస్థ కాలానికి జిడిపిలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని మంగళవారం హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్‌కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఏడాది కాలం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)కి సమానమైన అప్పులను 100 శాతంగా భావిస్తారు.”ప్రాధాన్యంగా రాయితీతో కూడిన ఫైనాన్సింగ్‌ వనరులు, అదే విధంగా ప్రయివేటు రంగ పెట్టుబడులు, సమానమైన యంత్రాంగం అవసరం. అసాధారణమైన ఆర్థిక సహాయం లేకుండా లేదా డిఫాల్ట్‌కు వెళ్లకుండా ప్రభుత్వం దాని ప్రస్తుత, భవిష్యత్తు చెల్లింపు బాధ్యతలన్నింటినీ తీర్చగలిగితే దేశం రుణం స్థిరమైనదిగా పరిగణించబడుతుంది.” అని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ”అధిక మూలధన వ్యయం, ఉపాధి ఆధారంగా ఇటీవల భారత వృద్ధి రేటు అంచనాలను మధ్యస్థ కాలాని...

ప్రజలారా... అవకాశమీవ్వండి...ఆదరించండి...ఆశీర్వదించండి.

ఈనాడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కట్కూరి సందీప్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. అన్నా అంటూ పిలిస్తే ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ప్రజల పనే తన పని అనుకోని సాయం చేసే వ్యక్తి కట్కూరి సందీప్. గత 15 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఓడినా, గెలిచినా పార్టీకి విధేయుడుగా ఉంటూ, ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కట్కూరి సందీప్. ప్రజల్లో ఒకడిగా ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదిగినవాడు కట్కూరి సందీప్. ఇలాంటి నాయకుడికి ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చాలా మంది కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.  అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులతో మాట్లాడి న్యాయం చేయటంలో సందీప్ ముందుంటాడని ప్రజలు అనుకుంటున్న మాట. ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయమని మరియు పెద్దపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి జరగాలంటే సందీప్ ని గెలిపించుకొని తీరాలని ప్రజలు కోరుకుంటున్నారు, కావున  అధిష్టానం గుర్తించి నాలాంటి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ నమ్మకాన్ని వమ్ము ...

ఉప్పల్ పైవంతెనఊగిసలాట

హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఆరువరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7KMమేర ఫ్లెఓవర్ నిర్మించాల్సి ఉంది. దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా మిగిలాయి. గుత్తేదారుసంస్థ దివాలా ప్రక్రియలో ఉండటంతో నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

కాంగ్రెస్ లో కి దిల్ రాజు?

  TS: ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్ లో  కి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజుతో పలువురు కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

విశాఖలో ఉద్రిక్తత

  AP: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసనలో భాగంగా పారిశుధ్య కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కేఆర్ఎం కాలనీలోని జీవీఎంసీ చెత్తవాహనాల యార్డును ముట్టడించి చెత్తవాహనాలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

నటి జయప్రద కోసం పోలీసుల గాలింపు

బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నిమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో రామూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది.

పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..!

Petrol Price: మోదీ నూతన సంవత్సర కానుక... పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.. ఇంధన ధరల్లో భారీ కోత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరపై రూ.10 వరకూ తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు వరుసగా రూ.8, రూ.6 తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. పెట్రోలియం శాఖ మంత్రి చమురు ధరలను తగ్గించనున్నట్టు ప్రకటించారు.. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చమురు సంస్థలను లాభాల బాటలో నడిపించాయి. దీంతో లీటర్‌పై రూ.10 వరకూ లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం రాయితీలు, ఆర్థ...

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు: సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చిన ఏకైక వ్యక్తి, గొప్ప మానవతా వాది, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ధీరుడు అతనే కొయ్యూరు సిఐ అల్లూ స్వామి నాయుడు. ప్రజలు, యువతీ యువకులు, మేధావులు, విద్యావంతులు ఏ సమస్యనైనా, ఏ బాధనైనా మనసులోనే దాచుకోకుండా, దిగమింగకుండా.. వ్యక్తపరిచే స్వేచ్ఛని ఇచ్చిన ఏకైక వ్యక్తి సిఐ అల్లూ స్వామి నాయుడు. కొయ్యూరు మండలం మారుమూల గ్రామాల్లోని యువత, ప్రజలు సైతం ఏ బాధనైనా ఇట్టే చెప్పేవారు. పోలీసులు, పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉండాలి ధోరణిని అవలంభించిన వ్యక్తి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు పరిచిన మానవతా విలువలు కలిగిన వ్యక్తి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా కులాలకు, మతాలకతీతంగా నడిచిన వ్యక్తి. ఇతని విలువలు తప్పు చేసిన వ్యక్తి యొక్క నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేయగలవు. ప్రతీ ఒక్క పోలీస్ అధికారి ఇలానే ఉంటే, సమాజంలో మార్పు ఖచ్చితంగా తీసుకురావచ్చు అనేది నా అభిప్రాయం. ఈయనను చూస్తే, కేవలం కేసులు నమోదు చేస్తేనే, శిక్షలు కఠినంగా అమలు చేస్తేనే మార్పు రాదు అనడంలో ...

Bigg Boss OTT Season 2: బర్రెలక్కకు ఛాన్స్

  బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీలోకి కర్నె శిరీష (బరైలక్క) ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సోషల్మీడియాలో ఆమెకు ఫ్యాన్బోస్ ఎక్కువగా ఉంది. ఈ ఇమేజ్ను బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. అలాగే సింగర్ పార్వతిని కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లోకి తీసుకుంటారని సమాచారం.

భారత్ కు ప్రముఖ కార్ల తయారీ ఫ్యాక్టరీ!

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో తన తొలి మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయనుందని తెలిపాయి. దీనిని జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమావేశంలో వెల్లడించనున్నారని, ఇందుకోసం టెస్లాకు గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాల సహాయపడనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా దీనిపై ఇప్పటివరకు టెస్లా, గుజరాత్ ప్రభుత్వం స్పందించలేదు.

టైబ్రేక్ లో పోరాడి ఓడిన తెలుగు గ్రాండ్ మాస్టర్

  భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తాచాటింది. ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకుంది. గురువారం ఆఖరిదైన 11వ రౌండ్లో కేథెరీనా (రష్యా)పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన ఆమె గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించింది. ప్రత్యర్థికి మించి ఎత్తులు వేయడంతో దూకుడుతో సాగింది. హోరాహోరీగా సాగిన టైబ్రేక్ లో హంపి పోరాట పటిమ ప్రదర్శించినా.. చివరకు పరాజయంవైపు నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మీదుగా అమృత్ భారత్ రైలు

ఆంధ్ర ప్రదేశ్: రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది.

మాస్కులు తప్పనిసరి?

దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపో తున్నాయి. తాజాగా బుధవారం కేరళ రాష్ట్రంలో కొత్తగా 74 కోవిడ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దక్షిణ కన్నడ, మైసూరు జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కో బాధితుడు. బెంగళూరులో ఇవాల కొత్తగా 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హాసన్ 4, బెంగళూరు రూరల్ జిల్లాలో 4, చిక్కబల్లాపూర్ 3, మాండ్య, మైసూర్ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటకలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం. ఆలాగే బాధితులకు 7 రోజుల క్వారంటైన్‌ విధించింది. JN.1 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో సిద్ధరామయ్య సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 464, బెంగళూరులో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 376, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1.15%. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడి...

డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం

డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) విస్తృత స్థాయి సమావేశం డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం విశాఖపట్నం: డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) జాతీయ కో-ఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ కమిటీ సభ్యులు యు.వి.రావ్ ఉప్పినివలస సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ పర్యవేక్షణలో  ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటగా డిజెయు విశాఖ జిల్లా కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. డిజెయు (డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్) నూతన విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సుంకసూరి శారా జ్యోతి (శారా) ఉపాధ్యక్షులు డి.రాజారావు, కార్యదర్శి పి.వి.వి.శేఖర్, సహాయ కార్యదర్శి ఎం.గురువా రెడ్డి (ఎం.జీ.అర్.), కోశాధికారి నాగరాజు, కార్యనిర్వాహకులు (ఆర్గనైజర్) నాగల రాజేష్, మరియు కమిటీ సభ్యులు గా కరుకు రమేష్ చంద్ర, దుర్గాప్రసాద్, కొప్పల మహేష్, బి.కే.కిషోర్, చదరం రమేష్, బలివాడ కన్నబాబు తదితరులను సమావేశం ఆమోదించింది.  ఈ కార్యక్రమంలో స్థానిక, అనకాపల్లి పరిసర ప్రాంతాల జర్నలిస్ట్లు హాజరయ్యారు.

విశాఖ జిల్లాలో డీ జేయు జిల్లాస్థాయి కార్యవర్గ ఎన్నిక విజయవంతం

జాతీయ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల నేతృత్వంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీల ఏర్పాటు  డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్  జిల్లా కమిటీల ఏర్పాటు కార్యక్రమం విశాఖపట్నం నందు జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ సభ్యులు యు. వెంకట రావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధమంగా విశాఖపట్నం నందు విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  విశాఖపట్నం జర్నలిస్టులు మరియు పరిసర ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు జర్నలిజం వృత్తిలో తమ స్వీయ అనుభవాన్ని తెలియజేస్తూ పరిచయంతో సమావేశాన్ని ప్రారంభించారు.  ఈ సమావేశంలో నూతన సభ్యత్వం తో పాటు జర్నలిస్టుల బాధ్యతలు హక్కులు, జర్నలిజం వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను, యూనియన్ బలోపేతానికి సభ్యత్వం పొందిన జర్నలిస్టుల సహకారము, మరియు జాతీయ కమిటీ తో రాష్ట్ర కమిటీ సమన్వయము, విధి విధానాలు పై జర్నలిస్టులందరూ చర్చించారు. అనంతరం విశాఖ పట్టణం, పరిసర ప్రాంతాల సభ్యత్వం పొందిన జర్నలిస్టులు అందరూ  ఏకగ్రీవంగా జిల్లా కమిటీని...

మాకివ్వాల్సిన కూలిడబ్బు కోసం ఉద్యమాలు చేయాలా?

సర్వీస్‌ రూల్స్‌, పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్టు 7న విశాఖలో ‘ఏపీఎంఈఎస్‌ఏ’ తొలి మహా సభ  ఏపీ ఎమ్ ఇ ఎస్ ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ  ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విశాఖపట్నం: ఉద్యోగులు దాచుకున్న, పని చేస్తున్న కూలి డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గతంలో 92రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం రూ.6,500కోట్లు విడుదల చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు.  రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లయినా ఇప్పటికీ సర్వీస్‌ రూల్స్‌ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. పదోన్నతల విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఎంఈఎస్‌ఏ) తొలి మహా సభ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్టు బొప్పరాజు స్పష్టం చేశారు.  సిబ్బంది లేని మున్సిపాలిటీలు: ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బందినివ్వలేదని, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని ...

అమ్మ నీకు జోహార్.......

అమ్మ నీకు జోహార్....... వ్యవసాయ రంగంలో కష్టాలు వచ్చి.... నా తల్లి జైబోరన్నగారి లక్ష్మీదేవి యాదవ్ ఎన్నో కష్టాలను చవిచూసిందనీ ప్రజా సేవకుడు.... ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నీరు పెట్టుకున్నారు . ముందు వెనక నా అనేవారు లేక  17 డిసెంబర్ 1983 పసి బిడ్డలుగా ఉన్న... ( నా చెల్లి అప్పటికి పాలు అమ్మపాలు తాగుతుంది ) అనాధలుగా చేసి .... మమ్మల్ని వదిలి నేటికి 40 సంవత్సరాలు..అనీ బోసన్నా తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు... నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చిన అమ్మ కంటిపాపలా మమ్ము  కాచి పెంచాల్సిన అమ్మ పసి పాదాలు తాకితే పులకరించాల్సిన అమ్మ బోసి నవ్వులు చూసి మురిసిపోవాల్సిన  అమ్మ బిడ్డల అడుగులు తడబడితే వేలు పట్టి  ముందుకు నడిపించాల్సిన అమ్మ   ప్రేమానురాగాలు అద్ది తీర్చి దిద్దాల్సిన అమ్మ  గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెద్దవాళ్ళను చేయాల్సిన  అమ్మ బిడ్డలకు అనురాగ ఋణం పంచాల్సిన అమ్మ బాల్యంలోనే మమ్ముల ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి.... అమ్మ.... నీకు జోహార్... అమ్మ నువ్వెక్కడ ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా... నీ ...

మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష

గుంటూరు మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష గుంటూరు మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించలేదని పేర్కొంటూ.. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెలరోజుల పాటు జైలు శిక్ష.. రూ. 2వేల జరిమానా విధించింది. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని కీర్తికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ సుభాషన్న బహిరంగ లేఖ అనేక సంవత్సరాలుగా విద్యార్థులు యువకులు ప్రజా ఉద్యమకారులు వివిధ రూపాలలో పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్త కుప్పలో విసిరేశారనీ... భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐఎంఎల్ సెక్రటరీ జై బోరన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. దీనితో నూతనంగా కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రేస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, లేదా కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనో, ఆయా సెక్షన్ల ప్రజలకు ప్రకటించిన డిక్లరేషన్లను నమ్మో వారికి ఓట్లు వేసి గెలిపించ లేదనీ.. బీఆర్ఎస్. ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడ్డాయనీ జై బోరన్న, సుభాష్ చంద్రబోస్, రిషి నేతాజీ, రాజన్న జె.ఎస్.ఆర్. నేడు ఇక్కడ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి పోలాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియమకాలను ఆశించిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇవి లభించలేదనీ .....