Skip to main content

Posts

Showing posts from January, 2024

విశాఖ త్రీ టౌన్ లా అండ్ ఆర్డర్ సి.ఐ.గా ఏ. పార్థసారథి బాధ్యతలు చేపట్టారు

 

పెందుర్తి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సి.ఐ.రామకృష్ణ..

 

More than 50 flights delayed at Indira Gandhi International (IGI) airport.

Delhi: dense layer of fog and reduced visibility affects operations to and from Delhi.  More than 50 flights delayed at Indira Gandhi International (IGI) airport.

విశాఖ రేంజ్ డీఐజీ గా విశాల్ గున్ని IPS....

 

చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

 

షర్మిలతో సమావేశమైన సునీత

 షర్మిలతో సమావేశమైన సునీత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.  ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

ఆంద్రప్రదేశ్: ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా??

 ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అర్ కె రోజా...? ఆంద్రప్రదేశ్: ఒంగోలు వైసిపి  ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు ప్రాధమిక సమాచారం....  ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్.... పార్టీ నేత విజయసాయిరెడ్డి జిల్లా నేతలకు సమాచారం.... ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించగా  మాజీ మంత్రి బాలినేని తొ సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించడంతో రోజా పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం...

ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

 *ఈ  నెల 31న ఏపీ కేబినెట్ భేటీ * ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్... అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ  పరిశీలనలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం  రాజకీయ పరిస్థితి బట్టి ఉచిత ప్రయాణం పై నిర్ణయం జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళిక పై మంత్రులతో చర్చ
 

యారాడ బీచ్ లో విదేశీయుడు పై దాడి చేసి సెల్ఫోన్ రాబరీ చేసిన నిందితుల్ని 12 గంటల లోపే పట్టుకున్న న్యూ పోర్ట్ క్రైమ్ పోలీసులు.

యారాడ బీచ్ లో విదేశీయుడు పై దాడి చేసి సెల్ఫోన్ రాబరీ చేసిన నిందితుల్ని 12 గంటల లోపే పట్టుకున్న న్యూ పోర్ట్ క్రైమ్ పోలీసులు.  తేదీ 24/01/2024 ఉదయము 9 గంటల ప్రాంతంలో యారాడ బీచ్ లో గుర్తు తెలియని వ్యక్తులు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఒక సందర్శకుడిని కొట్టి సెల్ఫోన్ లాక్కెలిపోయిన సంఘటనలో డీసీపీ క్రైమ్స్,ఏ డి సి పి క్రైమ్స్ సూచనల మేరకు హార్బర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ పోర్టు క్రైమ్ ఎస్.ఐ  జి.వి. ప్రసాద్ మరియు సిబ్బంది 12 గంటల్లోపే ముద్దాయిలను పట్టుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపడమైనది. 

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగం

 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసం గించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు.  భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్‌ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.  ప్రజాస్వామ్యానికి తల్లి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే  భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్‌కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్మ...

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..

 దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..  ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన..  మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం..  డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం..  తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు..  డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం..  ఏపీ విద్యావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై శకటం..  16 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన..  గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు..

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ.

 మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ. . AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు V.V. లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు.  రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి ₹15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న SI, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు..

BEST PERFORMANCE AWARD-2023

BEST PERFORMANCE AWARD-2023                         అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఆధ్వర్యంలో నిర్వహించిన *BEST PERFORMANCE AWARD-2023* కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి గారు , వైస్ ఛాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటీ మరియు జి.శ్రీనివాసన్ గారు, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్, ఎవిఎస్ఎం, విఎస్ఎం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.*                             ఈ రోజు 24/01/2024 న బీచ్ రోడ్ నందు గల ఏ.యూ కన్వకేషన్ సెంటర్ లో నందు నిర్వహించిన *BEST PERFORMANCE AWARD-2023* కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు.                              ఈ కార్యక్రమంలో Addl.DGP, కమీషనర్ ఆఫ్ పోలీస్ & AddL జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు మాట్లాడుతూ ముఖ్య అతిథులకూ, మహిళా పోలీసులక...

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..

 కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..*  *ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..* *హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..*  *చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం..* *ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం.*

వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల

 విజయనగరం వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు  బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది బీజేపీ ఒక మత తత్వ పార్టీ... ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీ కి జగన్ అమ్ముడు పోయాడు బీజేపీ ఎవరికి శ్రేయస్కరం కాదు రాహుల్ గాంధీ ప్రధానిగా గెలిచిన తర్వాత మొట్ట మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీద పెడతా అన్నారు అంతలా ఏపి మీద కాంగ్రెస్ కి భాధ్యత ఉంది కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం కార్యకర్తలు పని చేయాలి  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..

ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..  ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు..  ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్..  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్‍లో ఎన్నికలు.. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‍గా పెట్టుకున్న ఈసీ..  రాష్ట్రాలను సమాయత్నం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం..  లోక్‍సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు..  ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి..  ఏప్రిల్ లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం.. ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. లోక్‍సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..  ఎన్నికల తేదీలపై ఆరా తీసిన రాజకీయ పార్టీలు..  ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు చెప్పిన ఢిల్లీ సీఈవో..  ఢిల్లీ సీఈవో ఇచ్చిన తేదీపై ఈసీ వివరణ..

ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ షాక్

ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ షాక్  దాదాపు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇంత కాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్రవేయడం చర్చగా మారింది. అయితే, దీనికి వెనుక అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, ఘంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్‌ అయ్యింది.. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ వ్యూహం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇదే సమయంలో.. పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది..  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అయితే. ఆ నలుగురిపైనా వేటు పడుతుందని టీడీపీ భావిస్తోంది.. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేస్తోంది టీడీపీ.. తమ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలపై తామిచ్చిన డిస్ క్వాలిఫికేషన...

నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు

టూరు జిల్లా... నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికి కూడా రాజీనామా  పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశాను.

షర్మిళ కన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు అని వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమీషనర్ వివరణ

నాలుగు పార్టీలు........- రెండు కుటుంబాలు.......*

 *నాలుగు పార్టీలు........- రెండు కుటుంబాలు.......* విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జూఖీ వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హై కమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరోసారి ఏపీ లో పవర్ లోకి రావడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు .జూ    షర్మిల. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లో నే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి ఊపిరి పోయ్యాలన్నా.. గత వైభవం దిశగా పార్టీ నీ నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యం అని కాంగ్రెస్ హై కమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్సార్ పై అభిమానం ఉ...

శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు

 నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు రూ. 357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. కాగా మొన్నటి వరకు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రద్దీ విపరీతంగా ఉండేది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు శబరిమలకు పోటెత్తారు.. రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురౌంది భక్తులు ఎక్కువగా ఉన్న తరుణంలో కొంత మంది భక్తులు వెనక్కి కూడా వెళ్లారు..

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు.. 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది..

జన సంఘ్

 

అనకాపల్లి జిల్లా పోలీసు

 *అనకాపల్లి జిల్లా పోలీసు *జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది జనవరి 19న మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్  కేసులు నమోదు చేశారు. ❇️ *అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., వారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, జూదం తదితర లు అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వీటిలో పేకాట, బల్లాట తదితరాలపై 5 కేసులు నమోదు చేసి, 20 మంది నిందితులను అరెస్టు చేసి, రూ.22,040/- నగదు ను మరియు కోడిపందాల పై దాడులు నిర్వహించి 5 కేసులు నమోదు చేసి, 14 మందిని అరెస్టు చేసి, 12 పందెం కోళ్లు, రూ.9,460/- నగదును స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు.*  ❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 07 మందిపై కేసులు నమోదు చేశారు. ❇️బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 59 మంది పై  కేసులు నమోదు చేశారు. ❇️ప్రజలకు దిశా🆘యాప్ పట్ల అవగాహన కల్పించి, 34 మందితో యాప్ డౌన్లోడ్ చేయ...

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ - ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీం*

 *చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ - ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీం* స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  దీనిపై కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే 4 వారాల సమయం కోరారు. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని విన్నవించారు.  ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్‌ చెప్పగా.... ఫిబ్రవరి 12న విచారణ చేయాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్టోబర్​ 31న మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.  అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన షరతులపై హైకోర్టు నవంబర్​ 20న స్పష్టత ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ షరతుల నెల28 వరకే వర్తిస్తాయని పేర్కొంటూ సాధారణ బెయిల్ మంజూరు చేసింద...

ఆంధ్రప్రదేశ్....చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం...

 ఆంధ్రప్రదేశ్....చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం... ▪️రాంగ్ రూట్లో వెళ్లిన చంద్రబాబు హెలికాప్టర్. ▪️పైలట్ ను హెచ్చరించిన ఏటీసీ. ▪️ఏటీసీ వార్నింగ్ తో మళ్లీ రైట్ రూట్ లోకి హెలికాప్టర్... ▪️విశాఖ నుంచి చంద్రబాబు అరకు వెళ్తుండగా ఘటన....*

పత్రిక ప్రకటన విశాఖపట్నం సిటీ తేది 20-01-2024

పత్రిక ప్రకటన విశాఖపట్నం సిటీ తేది 20-01-2024                                అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో 08 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు తన సేవలు అందించి, ఈ రోజు తేదీ 20-01-2024 న మృతి చెందిన పోలీసు జాగిలం *గ్రేసీ* కు నివాళులు అర్పించడం జరిగినది.                            లేబ్రోడర్ రిట్రైవర్ జాతికి చెందిన గ్రేసీ 2016 నుండి 2024 వరకు సుమారు 8 సంవత్సరాల పాటు ఎక్స్ ప్లోజివ్ ట్రేడ్ కి సంబందించి సేవలను పోలీసు శాఖకు అందించింది.                           ఈ రోజు మృతి చెందిన పోలీసు జాగిలం *గ్రేసీ* కు నగర  ఏ.సి.పి-01(ఏ.ఆర్) శ్రీ ఐ.మోహన్ కుమార్ గారు, ఏ.సి.పి-02(ఏ.ఆర్) శ్రీ ఎ.రాఘవేంద్ర రావు గారు, ఆర్.ఐ(సి.ఎస్.డబ్ల్యూ) శ్రీ .K.రవి కుమార్ గారు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొని త...

తెలుగుదేశం పార్టీ 73 పేర్లతో తొలి జాబితా సిద్ధం

*తెలుగుదేశం పార్టీ* పొత్తులోభాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను విడిచి పెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో  ఖరారు చేసిన అభ్యర్థులు* #   *తెలుగుదేశం పార్టీ   73  పేర్లతో తొలి జాబితా  సిద్ధం* #  *తొలి జాబితాలోని పేర్లు ఇవే.* 1) ఇచ్ఛాపురం - బెందాళం అశోక్  2) టెక్కలి - అచ్చెనాయుడు  3) ఆముదాలవలస - కూన రవికుమార్ 4) పలాస - గౌతు శిరీష  5) రాజం - కొండ్రు మురళీ మోహన్  6) బొబ్బిలి - బేబీ నాయన 7) విజయనగరం - అశోక్ గజపతి రాజు 8) చీపురుపల్లి - కిమిడి నాగర్జున 9) కురుపాం - టి.జగదీశ్వరి 10) పార్వతి పురం - బి. విజయచంద్ర 11) వైజాగ్ (తూర్పు) - వెలగపూడి రామకృష్ణబాబు 12) వైజాగ్ (పశ్చిమ) - గణబాబు 13) పాయకరావుపేట - అనిత 14) నర్సీపట్నం - చింతకాయల విజయ్  15) తుని-యనమల దివ్య 16) జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ 17)  పెద్దాపురం - చినరాజప్ప 18) అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి 19)రాజమండ్రి (అర్బన్) - ఆదిరెడ్డి వాసు 20) గోపాలపురం - మద్దిపాటి వెంకట్రాజు 21) ముమ్మడివరం - దాట్ల సుబ్బరాజు 22)అమలాపురం - బత్తుల ఆనందరావు 23)  మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు 24...

నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితా

 ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది.  ఈరోజు లేదా సోమవారం లిస్ట్ విడుదల చేసే అవకాశముంది.  ఆశావహులు, సిట్టింగ్ MLAలు అమరావతికి క్యూ కడుతున్నారు.  CM, అధిష్ఠాన పెద్దలతో కలిసి తమ సీటుపై చర్చిస్తున్నారు.  నిన్న MLAలు ద్వారంపూడి చంద్రశేఖర్ (కాకినాడ), వేణుగోపాల్(దర్శి), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), మంత్రి కొట్టు సత్యనారాయణ, తదితరులు అమరావతికి వెళ్లారు.

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ఇస్తోంది. దీక్షపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రంతా దీక్షా ప్రాంగణంలోనే పోలీసులు బస చేశారు.. ఫంక్షన్ హాలు ఖాళీ చేయించాలని యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నది పోలీసులేనని సమత సైనిక్ దళ్ ఆరోపిస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు కోడికత్తి శ్రీను సైతం విశాఖ జైలులో మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్నాడు. జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని శ్రీను కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇవాళ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నిన్న దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. నిన్న పోలీసులకు, సమతా సైనిక్ దళ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది..

అయోధ్యలో ఉగ్రదాడి జరగొవచ్చు

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్యలో ఉగ్రదాడి జరగొవచ్చు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  నిఘా నీడలో.. అయోధ్య రాములోరి ఆలయం (Ram Mandir) వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), సీఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యూలరీ (పీఏసీ), ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సోమవారం 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) శిక్షణ అందించారు. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యుహాలను తిప్పికొట్టడంలో నిష్ణాతులు. 1990 నుంచి రామజన్మభూమి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వహించనుంది. రెడ్ జోన్‌లో పీఎసీ, యూపీ పోలీసులు, ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 1400 మందిని మోహరించా...

చంద్రబాబు.... బహిరంగ సభలు.అరకు మండపేటలో

 నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో జనసమీకరణ చేస్తున్నారు..  పలువురు YCP నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి.  22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రేపు అయోధ్యకు బయల్దేరుతారు..

ప్రతి రక్తపు బొట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది

Nara Bhuvaneshwari: ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి హైదరాబాద్‌: ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని 'ఎన్టీఆర్‌ ట్రస్ట్‌' మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు.. ''ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది. ఆయన వర్ధంతికి ఏటా లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు నిర్వహిస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు.. మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది . ట్రస్ట్‌ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక సేవ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం'' అని భువనేశ్వరి అన్నారు..

22 నుంచి అఖిల భారత పోలీస్ కమాండో చాంపియన్ షిప్

 22 నుంచి పోలీస్ కమాండో చాంపియన్ షిప్ పోటీలు - 30 న ముగింపు ఉత్సవం - గ్రే హౌండ్స్ అదనపు డీజీపీ రాజీవ్ కుమార్ మీనా (కాపులుప్పాడ - విశాఖ భీమిలి) అఖిల భారత పోలీస్ కమాండో చాంపియన్ షిప్  కాంపిటేషన్స్ - 2024 ఈ నెల 22 నుంచి 30 వరకు జరుగు తాయి అని   గ్రేహౌండ్స్ అదనపు డిజిపి (ఆపరేషన్స్) రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు. దేశంలో 2008 నుంచి ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటేషన్స్ జరుపబడుతున్నాయి అని గుర్తు చేశారు.  ప్రస్తుతం నిర్వహించబడుతున్న  ఏఐపిసిసి-2024 కు ఏపీ పోలీస్ తరపున గ్రేహౌoడ్స్ అతిధ్యం ఇస్తోంది.  విశాఖ కాపులుప్పడ గ్రేహౌండ్స్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ పోటీలలో మొత్తం 23 జట్లు తలపడనున్నాయి. ఈ  పోటీలలో 16 రాష్ట్ర పోలీస్, 7 కేంద్ర పోలీస్ సంస్థల జట్లు వున్నాయి.  మొత్తం ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది అన్నారు. సామర్ధ్యం,నైపుణ్యం,ఓర్పు ప్రదర్శించి అత్యున్నత స్థాయి  కోసం జట్లు తలపడతాయి అని పేర్కొన్నారు. ఈ పోటీలకు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధి గా రాష్ట్ర హోoమంత్రి తానేటి వనిత పాల్గొంటారు అన్నారు....

ఆర్టీసీ డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి- ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అమ్మి నాయుడు

ఆర్టీసీ డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి- ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అమ్మి నాయుడు  డ్రైవర్లు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అని ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎస్. అమ్మి నాయుడు కోరారు. ఆయన వాల్తేరు డిపోలో గురువారం జరిగిన రోడ్డు భద్రతా మాసో త్సవలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులు బస్టాప్ వద్ద సక్రమంగా ఆపాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్.ఏ. గణేష్ రెడ్డి మాట్లాడుతూ, సిబ్బంది ఎడ్యుకేట్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్ మెంట్ (ఈ ఈ ఈ) ద్వారా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, సిటీ బస్సుల్లో ఫుట్ పాత్ మీద హ్యాంగింగ్ లేకుండా కండక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. డిపో మేనేజర్ కే. సుధాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 15 న మొదలైన మాసొత్సవలు ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయి అన్నారు. డ్రైవర్స్ మీద మానసిక ఒత్తిడి నివారణకు గాను వారి కుటుంబ సభ్యులుకి కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నారు. అలాగే, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో గ్యారిజి కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.
 నేతల్లో నాల్గో జాబితా టెన్షన్ అన్అధ్ధిరల్కార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు రాజకీయాల్లో ఆసక్తిని పెంచేశాయి. నేడు నాలుగో జాబితా విడుదలకు సిద్దమైనట్టు తెలుస్తోంది. మొదటి లిస్ట్లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్లో 27 మందిని మార్చారు. మూడో లిస్ట్లో 21 మందిని మార్చారు. ఈ నాలుగో లిస్ట్ పై అన్ని జిల్లాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది ఎక్కువగానే ఉందని సమాచారం.

సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో

 విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు)  శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో  నేటి నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగనున్న శ్రీనివాస్ తల్లి, సోదరుడు దాడి కేసులో తనకు బెయిల్ బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్షకు దిగుతున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు

లావు శ్రీ కృష్ణదేవరాయలుకు నరసరావుపేట ఎంపీ కి "నో"చెప్పిన వైసీపీ

 *లావు శ్రీ కృష్ణదేవరాయలుకు నరసరావుపేట ఎంపీ నుండి "నో"చెప్పిన వైసీపీ * *ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ కు కేంద్రం నుండి ఎన్నో నిధులు తెచ్చానని అభివృద్ది కుంటుపడకుండా ఉండాలంటే తనకు నరసరావుపేట ఎంపీ సీటును కేటాయించాలని అధిష్టానం వద్ద స్పష్టం చేసిన నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణ దేవరాయలు* *లావు శ్రీకృష్ణ దేవరాయలుకు నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఇవ్వకపోతే వైకాపా కొన్ని అసెంబ్లీలలో ఓటమి చెందక తప్పదని అధిష్టానానికి నివేదించిన ఐ ప్యాక్ టీమ్* *టీడీపీ బరిలో నుండి పోటీచేసే దిశగా నరసరావుపేట ప్రస్తుత ఎంపీ లావుశ్రీకృష్ణ దేవరాయలు?* సినీ నటుడు ఆలీ ని నరసరావుపేట పార్లమెంట్ బరిలో నుండి పోటీకి దించాలనే యోచనలో వైసీపీ అధిష్టానం భావన సినీ నటుడు ఆలీ బిసీ సామాజిక వర్గానికి చెందిన వారు.నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి తప్పనిసరిగా  బీసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని వైకాపా భావిస్తోంది.ప్రస్తుతం సినీ చెరిష్మా ఉన్న నటుడు,వైకాపా సానుభూతి పరుడు సినీ నటుడు ఆలీని వైకాపా అధిష్టానం నరసరావుపేట పార్లమెంట్ బరిలోదింపాలని చూస్తోంది.ఈ అభిప్రాయంపై సినీ నటుడు ఆలీ ఎలా స్పందిస్తోర...

పులివెందుల నుంచి షర్మిల

 కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.  పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.  2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం APలో ఇదే తొలిసారి కాగా.. ఇద్దరూ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఉత్కంఠపోరు సాగే ఛాన్సుంది.  అటు అన్న ప్రభుత్వంపై షర్మిల విమర్శల బాణాలు ఎలా ఎక్కుపెడతారనేది ఆసక్తిగా మారింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది

 తిరుమల తిరుపతి లో పెరుగుతున్న భక్తుల రద్దీ తిరుపతి జనవరి 17  తిరుమల తిరుపతి దేవస్థానంలో  బుధవారం భక్తుల రద్దీ పెరిగింది . ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించు కోవాడినికి భక్తులకు 16 గంటల సమయం పడు తుంది. స్వామివారికి దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుం టున్నారు. కాగా, మంగళవారం శ్రీవారి 73,016 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 20,915 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46కోట్లు వచ్చిందని టిటిడి అధికారు లు వెల్లడించారు.

తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం

 PM Modi: పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది: మోదీ పెనుకొండ: మన పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను ప్రధాని మంగళవారం ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ...''వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్‌ ఏర్పాటు చేశాం. ఇది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుంది. సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉంది. గాంధీజీ అనేక సార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారు. రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని ఆయన చెప్పారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలి. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం నాసిన్‌.. దేశంలో ఆధునిక ఎకో సిస్టంగా మారనుంది. ఇక్కడ జరిగే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎంతో ప్రయోజనం. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేది. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలి. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సుల...