అమిత్ షా గో బ్యాక్.....

 అమిత్ షా గో బ్యాక్






రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్'ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా గో బ్యాక్ అంటూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో జెండామాల్ జంక్షన్లో ఆదివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా సీపీఎం, సీపీఐ నాయకులు పి.శంకరరావు, ఎస్.గోపాలం, బి.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, కోట అప్పన్న మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసి అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా రాష్ట్ర పర్యటనను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం