రిమ్మనపూడి గ్రామ అభివృద్ధిలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న
*కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం*
*రిమ్మనపూడి గ్రామ అభివృద్ధిలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న (NATS) చైర్మన్ కంచర్ల నందకిషోర్*
రిమ్మనపూడి గ్రామ వాస్తవ్యులైన కంచర్ల నందకిషోర్ ( NATS) ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ తన స్వగ్రామమైన రెమ్మనపూడి గ్రామాన్ని పరిశీలించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ నాకు అధ్యక్ష పదవి వచ్చిన కారణంగా మా రిమ్మనపూడి గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు నాకు సాదర స్వాగతం పలికారు
రిమ్మన్నపూడి గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రిమ్మనపూడి లో ఉన్న ప్రజల అవసరాలు తెలుసుకున్నాను
ఊరికి కావాల్సిన రోడ్లు ఎల్ఈడి బల్బులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి నిర్మించాలని నిర్ణయించాము.
రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో మా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.
ముందు ముందు రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగాతెలియజేస్తున్నాను.
అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికాలో స్థిరపడిన వారికి ఏటువంటి సహాయ సహకారాలు అయినా అందించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరపున మా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.
ఎవరికైనా సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 1888 నెంబర్ కు కాల్ చేస్తే మా సంస్థ తరఫున వాళ్లు స్పందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని తెలియపరిచారు.
గత 15 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలుఅందిస్తున్నామని తెలిపారు.మా సేవా కార్యక్రమాలను అమెరికాలో నివసించే ప్రజలు మరియు అక్కడ చదువుకునే విద్యార్థులు కూడా మహా సేవలను అందుకుంటున్నారు అని తెలిపారు.
రిమ్మనపూడి గ్రామ వాస్తవ్యులైన తుమ్మల శేషు బాబు మాట్లాడుతూ రిమ్మనపూడి గ్రామ ప్రజలకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా తెలియపరిచారు.






Comments
Post a Comment