సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు

 సాతులూరు వద్ద రైతుల ధర్నా: హైవేపై నిలిచిన వాహనాలు


చిలకలూరిపేట:గుంటూరు - కర్నూలు హైవేపై  నాదెండ్ల మండలం సాతులూరు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాతులూరు నుండి చందవరం వెళ్లే దారిలో ఉన్న AMR సంస్థ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు, రైతులు భారీ ధర్నా చేపట్టారు. తమ వాహనాల రాకపోకలపై ప్రతిసారి డబ్బులు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైవేపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు.ఈ క్రమంలో రైతులు, AMR సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తక్షణమే ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి