ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే

 విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకె క్విజ్ పోటీలు.

 ఘనంగా వరల్డ్ స్కిల్ యూత్ డే 















 సుండుపల్లి. సంబేపల్లి. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్విజ్ పోటీలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ వై పద్మావతి తెలిపారు. బుధవారం దేవపట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు వరల్డ్  యూత్  స్కిల్ డే ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్. ఎస్సే రైటింగ్. క్విజ్. వంటి పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరినప్పుడే ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి కష్టపడి చదివి ఎంతోమంది మేధావులుగా గుర్తింపు పడ్డారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విద్యాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని  వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో  రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సునీత వోకేషనల్ టీచర్ జి వెంకట రమణమ్మ  టీచర్స్  విద్యార్థినిలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది