రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 8 మంది మృతి?*

 *రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 8 మంది మృతి?*




చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్‌రోడ్డు సెంటర్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఘటనా స్థలిలోనే సుమారు 4 నుంచి 6మంది దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం