డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం
డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొమ్మ మురళీకృష్ణ గారికి ఘన పదవీ విరమణ సన్మానం
చీరాల: డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన శ్రీ బొమ్మ మురళీకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దంపతులను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. వెంకటరత్నం గారు, బాపట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి ఐ. ధనలక్ష్మి గారు, నెంబర్-1 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.వి. సుబ్బారావు గారు, చీరాల నెంబర్-2 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. మల్లికార్జునరావు గారు, చిలకలూరిపేట సెక్షన్-1 ఏఈఈ శ్రీ ఎస్. సుబ్బరామిరెడ్డి గారు, అంజిబాబు గారు, తెనాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.వి.ఎల్. ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.
అలాగే చీరాల, రేపల్లె ప్రాంతాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డ్రైనేజీ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మ మురళీకృష్ణ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
సేవా కాలంలో ఆయన అందించిన సేవలను పలువురు అధికారులు కొనియాడుతూ, భవిష్యత్తు జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Comments
Post a Comment