మాంసపు దుకాణాలు బంద్

 *గాంధీ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలు బంద్*



*కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ పి శ్రీహరి బాబు*


చిలకలూరిపేట పట్టణంలో రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని మాంసపు దుకాణాలు, మాంసాహారం విక్రయించే రెస్టారెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాంసం విక్రయాలు నిలిపివేయాలని ఇప్పటికే సంబంధిత వ్యాపారులందరికీ ముందస్తు నోటీసులు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, మాంసం అమ్మకాలు చేపట్టినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి. శ్రీహరి బాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.