*కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన

 *ప్రకాశం జిల్లా...*



*కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు.* 


*సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు* 

*అభినందించిన జిల్లా ఎస్పీ..గరుడ్ సుమిత్..*


దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్‌లు రిసీవర్లను పట్టుకోడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 8 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు విశేష ప్రయత్నాలు చేసి తక్కువ వ్యవధిలో (1 వారంలోపు) 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను గుర్తించారు. ఇద్దరు మొబైల్ దొంగతనాల నేరస్థులను  వాటిని కొనే 5 మొబైల్ షాప్ యజమానులను అరెస్టు చేయటం జరిగింది. సాంకేతికత ఇతర ఆధారాలను ఉపయోగించి దొంగిలించబడిన మొబైల్‌లను సేకరించటం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి..