ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య.

 




*తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.*


*💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥


*👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు*


 తిరుపతి  జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నెలబల్లి సమీపంలో  ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు,వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్ కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూసారు,తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి  బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు,

బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు,నిందుతుడు  బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,