Skip to main content

Posts

Showing posts from June, 2025

ప్రసిద్ధ శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు

వెల్కమ్ టు న్యూస్ 9 | న్యూస్ 9 కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ దీప్తి. మార్కాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కనకధారా స్తోత్రం, వారాహి కవచం వంటి శ్లోకాల పారాయణం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 11 హారతులు సమర్పించి, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. వారు Offered ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా దేవాలయానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారాహి అమ్మవారికి జై!

మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది* .

 *ప్రతిఒక్కరం మనస్సాక్షిని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైంది* ...      *అధికారం కోసం నాయకులు దిగజారటంలో కొంత అర్థంఉంది. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడం, హోదాను అనుభవించడం, అధికారులపైన మరియు ప్రజలపైనపెత్తనం చలాయించవచ్చునుకాబట్టే.*       *కాకపోతే అంతేస్థాయిలో ప్రజలు ఎందుకు దిగజారిపోతున్నారో? అంతుపట్టడంలేదు. ఈరోజు డబ్బులుఉంటే కసబ్ లాంటి  నరహంతకుడ్నికూడా ఎన్నికల్లో గెలిపించే పరిస్థితిఉంది. దావూద్ ఇబ్రహీంలాంటి మాఫియావ్యక్తులను, అవినీతి అనకొండలను, నైతికత విలువలులేని వ్యక్తులనుకూడా డబ్బులుతీసుకుని గెలిపించే పరిస్థితులు దాపురిచ్చాయి. తర్వాత వాళ్లకింద బానిసలుగా బ్రతకడానికి కూడా సిగ్గు పడటంలేదు. ఆత్మఅభిమానం చంపుకొని, వాళ్లకి కూడా ప్రజలు  భజనచేస్తున్నారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం  ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి. అవినీతి అంతం వైపు అడుగులు వేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు గూగుల్ సెర్చ్🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. CRPFI. ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ. PR. ద...

నిరుపయోగంగా పడి వున్న కొన్ని ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలను అమలు చేయాలి.*

 *నిరుపయోగంగా పడి వున్న కొన్ని ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలను అమలు చేయాలి.* కొంతమంది చేస్తున్న కాలక్షేప ఉద్యోగులపై ప్రత్యేక నిఘా ద్వారా చర్యలు చేపట్టాలి.  అవినీతి లో పట్టుబడ్డ ఉద్యోగుల ఫోటోలు సంబంధిత కార్యాలయం బయట పెట్టాలి.  అవినీతి నిరోధక శాఖ ను పోలీస్ శాఖ నుండి వేరు చేయాలి.  కాలయాపన లేని విధులను అమలు చేసే కఠిన చట్టాలు పాలనకు ఎంతయినా అవసరం వుంది.  నిత్యం వినియోగ దారులుతో పాటుగా సామాన్యుల నుండి మేధావులు అనునిత్యం తెలిసి తెలియకుండా కూరగాయల తూనికల కొలత నుండి ప్రతి నిత్యావసరాల సరుకులు వరకు మోసపోతూనే ఉంటామని,అందుకు కారణం ప్రధానంగా తూనికలు కొలతలకు సంబంధించిన శాఖ నిరంతరం అవినీతి మత్తులో వుంటు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిం చటమే ఇందుకు బలమైన కారణం అని,ఎవరైనా ఈ శాఖ వారికి పిర్యాదు చేసినా ఫిర్యాది దారులను మానసిక వికలాంగుల వలె మార్చేస్తారని,ఈ శాఖ పనితీరు ఎవరికి అర్ధం కాదని,ఈ శాఖ  ఎందు కుందో కూడా తెలియదని, క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు అవినీతి పుట్టఅని,కాటాలను (త్రాసు)తనిఖీ చేయటం కూడా చాలా పనిభారంగా ఈ శాఖ వారు భావిస్తారు. ప్రమాద కరమైన రసాయనాలు తో మోసపూరితంగా ప్రజల...

RNI లేని పత్రికలపై వేటు

 *RNI లేని పత్రికలపై వేటు* TEL నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి... PRGI కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు .. త్వరలో జిల్లా DPRO లకు ఉత్తర్వులు *PRESS REGISTRAR GENERAL OF INDIA* ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని RNI లేని పత్రిక లు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పి డి ఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్,PRGI. న్యూ ఢిల్లీ అప్పీలు చేయగా ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి RNI లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది  కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు RNI లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్ర...

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు*

 *వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు* ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.  వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.  ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ  https:/consumerhelpline.gov.in/  వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో పొందుపరుస్తోంది.🙏?...

విద్యార్థి తల్లిదండ్రులారా..మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌ లో

 విద్యార్థి తల్లిదండ్రులారా... జులై 5 వ తేదీ న మన పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల లలో జరిగే ...మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌ లో.. తప్పక హాజరు కావాలి.....  మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులు అడగవలసిన అంశాలను మరింత వివరంగా, ప్రతి విభాగానికి స్పష్టమైన ఉదాహరణలతో కింద ఇవ్వబడింది. ఈ ప్రశ్నలు మీకు మీ పిల్లల పురోగతిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, పాఠశాల నుండి అవసరమైన మద్దతును పొందడానికి సహాయపడతాయి. 1. పిల్లల విద్యా సంబంధిత పురోగతి (Academic Progress) పిల్లలు పాఠశాలలో ఎలా రాణిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. వారి సామర్థ్యాలు, బలహీనతలు, మరియు వాటిని మెరుగుపరచడానికి తీసుకోదగిన చర్యలపై దృష్టి పెట్టండి.  * తరగతి పనితీరు మరియు సామర్థ్యాలు:    * "నా బిడ్డ తరగతిలో అకడమిక్‌గా ఎలా రాణిస్తున్నారు? ఏ సబ్జెక్టుల్లో (ఉదాహరణకు, గణితం, తెలుగు, సైన్స్) బాగా రాణిస్తున్నారు మరియు వారు ప్రత్యేకంగా ఆసక్తి చూపించే రంగాలు ఏమైనా ఉన్నాయా?"    * "ఏ సబ్జెక్టుల్లో వారికి ఎక్కువ శ్రద్ధ అవసరం? ఆయా సబ్జెక్టుల్లో వారికి ఏ అంశాలు కష్టంగా అనిపిస్తున్నాయి?"    * "వారు ప్రస్...

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక

 చిలకలూరిపేట న్యూస్9: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక  ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ ఆఫీసులో గల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా అద్దంకి వర ప్రసాద్ ను సభ్యుల ఏకగ్రీవం గాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల  పరిష్కారం కోసం పోరాటం చేస్తామని అన్నారు. యూనియన్ బలోపేతం కృషి చేస్తామని తెలిపారు అనంతరం వారిని సభ్యులు సత్కరించారు . ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రాణాలకు విలువ ఇవ్వండి

 *ప్రాణాలకు విలువ ఇవ్వండి _  మితిమీరిన వ్యక్తి పూజను ఇకనైనా ఆపండి!  లోక్ సత్తా..* విష సర్పాలను సైతం రక్షించి పచ్చిక బయలు ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టి,  వాటి వలన కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ  సర్పాలను సైతం చంపొద్దు అని ప్రచారం చేసే "పుణ్యభూమి"అయిన భారతదేశంలో మనిషి ప్రాణాలకు విలువే ఇవ్వలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో రాజకీయ పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయుటకు సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంటే, ఒక్క భారతదేశంలో మాత్రమే అయినదానికి  ,కాని దానికి అభిమానం పేరిట రోడ్లెక్కించడం పరిపాటిగా మారిందని అన్నారు.  ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో నిండు ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పరిస్థితి కూడా అటువంటిదేనని అన్నారు. అభిమానులు వ్యక్తి ఆరాధనతో ప్రాణాలను ఫణంగా పెడుతుంటే నాయకులు మాత్రమే ఎప్పటికప్పుడు వారి ఆస్తులను, పదవులను వారి కుటుంబ సభ్యులకు  పంచుకుంటున్నారని అన్నారు. పన...

విజయనగరం జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాసరి సురేష్ నియామకం

 విజయనగరం జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాసరి సురేష్ నియామకం పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన విజయవాడ, న్యూస్ నైన్ జూన్ 21: పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లాకు కొత్త అధ్యక్షుడుగా నియమించింది. ఈ బాధ్యతకు  దాసరి సురేష్ ని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ, జిల్లా స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా అతని పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులలో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదుగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

పసుమర్రు మహిళ వినియోగదారు విజయం

 పసుమర్రు మహిళ వినియోగదారు విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన వినియోగదారుల సంఘం నాయకులు మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందినటువంటి పి మరియమ్మ అనేమహిళ వినియోగదారుల  కోర్టులో విజయం సాధించడం పట్ల పలనాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు . ఆయన తెలిపిన వివరాల ప్రకారం  పసుమర్రు గ్రామానికి చెందిన వంటి పచ్చికర్ల మరియమ్మ అనే మహిళకు పసుమర్రు యూనియన్ బ్యాంకు లో ఖాతా కలదు. రూ 16,500 పొదుపు చేసుకుంది. కాగా ఆమెకు తెలియకుండా ఆమె సొమ్ము 16,500 వేరొకరికి ఖాతాకు యూనియన్ బ్యాంకు సిబ్బంది ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించడం జరిగింది అయినా ఆమెకు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో. ఆమె బ్యాంకింగ్  అంబుడ్స్ మెన్ కు పిర్యాదు చేశారు.   విచారణ జరిపిన బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ఆమె ఖాతాకు  16,500తిరిగి ఆమె ఖాతాకు జమ చేయాలి బ్యాంక్ అధికారులు ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో మనోవేదనకు గురైన మహిళ ఈ విషయాన్ని గౌరవ న్యాయవాది గుదే రవితేజ ద్వారా వినియోగదారుల కోర్టు లో  ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు పూర్వపరాలు విచా...

రైల్వే లైన్ కూలిపోవడమే కుమారుడి కస్టడీ మరణానికి కారణమని అనుమానిస్తున్న మహిళకు ₹2 లక్షల పరిహారం

 *రైల్వే లైన్ కూలిపోవడమే కుమారుడి కస్టడీ మరణానికి కారణమని అనుమానిస్తున్న మహిళకు ₹2 లక్షల పరిహారం* *ఛత్తీస్‌గఢ్ హైకోర్టు⚖️*     20-06-2025 ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ తన 27 ఏళ్ల కుమారుడు సూరజ్ హత్థెల్ పోలీసు కస్టడీలో ఉండగా మరణించడంతో హైకోర్టును ఆశ్రయించింది. కస్టడీలో జరిగిన మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, తన కొడుకు కోల్పోయినందుకు పరిహారం కోరుతూ పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అతని అసహజ మరణానికి దారితీసిన హింసకు పోలీసులే కారణమని, రాష్ట్రం కీలకమైన ఆధారాలను అణిచివేయడానికి ప్రయత్నించిందని ఆమె ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు మరియు సాక్ష్యాలను పొందే అవకాశం కోసం డిమాండ్ ఈ కేసును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం నివేదిక, మెజిస్టీరియల్ విచారణ నివేదిక మరియు సంబంధిత పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె ప్రకారం, మెజిస్టీరియల్ విచారణలో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణంగా మరణం సంభవించిందని పేర్కొన్నప్పటికీ , పోస్ట్ మార్టంలో అనేక గాయాలు మరియు గాయాలు బయటపడ్డాయి, ఇది కస్టడీలో హింసకు గురైనట్లు అనుమానాలు లేవ...

వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్

 వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశా రు . ఈ సందర్భంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాసిల్దార్ తో చర్చించారు . వినియోగదారుల  జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ  గ్యాస్ డెలివరీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు డెలివరీ లోపాలు, పెట్రోల్ బంకులలో వినియోగదారులకు జరుగుతున్న సౌకర్య లోపాలు తదితర అంశాలపై తహసిల్దార్ తో విపులంగా చర్చించి నట్లు తెలిపారు .. సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ ను  కోరడం జరిగిందని, తాసిల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు...అనంతరం వినియోగదారుల హక్కుల పోస్టర్ ను తహసీల్దార్ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి పోలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

Explore the Mystical wonders, mysterious well of Jagannath Puri

Have you heard about the mysterious well of Jagannath Puri which fills by itself and dries just for a day? Explore the Mystical wonders of Swarna Kupa - a sacred well in Jagannath Puri that fills itself with water just once a year, where devotees believe miracles unfold. This ancient well is said to possess spiritual significance and divine connections to Lord Jagannatha's snana yatra. Watch the video to learn more about the miracles of this sacred well. 

ఆక్యుపంక్చర్ వైద్యం వైపు పెరుగుతున్న ప్రజల ఆసక్తి*

 *ఆక్యుపంక్చర్ వైద్యం వైపు పెరుగుతున్న ప్రజల ఆసక్తి*  చిలకలూరిపేట: స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం సాయంత్రం లైఫ్ ఆక్యుపంక్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆక్యుపంక్చర్ వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ షేక్ సాదిక్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, రకరకాల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత, చర్మ వ్యాధుల నివారణకు ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యమైన ఆక్యుపంక్చర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. నేటి కంప్యూటర్ యుగంలో యువత శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వెన్ను నొప్పి, జుట్టు రాలడం, మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, వృద్ధులు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం, వేరికోస్ వెయిన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, ఈ వ్యాధులన్నింటికీ ఆక్యుపంక్చర్ వైద్యంలో సహజసిద్ధంగా నివారణ సాధ్యమని షేక్ సాదిక్ వివరించారు. తదనంతరం అసోసియేషన్ సభ్యులకు ఉచిత ఆక్యుపంక్చర్ వైద్యం నిర్వహించారు. కార్యక్రమంలో లంకా ఆది రెడ్డి, కె. మురళీధర్ రావు, జి. వెంకటప్ప, మరియు అసోసియేషన్  సభ్యులు పాల్గొన్నారు.

మరియు కార్నర్ పాయింట్స్ ఫ్లెక్సీలను తొలగించండి..

 *పోలీస్ అవుట్ పోస్ట్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను మరియు కార్నర్ పాయింట్స్ ఫ్లెక్సీలను తొలగించండి.. లోక్ సత్తా పార్టీ..*   పట్టణంలో నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరియు  జాతీయ రహదారి తో సహా వివిధ ప్రధాన కూడళ్ళల్లో, కార్నర్ పాయింట్స్ల లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు.  పట్టణంలోని వైయస్సార్ కాలనీకి చెందిన ముక్కుపచ్చలారని 9 సంవత్సరాల చిన్నారి వెంకటశృతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. చిన్నారి వెంకట శృతి తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎవరూ తీర్చలేరని అన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కడో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదాల కారణంగా అనేకమంది క్షతగాత్రులై జీవితాంతం అంగవైకల్యం అనుభవిస్తూ మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన విమానం ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోవడం, కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం, ముం...

చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం

 *చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం  : మాజీమంత్రి ప్రత్తిపాటి* - దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారు. - చంద్రబాబు, లోకేశ్ చొరవతోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు. - ప్రజలు మరో 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికి మద్ధతు పలకాలి. - సుపరిపాలనకు ఏడాది వేడుకల్లో  ప్రజలతో కలిసి పాల్గొన్న ప్రత్తిపాటి    కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి  భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై  చేయివేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమని, అదే రాష్ట్రప్రగతికి ఇంధనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా పట్టణవ్యాప్తంగా జరిగిన మూడుపార్టీల విజయోవత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రత్తిపాటి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం స్థానిక శ్రీ పొట్టి శ్...

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

  జిల్లా కలెక్టర్ మరియు పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి  చిలకలూరిపేట న్యూస్ 9:చిలకలూరిపేట పట్టణానికి చెందిన బాణావత్ సోమశిల్ప సంజీవని బాయి నరసరావుపేట లో జరిగిన ప్రతిభ పురస్కారం 2025 కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ అవార్డును జిల్లా కలెక్టర్ పి.⁰⁰ అరుణ్ బాబు మరియు పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు చేతుల మీదుగా అందుకున్నారు... ప్రతిభ అవార్డు అందుకున్న సంజీవని బాయిని తల్లిదండ్రులు రవినాయక్ మరియు బాలునాయక్ పార్వతి బాయి పట్టణ ప్రముఖులు అభినందించారు

గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల సింహాచలం గారు నిన్న కాలం చేసారు

 గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల సింహాచలం గారు నిన్న కాలం చేసారు..ఈయన కొడుకు ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా  పళ్ళ శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారు

స్టూడెంట్ సక్సెస్ సొసైటీ గ్రూప్

 *స్టూడెంట్ సక్సెస్ సొసైటీ సేవలు  విజయానికి దిక్సూచి*    సరైన ప్రణాళిక లేకుండా నేటి పోటీ ప్రపంచంలో విజయం సాదించాలంటే చాలా కష్టం. ప్రతి  విద్యార్ధి లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికంటూ ఒక  బలమైన  ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లో భాగం గా   న్యూస్ పేపర్లు,క రెంట్అఫైర్స్, అకాడమీ మెటీరియల్స్,ఉద్యోగ నోటిఫికేషన్‌లు సలహాలు మరియు సూచనలు అవసరం.  ఇవన్నీ నిరుద్యోగ విద్యార్థులు కు ఎలా అందించాలి అనే ఆశయం తో వీటన్నిoటిని ఒకే చోట అందిందించే వేదికే *"స్టూడెంట్ సక్సెస్ సొసైటీ గ్రూప్"* ఈ గ్రూప్ 2021 సంవత్సరం లో గౌరవనీయ విద్యావేత్త డా. కొచ్చెర్ల శంకర రావు ఆలోచన తో మొదలై తరువాత మరికొంత మంది అడ్మిన్ల సహాయం తో నేటికీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గ్రూప్ లో తెల్లవారగానే ప్రతి రోజు న్యూస్ పేపర్స్, వివిధ పోటీ పరీక్ష లకు సంబందించిన పిడిఎఫ్ మెటీరియల్స్ , కరెంట్ అఫైర్స్ లను వివిధ రిసోర్స్ ల నుండి సేకరించి పోస్ట్ చేయబడుతుంటాయి. ఇవే కాకుండా నిరుద్యోగుల కొరకు వివిధ ప్రభత్వ & ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్లు సమయానుసారం గా పోస్ట్ చేయబడతాయి.  విద్యార్థులకు వొచ్చిన సంద...

చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ*

 *చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ* *పాత గవర్నమెంట్ హాస్పటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన నాయకులు* *సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు* *చిలకలూరిపేట టౌన్ :* చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ హాస్పటల్ సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు సోమవారం సాయంత్రం మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు షేక్ జమాల్ బాషా, అధ్యక్షులు చేవూరి కృష్ణమూర్తి, కార్యదర్శి నాయుడు శివకుమార్, కమిటీ నాయకులు పేలూరి రామారావు, నాగభైరు రామసుబ్బాయమ్మ, మాదాసు భాను ప్రసాద్, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ యాదవ్, కొప్పురావురి నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ దారా బుచ్చిబాబు, ఏ వీరాంజనేయులు, బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట

 తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట  – మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి యడ్లపాడు మండలంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొండవీడుకోటను మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ తులసిరెడ్డి మంగళవారం సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు, మహాద్వారం, పిల్లల క్రీడాపార్కు, తూర్పు ద్వారము (కట్టిలదిద్ది వాకిలి), లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేమన మండపం, అనవేమారెడ్డి విగ్రహం, చారిత్రక అంశాలను వివరించే గ్యాలరీ, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల చెరువు డెక్కు ప్రాంతాలతో పాటు కొండపై ఉన్న చారిత్రక ప్రదేశాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కత్తులబావి సందర్శనకు వెళ్లగా కోటగ్రామస్తులు సాదరస్వాగతం పలికారు. కొండవీటి కైఫియత్తు ఆధారంగా 72 మంది పాలెగాండ్ల తిరుగుబాటును అణచివేసేందుకు బావిలో కత్తులు అమర్చి జరిగిన ఘోర ఘటనను కల్లి శివారెడ్డి వివరించారు. అక్కడ నుంచి హౌస్‌గణేష్‌పాడులోని అఖిలభారత రెడ్లసంక్షేమ సమాఖ్య ఏర్పాటు చేసిన కొండవీటి రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడ ఇటీవల లభ్యమైన పురాతన ఖడ్గాన్ని, రాతి ఫిరంగి గుండును తులసిరెడ్డి ఆవిష...

ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నీ

 పత్రికా ప్రచురణార్థం ✍️ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలి-ఎస్టీయు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను కేటాయించడం జరిగిందని, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు  డిమాండ్ చేశారు.మంగళ వారం చిలకలూరిపేటపట్టణంలోని  ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలోవారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ సెకండరీ ఉపాధ్యాయులతోనే ఖర్చు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ,సదరు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు(డీఎస్సీ) కి కూడా కేటాయిస్తున్నారనే సమాచారం రావడం చాలా బాధాకరమన్నారు.అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన ప్రధానోపాధ్యాయుల పోస్టులను 100 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని,అలా కాకుండా పాఠశాల సహాయకుల స్థాయిని తగ్గిస్తూ ...