Posts

Showing posts from October, 2025

నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?.

Image
 నా దేశ విద్యా వ్యవస్థ విద్యార్థుల మనశ్శాంతిని కాపాడగలదా?... -భారతదేశంలోని తరగతి గదులు తీవ్రమైన పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2013 మరియు 2023 మధ్య జరిగిన ఆత్మహత్య సంఘటనలలో దేశం 1,17,849 మంది విద్యార్థులను కోల్పోయింది.  -పరీక్షల ఒత్తిడి దేశంలోని ప్రతిభావంతులను విచ్ఛిన్నం చేస్తోంది. - పాఠశాలలు కళాశాలలు యాజమాన్యలు మరియు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత...  @ మార్పు రావాలి.. - తలిదండ్రుల ఆలోచన విధానం లో.. - యాజమాన్యల వ్యాపార ధోరణి లో... - ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిలో... @@ సమాజ హితులు... విజ్ఞులైన.. తలిదండ్రులు... మార్పు తేవాలి ...మార్పుకు సహకరించాలి.. 🕊️ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ (PAAP) (రిజి. నెం. 6/2022) ఆంధ్రప్రదేశ్ కమిటీ.. 📞 +91 63053 13558 📧 parentsassociationap@gmail.com 🌐 #EducationForAll | #ParentsVoiceAP -

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలను విస్మరించింది

Image
 చిలకలూరిపేట: న్యూస్9 కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ  స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అక్రవర్ణాల ఆదిపత్యం ఎక్కువగా ఉండటం వలన బడుగు, బలహీన వర్గాల ప్రజలు చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో వారిచేత ఓట్లు వేయించుకొని వారికి కావల్సిన చిన్నచితికా పనులు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇదే ధోరణి రానున్న రోజుల్లో కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడు మండలాల్లో, పట్టణంలో గిరిజన సమాఖ్యను బలోపేతం చేయడం కోసం కృషి చేయాలన్నారు. దీపావళి పండుగ తర్వాత నూతన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరు బాబురావు,తోపాటు ఆయా మండలాలకు చెందిన గిరిజన నాయకులు పాల్గొన్నారు.

గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి.

Image
 గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి. గిరిజన సమాఖ్య డిమాండ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్. చిలకలూరిపేట/ పట్టణ శివారులో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణము కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా య. 2.50 సెంట్లు కేటాయించారు. అందుకు సంబంధించి రూ. 4 కోట్లు ప్రణాళికలు రూపొందించారు. నేటికి ఇంతవరకు నిర్మాణము జరుగలేదు. ప్రస్తుతము ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల మరుగుదొడ్లు అస్తవ్యస్తముగా ఉన్నాయి. దీనికి సంబంధించి నిధులు కేటాయించామని చెప్పి ఇంతవరకు మరమ్మత్తులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల తాహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతు గిరిజన గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణము చేపట్టాలని కోరారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయాలన్నారు. ఈ విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పటికీ సంబంధ...

కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది

Image
 *దేవినేని అవినాష్ కామెంట్స్*  *ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు* కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది చిత్తూరు జిల్లాలో దొరికిన నకిలీ మద్యం లింక్ NTR జిల్లా వరకు  ఉందిఇ బ్రహీంపట్నం లో నకిలీ మద్యం ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయిరా ష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి టిడిపి నాయకులు నకిలీ మద్యం సప్లై చేస్తున్నారు  టీడీపీ నేతలు అందరికీ జనార్ధన్ రావు దగ్గర మనిషిఅ తని ద్వారా ఇబ్రహీంపట్నం చుట్టూ ప్రక్కల మొత్తం నకిలీ మద్యం అమ్ముతున్నారు కూటమి నేతలు పేద ప్రజల ప్రాణం తీస్తున్నారు విజయవాడ పార్లమెంట్,మైలవరం ముఖ్య టిడిపి నేతలు కి జనార్ధన్ రావు ప్రతి నెల కమీషన్లు ఇస్తున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు పై కక్ష్య సాధింపు చర్యలకు దిగి అక్రమంగా అరెస్ట్ చేశారు నకిలీ మద్యం పై చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏమి సమాధానం చెబుతారుఎ న్ని లీటర్ల నకిలీ మద్యం దొరికింది పోలీసులు చెప్పాలి గతంలో కూడా టీడీపీ నేతలు నకిలీ మద్యం అమ్మారు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నకిలీ మద్యం అమ్ముతున్నారు ఎక్కడిక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యం  అమ్ముతున్నారు...