Skip to main content

Posts

Showing posts from November, 2024

అమ్మవారిని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు

 అమ్మవారిని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు  అమ్మవారి ఆలయంలో మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు  అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామనాధ్ కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేసిన పండితులు  అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేష వస్త్రాలను అందజేసిన దుర్గగుడి ఈవో రామారావు

భక్తి భావాన్ని పెంచుతున్న అన్న ప్రసాద కార్యక్రమం

 భక్తి భావాన్ని పెంచుతున్న అన్న ప్రసాద కార్యక్రమం    విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి అన్న ప్రసాద కార్యక్రమాలు దోహదం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక పశ్చిమ నియోజకవర్గం చిట్టీనగర్ 48వ డివిజన్ సొరంగం రోడ్డులో తొత్తడి రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న భవానీ, శివ,అయ్యప్ప స్వామిల అన్నదాన కార్యక్రమం 10వ రోజు శుక్రవారం విజయవంతం గా సాగింది. ఈ మేరకు పలువురు దాతలు ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేస్తున్నారని తొత్తడి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో నెర్జీ మన్మధరావు, రాళ్లపూడి సాంబ, మాదిరెడ్డి విజయకుమార్, యిల్లిపిల్లి  రవి, వాండ్రాసి శివ, తొత్తడి  రాకేష్, తొత్తడి సాయి తదితరులు పాల్గొన్నారు.

నేడు అనగా నవంబర్ 26తేదీ ఉదయం 11 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో "సంవిధాన్ దివస్"

 నేడు అనగా నవంబర్ 26తేదీ ఉదయం 11 గంటలకు బిజెపి  రాష్ట్ర కార్యాలయంలో  "సంవిధాన్ దివస్" జరిగింది.ఈ కార్యక్రమంలో *రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం ముందు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచి "సంవిధాన్ గౌరవ్ దివస్"* *నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర BJP సీనియర్  నాయకులు అంబికా కృష్ణ,ఉప్పలపాటి శ్రీనివాసరాజు,SK బాజి,సాతినేని యామిని ,పాతూరి నాగభూషణం, NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,BJP రాష్ట్ర ST మోర్చా మాజీ  ప్రధాన కార్యదర్శి అనుముల వంశీ కృష్ణ ,BJP రాష్ట్ర SC మోర్చా ఉపాధ్యక్షులు యలశిల శ్రీనివాసరావు,NTR జిల్లా BJP మాజి SC మోర్చా ప్రధాన కార్యదర్శి సర్వసిద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

దళితులంటే చిన్న చూపా..?

 *కృష్ణాజిల్లా,* *దళితులంటే చిన్న చూపా..?* *పెనమలూరు పోలీస్ స్టేషన్ ముందు బాధితుడు ఆందోళన..?* *వివాదాల నిలయం.. నిత్య కళ్యాణం పచ్చ తోరణం.. ఆ స్టేషన్..!*  పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో ఈనెల ఏడో తారీఖున సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు బైక్ పై వస్తున్న సమయంలో అతివేగంగా ట్రాక్టర్ రావడంతో బైక్ అదుపుతప్పి సురేష్ అతని కుటుంబ సభ్యులు కింద పడ్డాడు.  అంత వేగంతో ఎందుకు వస్తున్నావు అని సురేష్ డ్రైవర్ని అడగక నా ట్రాక్టర్ ని అడ్డుకుంటావా అని సురేష్ తో వాగ్వాదానికి దిగాడు.  ట్రాక్టర్  డ్రైవర్ యజమానికి  సమాచారం ఇవ్వడంతో ఆవేశంతో, అతని అనుచరులతో అక్కడికి వచ్చిన నాని సురేష్ ను విచక్షణ అరహితంగా కర్రలతో దాడి చేశారు.  అదే రోజు స్టేషన్లో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోపోవటంతో పెనమలూరు స్టేషన్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.  సురేష్ మాట్లాడుతూ నాపై దాడి జరిగి 20 రోజులు అయినా పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలుమార్లు సిఐ వెంకట రమణ  అడిగితే గతంలో నాపై ఉన్న పేట్టి కేసు ఓపెన్ చేసి రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్త...

నిన్న సాయంత్రం జరిగిన హరి హర క్షేత్రం MIG quaters శ్రీహరిపురం

 విశాఖపట్నం జిల్లా నిన్న సాయంత్రం జరిగిన హరి హర క్షేత్రం MIG quaters శ్రీహరిపురం లో కోటి దీపోత్సవం జరిగినది TDP ఎమ్మెల్యే గణబాబు, YCP Minister మల్ల విజయప్రసాద్ గారు గుడిని దర్శించారు  గాజువాక ప్రతినిధి అనిల్ కుమార్

కడప నుండి కోడూరుకు వెళ్తున్న తాసిల్దార్ కార్లు ఢీకొన్న నందలూరు వాసి

 నందలూరు మండలం  అన్నమయ్య జిల్లా.  . నందలూరు కన్యకా చెరువు మార్గంలో రోడ్డు ప్రమాదం. .. కడప నుండి కోడూరుకు వెళ్తున్న తాసిల్దార్ కార్లు ఢీకొన్న నందలూరు వాసి  . పెట్రోల్ కోసము రోడ్డు క్రాసింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న తాసిల్దారు వాహనాన్ని ఢీకొన్నారు.  .  నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లెకు చెందిన నరసింహులు(45) గా గుర్తించిన పోలీసులు.  . ప్రమాదంలో రెండు కాళ్లకు భారీ గాయాలు. . సంఘటన స్థలానికి చేరుకున్న నందలూరు పోలీసులు. . 108 వాహనం లో రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.  . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కొండవీడు ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చి సి.యం స్వప్నం నెరవేర్చాలి. ప్రత్తిపాటి

 కొండవీడు ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చి సి.యం స్వప్నం నెరవేర్చాలి. ప్రత్తిపాటి న్యూస్ 9 చిలకలూరిపేట: కొండవీడు కోట ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చి సీఎం చంద్రబాబు నాయుడు  స్వప్నని నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని,టూరిజం శాఖ మంత్రిని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యర్థించారు. సుమారు 700 సంవత్సరాల క్రిందటే, రెడ్డిరాజుల రాజధానిగా వర్ధిల్లిన కొండవీడు కోట ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి  అభీష్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు కోరడడం జరిగింది. శాసనసభా సమావేశాల సందర్భంగా పర్యాటక రంగం పై జరిగిన చర్చలో పురాతన చరిత్ర కలిగిన కొండవీడు కోట విశిష్ఠతను, పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను ప్రత్తిపాటి సభకు వివరించారు. కొండవీడు కోట పైన సంవత్సరాంతం నీటితో ఉండే 3 సరస్సులు, ఊట బావి ఉన్నాయని, అలాగే శివాలయం, నరసింహ స్వామి ఆలయం, లక్ష్మీ దేవి ఆలయం, ఆంజనేయ స్వ...

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

 22-11-2024:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :    ఈరోజు కార్తీక మాసం మరియు శుక్రవారం  సందర్బంగా ఉదయం నుండి అమ్మవారి, స్వామి వారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు.. పెద్ద సంఖ్యలో నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండి హోమం, శాంతి కళ్యాణం తదితర సేవలలో విశేషముగా పాల్గొన్న భక్తులు.. ఏర్పాట్లను ఎpgప్పటికప్పుడు పర్యవేక్షిస్తు, సిబ్బందికి సూచనలు చేస్తున్న ఆలయ ఈవో కె.ఎస్ రామరావు గారు..

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

 61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,, పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో  గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు మరియు అన్న సమారాధన కార్యక్రమం భారీగా  నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి సి ఎ విద్యాసాగర్ గారు మరియు వార్డు కార్పొరేటర్ కొణతాల  సుధా, మరియు ఆలయ కమిటీ సభ్యులు  పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. సీఐ విద్యాసాగర్ గారికి శ్రీ గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారికి మరియు గుణవతి గారికి ఘనముగా సన్మానము నిర్వహించిరి,. ఈ సందర్భంగా  కార్పొరేటర్ కొణతాల సుధా గారు మాట్లాడుతూ ఈరోజు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,

శ్రీ కాళహస్టీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా నందు కార్తీక మాసో త్సవాలు 2024

 శ్రీ కాళహస్టీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా నందు కార్తీక మాసో త్సవాలు 2024

విజయవాడ అశోక్ నగర్ లో manea the saloon company ఫ్రాంచేస్ ప్రారంభోత్సవం

 విజయవాడ :   విజయవాడ అశోక్ నగర్ లో  manea the saloon company ఫ్రాంచేస్ ప్రారంభోత్సవం చేశారు , ఈ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె  రామ్మోహన్ రావు పాల్గొన్నారు , అయిన మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగర లాగా విజయవాడ నగరం కూడా అదే మాదిరిగా మార్తుంది అని చెప్పారు, పాత రోజులు లో సెలూన్ షాప్ లు తక్కువ, కాలం పెరిగే కొద్ది సెలూన్ షాప్ లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు  Manea the saloon company 2004 నుండి భారతదేశంలో చాలా బ్రాంచ్ లు ఉన్నాయి, ఆ కంపెనీ ఫ్రాంచీస్ తీసుకుని విజయవాడ ప్రజలకు మంచి క్వాలిటీ సర్వీస్ ఎవాలి అని మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్స్ పెట్టం అని చెప్పారు.

ఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ నందు నాలుగు వేలమందికి క్రిస్మస్ కానుక

 ఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ నందు నాలుగు వేలమందికి క్రిస్మస్ కానుక   విజయవాడ విద్యాధరపురం RTC  డిపో ఎదురు సందులో ఉన్నఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ లో  పాస్టర్లు ఛాల్స్ పి. జాకబ్ పాస్టర్ ,డా॥ ఫిలిప్ పి. జాకబ్ లు మంగళవారం  నిత్యావసర సరుకులతో కూడిన క్రిస్మస్ కానుక ను సుమారు నాలుగు వేల మందికి   అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ  గత రెండు నెలల క్రితం విజయవాడ నగరంలో కబేల ప్రాంతంలో వరద సంభవించి ఎంతోమంది నిరాశ్రయులు అవడం జరిగింది .దానివలన వారి జీవన విధానం అస్తవ్యస్తంగా అయినది అందుకు గాను జీసస్ ఆజ్ఞ గా మా చర్చి నందు  క్రిస్మస్ కానుకను అందజేసామని వారు తెలిపారు.

విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది.

 విజయవాడ: చికిత్స వికటించి ఒకరి మృతి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కానూరు ఎస్బీఐ కాలనీకి చెందిన రమేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స వికటించి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై 5టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించిన అఘోరి

 బ్రేకింగ్ న్యూస్  విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించిన  అఘోరి తను పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తాను ఆంటూ హైవే పైన బైటాయించిన అఘోరి 

ఇబ్రహీంపట్నంలో లేడీ అఘోర కారులో హల్చల్.అఘోరాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.

 *ఎన్టీఆర్ జిల్లా*  *మైలవరం నియోజకవర్గం* ఇబ్రహీంపట్నంలో లేడీ అఘోర కారులో హల్చల్. అఘోరాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు. కారు లో నుండి బయటకు రాకుండా కారులోనే పూజలు. కారు నుండి బయటకి రావాలి అంటూ పోలీసుల సూచన. పట్టించుకోని అఘోరి.. హైదరాబాద్ విజయవాడ రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జామ్. అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైకి వచ్చిన ప్రజలు.

ఉయ్యూరులో "ది ఏపీ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్" మీడియా సమావేశం నిర్వహించారు*

 కృష్ణా జిల్లా,  పెనమలూరు నియోజకవర్గం, *ఉయ్యూరులో "ది ఏపీ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్" మీడియా సమావేశం నిర్వహించారు* *ఈ సందర్భంగా "ది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్  ఓనర్స్ అసోసియేషన్" అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ:* చంద్రబాబు ఎన్నికలు ముందు  టిప్పర్ యజమానుల కష్టాలు లేకుండా చూస్తాను అన్నారు . 4 నెలలు దాటిన పట్టించుకోలేదు. సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడిచేలా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేస్తున్నారు. ఇసుక రీచుల్లో దళారి వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ ధరలకు ఎలా కట్టబెట్టారు. ట్రాన్స్పోర్ట్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణమే మా డిమాండ్లు అమలుపరచాలి అని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్  వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు..  గత ఆరు ఏడు నెలల నుండి ఉపాధి లేక  ఈఎంఐ లు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మా వాహనాలలో లోడింగ్ కూడా అనుమతించట్లేదని, టెండర్ దారుల సొంత వాహనాలే లోడింగ్ చేస్తున్నారు. అధికారులు కూడా తమపై కక్షపూరితంగా పలు రకాల కేసులు ప...

వరకట్న వేధింపులకు మరో మహిళ బలి

 విజయవాడ  వరకట్న వేధింపులకు మరో మహిళ బలి   వేధింపులను భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన లక్ష్మీ ప్రియాంక సరైన వైద్యం కోసం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు... నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి  చనిపోయిన లక్ష్మీ ప్రియాంక  అత్త మామ వేధింపులతో పాటు భర్త కూడా వేధించిన ఘటన  నందిగామలో చోటుచేసుకుంది  రెండేళ్ల క్రితం  కోటి రూపాయల కట్నం ఇచ్చి  పెళ్లి చేసిన తల్లిదండ్రులు... రెండేళ్లగా  అదనపు కట్నాన్ని  ఇవ్వమంటూ  వేధించిన అత్తమామలు  కనీస అవసరాలను కూడా  పట్టించుకోని భర్త శ్రీనివాస్... టార్చర్ ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మీ ప్రియాంక....

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారికి సన్మానం,,,

 61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారికి సన్మానం,,, పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో  కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి వార్డు కార్పొరేటర్ కొణతాల  సుధా, మరియు కాండ్రేగుల రాధా,  పాల్గొని ప్రత్యేక దీపారాధన కార్యక్రమం నిర్వహించిరి,. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. కాండ్రేగుల రాధా గారికి ఘనముగా సన్మానము నిర్వహించారు. ఈ సందర్భంగా  కార్పొరేట్ కొణతాల సుధా  మాట్లాడుతూ  ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే  అది మీ అందరి అభిమానం మీ ఆశీర్వాదము అన్నారు.. సభ్యులందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.

 *ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.*  *కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా..*   *ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు :*   *గవర్నమెంట్ debt - రూ.4,38,278 కోట్లు.*   *పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు.*   **కార్పొరేషన్ debt - రూ.2,48,677 కోట్లు.*   *సివిల్ సప్లైస్ కార్పొరేషన్ -  రూ.36,000 కోట్లు.*  *పవర్ సెక్టార్రూ.34,267 కోట్లు*  *అవుట్ స్టాండింగ్ డ్యూస్టువెండార్స్ అన్ని స్కీమ్స్ రూ.1,13,244 కోట్లు.*   *అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ - రూ. 21,980 కోట్లు.*   *నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ - రూ.1,191 కోట్లు.*   *ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు.*

పారిశ్రామిక వాడ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు-లోక్ సత్తా

 15-11-2024 పారిశ్రామిక వాడ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు-లోక్ సత్తా!           విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారికి లోక్ సత్తా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు.  ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చెప్పిన రెండు అంశాలు కూడా వాస్తవమే. పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి కారు చౌకగా భూములు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు చెయ్యకుండా, ఆ స్థలాలను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా తాత్సారం చేస్తున్న యజమానుల నుండి తిరిగి భూమిని స్వాధీనం చేసుకుని ఔత్సాహికులైన కొత్త వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది  ఇక రెండవది పరిశ్రమలు ఏర్పాటు చేసిన యాజమాన్యం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఇవ్వడం. దీనిపై కూడా పరిశ్రమల యజమానులతో స్థానికులకు మాత్రమే ఉపాథి ఇవ్వాలని ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరం ఉంది. ఇవే కాకుండా నేను ఎమ్మెల్యే గారికి విన్నవించేది ఏంటంటే ...

అయ్యప్ప స్వాములు మరియు భక్తదులందరూ పూజలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి సేవలో తరించగలరని మనవి

  🙏.....ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.....🙏 అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రంలోని హరిహరాదుల దేవస్థానములో ఘనంగా జరిగిన అంబులం పూజ వేలాది అయ్యప్ప స్వామి భజన భక్తాదుల నడుమ సాక్షాత్ అయ్యప్ప స్వామి భూవి పైకి  దిగి వచ్చాడేమో అన్నట్లు జరగడం జరిగింది స్థలం :- వీరబల్లి శ్రీ హరిహరదుల దేవాలయం  తేది :- 14-11-2024 వ తేది అనగా గురువారం సాయంత్రం 6.00 గంటల నుండి హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి అంబుళం పూజ అంగరంగ వైభవంగా పలువురు గురుస్వాముల పర్యవేక్షణలో నిర్వహించబడును. కావున అయ్యప్ప స్వాములు మరియు భక్తదులందరూ పూజలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి సేవలో తరించగలరని మనవి... ఆహ్వానించు వారు... అయ్యప్ప స్వామి సేవ సమితి వీరబల్లి...

కేజ్రీవాల్ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం

 ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రివర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మరియు కార్యకర్తలు