మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా

పార్వతీపురం మన్యం జిల్లా. మన్యం జిల్లా సాలూరు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర. Ys రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలారని అన్నారు. అదే విధంగా అతని తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న ఇప్పటికీ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడం లేదని. సంపదను సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నెలకు 10 కోట్లు వరకు ఆయన పర్యటనలకు ప్రజల సొమ్మును విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నారని అన్నారు.గత 5 సంవత్సరాల పాలనలో జగన్ మోహన్ రెడ్డి 3లక్షల 38వేల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలకే చంద్రబాబు సుమారు 2లక్షల కోట్లు అప్పుచేశారని ఇటువంటి ముఖ్యమంత్రి భారత దేశంలో ఎక్కడ ఉండరని వి...