Skip to main content

Posts

Showing posts from June, 2024

T20లకు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించారు.

 *T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి* T20లకు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించారు.  వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాపై ఫైనల్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.  'ఇదే నా చివరి వరల్డ్ కప్.  T20 మ్యాచ్ కూడా.  తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నా' అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్కంఠ పోరులు సౌత్ ఆఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం*...

*T20 వరల్డ్ కప్*          *ఉత్కంఠ పోరులు సౌత్ ఆఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం*... *భారత్ను గెలిపించిన ఫేస్ బౌలర్లు* T20WC థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి

 న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు కలిశారు. డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్జ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేడే ఫైనల్ Jun 29, 2024, భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి

ఐపీఎస్‌ల బదిలీ.. విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చి

 విశాఖ పోలీస్ కమిషనర్ *ఐపీఎస్‌ల బదిలీ.. విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చి* ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది.  ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం ఏపీఎస్‌పీ బెటాలియన్‌ అదనపు డీజీ అతుల్‌ సింగ్‌ను ఏసీబీ డీజీగా నియమించింది.  విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సీఐడీ అదనపు డీజీగా, అలాగే.. శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
 *అనకాపల్లి జిల్లా పోలీసు*  *పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు “పోలీస్ గ్రీవెన్స్ డే” నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,గారు.*    *అనకాపల్లి, జూన్ 28 :* జిల్లా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.  ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 18 మంది పోలీసు సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం నందు హాజరు అయి, వారి యొక్క అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకోగా, ఎస్పీ గారు వారి విన్నపములను పరిశీలించి, సానుకూలంగా స్పందించి, అర్హమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్ పాల్గొన్నారు. *జిల్లా పోలీసు కార్యాలయం,* *అనకాపల్లి.*

మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను ...

 మధురవాడ  మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను  తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప అన్నారు..  ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి  క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వి కన్వెక్షన్ హాల్లో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత  మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. వంద రోజుల్లో విశాఖ జిల్లాలో గంజాయిని నిర్మించినడమే ప్రధాన లక్ష్యం అన్నారు. విశాఖలో బైక్ రేసింగ్ లు ఎక్కువగా జరుగుతుండడంతో ద్రుష్టి పెట్టి సుమారు 80 నుంచి 90 బైక్ లను సీజ్  చేశామన్నారు.ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మ...

శ్రీలంక పర్యటనకు భారత్ షెడ్యూల్ ఇదే!

  శ్రీలంక పర్యటనకు భారత్ షెడ్యూల్ ఇదే! శ్రీలంక టూర్‌కు సంబంధించి టీమిండియా షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు లంకలో పర్యటించనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని.. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయని సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 6-14 వరకు జింబాబ్వేతో ఐదు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.

మీద పిడుగు పడి

  అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన వడ్డాది భవాని శంకర్ (25) పొలంలో విత్తనాలు జళ్లడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం పడు తుండడంతో పాకలోకి చేరగా పాక మీద పిడుగు పడి మృతి చెందాడు.

ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై

  ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై పలు పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేదవాడు సొంత ఇల్లు కళ నెరవేరుతుందని 35 వేల రూపాయలు కూడా బ్యాంకుల్లో జమ చేశారు నెలలో పోయి సంవత్సరాలు గడిచిన నేటికీ దానికి మోక్షం రాలేదు. మరి ఈ ప్రభుత్వం జగనన్న ఇల్లు తమ కట్టిన 35 వేలకు న్యాయం చేస్తాదా లేదా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేద ప్రజలు ఇల్లు ఒక కలగా ఏర్పాటు చేసుకోవాలని చివరకు మహిళలు మంగళ సూత్రాలు కూడా తాకట్టుపెట్టి 35 వేల రూపాయలు అప్పులు చేసి సొంత ఇల్లు వస్తదని ఆశతో సొంత ఇల్లు కలను నిజం చేసుకోవాలని ఇల్లు కోసం బ్యాంకులో కట్టిన సొమ్ముకు పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై స్థానిక రాజకీయ నేతలు గాని మంత్రులు గాని ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోవడమే సరే కదా నిర్మాణంలో ఉన్న ఇల్లులు ఎప్పుడూ ఇస్తారు అని అసలు ఇల్లు వస్తదా రాదా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు కానీ నేటి వరకు అధిష్టానం ప్రభుత్వం పేదవాడి ఇంటి కోసం మాత్రం పెదవి ఇవ్వకపోవడం ఒక ఆవేదనంగా పేదవాడికి మిగులుతుంది ప్రభుత్వం ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం పత్రికాముఖంగా మీడియా ముఖ్యంగా తెలుగుదేశం ...

డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం

 *ఇవాళ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం* Jun 26, 2024, ఇవాళ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న‌ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అర్థం. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయి. అందుకే దేశభవిష్యత్తును కుంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్ప‌డు దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్యోద్దేశ్యం

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం

 విశాఖపట్నం  90 వార్డ్ ఎన్.ఏ.డి కొత్త రోడ్ నందు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం సందర్భంగా పోలీసు వారు నిర్వ హించిన మానవహారం లో  ముఖ్య అతిథిగా పాల్గున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గణ బాబు స్కూల్ విద్యార్థిని విద్యార్థు లతో మాదక ద్రవ్యాల  వినియోగం  అక్రమరవాణా దినం అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు డిసిపి మోక సత్తిబాబు,వెస్ట్ ఏసిపి. అన్యపు నరసింహమూర్తి,టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ,  గల్లా చిన్న,పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది, మరియు టీడీపీ నాయకులు వైటిఆర్,వాసుదేవరావు,నరిపిన్ని సత్తిరాజు , పెంటకోట అజయ్, వి.చంద్రశేఖర్,నరవ పైడిరాజు యలమంచిలి ప్రసాద్,అల్లం రమేష్ మాణిక్యాలరావు మహిళలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మొదలగున్నవారు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన IPS

  ఎన్టీఆర్ జిల్లా విజయవాడ  ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన  ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉంది.. గతంలో కూడా జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం గతం లొ ఎన్టీఆర్ జిల్లాలో పని చేసిన అనుభవం వుంది  రాష్ట్రం లోనే అత్యంత ప్రతిష్టత్మకమైన జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను  ఎన్టీఆర్ జిల్లా కు దేశ వ్యాప్తంగా మంచిపేరు  వచ్చే విదంగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తాను అని తెలిపారు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ఏపీలోని వైసీపీ మద్దతు కోరింది.  లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది.  ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాగా, ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక..

  లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక.. ఢిల్లీ.. 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు.. ఎన్డీయే తరఫున లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో లోక్ సభ స్పీకర్ ఎంపిక చేశారు..

మత్తుపదార్థాల వాడకం వల్ల

  మత్తుపదార్థాల వాడకం వల్ల యువత చెడు పోతుందని డిసిపి సత్తిబాబు తెలియజేశారు. ఈ మేరకు గురువారం మాధవ దార లో గ్రాండ్ మిలన్ ఫంక్షన్ హాల్ లో యువకులతో కలిసి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల యువతి యువకులు చెడు పోతున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు మత్తు పదార్థాలు సేకరించడం ద్వారా తన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఉద్యోగ అభివృద్ధి కేంద్రంలో మత్తుపదార్థాల వాడకం వల్ల వచ్చే రోగాలు, ఇతరత్ర అనర్ధాలు, తద్వారా యువత చెడు వైపుకు పయనిస్తుందని కూలంకుశంగా విద్యార్థినీ విద్యార్ధులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రోజురోజుకి యువత  సమాజ అభివృద్ధి కోసం ప్రయణించాల్సి ఉండగా, చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, మత్తు పదార్ధాలు, ఇతరత్ర డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.సమాజానికి ఉపయోగపడే యువత చెడువైపు పయణిస్తే సమాజం అభివృద్ధి చెందకపోవడమే కాకుండా వారి కుటుంబాలు సైతం చిన్నాభిన్నం అవుతాయని. విద్యార్థులు, యువకులు ఈ విషయాన్ని గమనించి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్య...

మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు

  మత్తు పదార్థాలు బారిన పడవద్దు యువత భవిష్యత్తు చేయి జార్చుకోవద్దు అనే ఉద్దేశంతో పండగలు, ఫంక్షన్ లో సైతం వదలకుండా విస్తృతంగా మత్తు పదార్థాల నిర్మూలలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. గోపాలపట్నం ఎస్ ఐ రామకృష్ణ. మంగళవారం 89వ వార్డు చంద్ర నగర్ పరదేశమ్మ జాతర సందర్భంగా.అధిక సంఖ్యలో యువత హాజరవుతున్న సమయంలో గంజాయి మత్తు పదార్థాలు వాడవద్దు అది వాడితే మీ భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుంది అంటూ.వాటికి అలవాటు పడి అనేక దొంగతనాలకు, దౌర్జన్యాలు చేసేందుకు పాల్పడతారు.మీ మతిస్థిమితం మీ అదుపులో ఉండదు అంటూ పలు అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీకు కనబడిన ప్రదేశాల్లో గాని ఎవరైనా గంజాయి సేవించిన లేదంటే విక్రయించిన మాకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు

ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు పార్టీ నాయకుల పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం న్యాయమేనా?    లోక్ సత్తా!!!               ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు పెట్టిన పథకాలకు వారి పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం న్యాయమేనా అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు, జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ శెక్రటరి దాసరి సురేష్ అన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా తామేదో తమ సొంత జేబులో నుండి గాని లేదా వారి వ్యాపార సంస్థల నుండి గాని తమ సొంత డబ్బు  ప్రజలకు ఇస్తున్నట్టు వారి పేరు, లేదా ఆ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకోవడం. వారేదో పాపం దయతో ఇచ్చే వారు-ప్రజలు పుచ్చుకునే వారు మరి. ఆ పథకాలు అమలు చేస్తున్నది ప్రజలు తాము కష్టపడి సంపాదించి కడుతున్న పన్నుల డబ్బు అనే కనీస జ్ఞానం లేకపోతే ఎలా? ఒకాయనేమో తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు జగనన్న, రాజన్న, వైఎస్ఆర్ అని పేర్లు పెడతారు. ఇంకొక ఆయన అధికారంలో ఉంట...

రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు

  *రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులకు గాయాలు*    దొరవారిసత్రం మండల పరిధిలోని   కుప్పారెడ్డిపాలెం గ్రామ సమీపంలో     మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి.  స్థానికులు వివరాలు మేరకు వాకాడు గ్రామానికి చెందిన పుచ్చలపల్లి కిరణ్ కుమారుడు సందీప్ లు అత్తగారి ఊరైన ఉగ్గు మూడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కుప్పారెడ్డిపాలెం సమీపంలో  సూళ్లూరుపేట నుండి నాయుడుపేట వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొంది.  ఈ ప్రమాదంలో తండ్రి కిరణకు, కుమారుడు సదీప్ కు తీవ్ర గాయాలు తగిలాయి.వీరిని చికిత్స నిమిత్తం  108 లో  నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కొరకు  స్థానికులు తెలిపారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు

  శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు కంచరపాలెం లా అండ్ ఆర్డర్సీఐ సిహెచ్ ప్రసాద రావు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని శాంతిభద్రత భగ్నం కలిగిస్తే ఎంతటి వార్నైనా ఉపేక్షించేది లేదని కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన ఐసిహెచ్ ప్రసాదరావు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు బాధితులు ఏ అవసరం వచ్చిన నేరుగా సంప్రదించాలని సూచించారు ఆసాంఘిక కార్యకలా పై ఉక్కు పాదం మోపుతామని గంజాయి పేకాట తదితర మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారిస్తామని అదేవిధంగా చోట మాట నాయకులు సెటిల్మెంట్లు పాల్పడితే సహించమని లా అండ్ ఆర్డర్ కృషి చేస్తామని  సీఐ సిహెచ్ ప్రసాద్ చెప్పారు

సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం

*సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అసలే బస్సు రద్దీగా ఉంది టీచర్స్ హాస్పిటల్స్ సిబ్బంది తొ ప్రయాణికులతో సూళ్లూరుపేట నుంచిబయలుదేరిన బస్సు పేర్నర్ రోడ్ లో ఒకసారి గా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి*

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావును

  అమరావతి: రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకాతిరుమలరావును  కార్యాలయంలో కలిసి అభినందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.  👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యమైన శాంతి భద్రతల అంశాలపై డిజిపి తో చర్చించిన పల్లా శ్రీనివాస్.  👉 బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ 👉 గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ పరంగా తీసుకునే చర్యలకు పార్టీ పరంగా తాము పూర్తిగా అండదండలు అందిస్తామని డీజీపీకి స్పష్టం చేసిన పల్లా శ్రీనివాస్ 👉 ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మూడింటి ఏకైక లక్ష్యం పూర్తిస్థాయిలో ప్రజలకు భద్రత భరోసా కల్పించాలనేదే లక్ష్యమని మరో మారు డీజీపీకి వివరణ.  👉 పోలీస్ స్టేషన్ లో చిట్ట చివరి అధికారి వరకు ఈ లక్ష్యం కోసం పనిచేసేలా ద్వారకాతిరుమలరావు మార్గ దర్శనం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన పల్ల. 👉గత ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపిత కేసుల జాబితా అన్ని పోలీస్ స్టేషన్లోనూ తయారు చేయాల్సిందిగా సూచించిన పల్లా శ్రీనివాస్ 👉వీటి...

విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా

 తేదీ.24-06-2024, విశాఖపట్నం. *విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా సోమవారం ఉదయం 10:35 గంటలకు జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తున్న కె. మయూర్ అశోక్*

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్

  *ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్* *ఏపీ మహిళలకు శుభవార్త.* ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నెల రోజుల్లో మహిళలు ఉచితంగా బస్సులు ఎక్కవచ్చని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటకలో చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యం పై సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిసింది.

మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం

  *మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం* ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు

  *రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు* విశాఖపట్నం: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 'సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని తెలిపింది. ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్

  విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గాఎస్.విద్యాసాగర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. అలాగే మల్కాపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగంలో సిఐగా బాధ్యతలు నిర్వహించారు సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు మేరకు విఆర్ నుంచి మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

2 - 3 రోజుల్లో జిల్లా

 *2 - 3 రోజుల్లో  జిల్లా SP లు* *బదిలీలు అయ్యే అవకాశం.* *తర్వాత  DSP లు బదిలీలు.* *CI ల  బదిలీలు.* *SI  ల బదిలీలు.* *తరువాత* *రెవెన్యూ డిపార్ట్మెంట్ బదిలీలు.* *ఇలా మొత్తం  అన్ని వ్యవస్థలు*  *బదిలీలు  చేయనున్న* *ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం .*

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం సిద్ధం

 *అమరావతి:* ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం సిద్ధం పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలకు ప్రభుత్వం అగీకారం ఈ నెల 24 నుంచి అన్ని రకాల బదిలీలకు అనుమతి నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామి తిరుణాల ఉత్సవాలు

  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  శ్రీ ఆంజనేయ స్వామి తిరుణాల ఉత్సవాలు   దాదాపు 42 చాందిని  బండ్లతో  తిమాసముద్రం ఆంజనేయ స్వామి తిరునాళ్ల ఉత్సవం   పెద్ద ఎత్తున చాందిని బండ్లు వేలాదిమందిగ తరలివచ్చిన భక్తులు  జనాలతో కిటకిటలాడుతున్న  తిమాసముద్రం ఆంజనేయులు స్వామి  తిరుణాల అంగరంగ వైభరంగా శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సమీపంలో ఉన్న తిమాసముద్రం శ్రీ ఆంజనేయ స్వామి  జాతర ఉత్సవాలు  13 చాందిని బండ్లతో  మారుమోగుతున్న అగ్రహారం

రేపు అసెంబ్లీకి రాకూడ‌ద‌ని వైసీపీ పార్టీ నిర్ణ‌యం

  *రేపు అసెంబ్లీకి రాకూడ‌ద‌ని వైసీపీ  పార్టీ నిర్ణ‌యం* శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.  రేపు ఆయ‌న స్పీకర్‌గా బాధ్యతలు స్వీక‌రించనున్నారు.  అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది.  సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది.  అయితే వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

  నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. నేడు అల్లూరి, ఏలూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గిరిజన బిడ్డలను చంపి వేస్తే తప్ప అరెస్టు చేయరా

  *గిరిజన బిడ్డలను చంపి వేస్తే తప్ప అరెస్టు చేయరా*  *అన్నమయ్య జిల్లా పోలీసులు తీరు దౌర్భాగ్యం*  *ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్*   గిరిజన బిడ్డలను   చంపివేస్తే తప్ప అరెస్టు చేయరా అంటూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ నాయక్ స్థానిక రాయచోటి సిపిఐ పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు...  ఈ సందర్భంగా..గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు దళిత కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్యం సుధీర్ కుమారులు మాట్లాడుతూ... పెద్దమండెం మండలం వడ్డే వంక తండాలో ఈనెల 13వ తేదీన.. బుక్కే రవీంద్ర నాయక్ ను.. అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ భర్త అయినటువంటి యుగంధర్ రెడ్డి , మరియు రమణారెడ్డి దయా రెడ్డి ప్రతాపరెడ్డి  మరియు వారి అనుచరులతో. ముఖ్య రవీంద్రనాయకులు మారిన ఆయుధాలతో అత్యంత కిరాతకంగా చంపి వేయడానికి ప్రయత్నం చేసి చనిపోయాడని వదిలివేసిపోయినటువంటి.. నిందితులను ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు హాస్యస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరు తోట...