Skip to main content

Posts

Showing posts from May, 2024

ఈ సమస్యకు లేదా పరిష్కారం?

  ఈ సమస్యకు లేదా పరిష్కారం? వాహనదారులకు తప్పని తిప్పలు.  చెరువును తలపిస్తున్న చుండుపల్లె రోడ్లు  పట్టించుకోని పంచాయతీ అధికారులు  అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండల కేంద్రంలోని రోడ్లు చెరువులనుతలపిస్తున్నాయి. సుండుపల్లె మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ వద్ద గల ప్రధాన రహదారిపై చిన్నపాటి  వర్షం వస్తే చాలు రోడ్డు చెరువును తలపిస్తోంది.  అటువైపుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దశాబ్ద కాలంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు నాయకులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇచ్చిన మాట అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షపు నీడకుండా డ్రైనేజ్ కూడా సుండుపల్లెలో రోడ్లపై ప్రవహిస్తుండడంతో దుర్గంధం  కూడా తాండవిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ముద్దు నిద్ర వదిలి మండలంలో ఉన్న పారిశుద్ధి సమస్యలపై కనీస దృష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

జిల్లాలో సంచలనం రేకెత్తించిన శేషాద్రి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్*

 బిగ్ బ్రేకింగ్ న్యూస్  అన్నమయ్య జిల్లా మదనపల్లె  *జిల్లాలో సంచలనం రేకెత్తించిన శేషాద్రి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్* ఈ నెల 25న మదనపల్లె అనపగుట్ట శ్రీవారి నగర్ లో జిల్లాలో సంచలనం రేకెత్తించిన రామారావు కానీకి చెందిన పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు(32) దారుణ హత్య కేసులో నిందితులను ఎట్టికేలకు పోలీసులు శుక్రవారం ఏడుగురిని అరెస్టు చేశారు. కుల సంఘాల నేతల మధ్య భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్మెంట్లు విచ్చలవిడిగ దాడులకు పాల్పడడం, కొట్టడం కులాన్ని, సంఘాలను అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేయడం, అట్రాసిటీ కేసులు పెట్టడం వంటివి చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కొందరిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు ఈనెల 25న అతి దారుణంగా కత్తులు, కొడవళ్లతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో క్రైమ్ నెంబర్ 152/2024 కేసు నమోదు చేసిన మదనపల్లి డిఎస్పి ప్రసాద్ రెడ్డి, టూ టౌన్ సీఐ యువరాజు, వన్ టౌన్ సీఐ పల్లి భాష, తాలూకా సిఐ శేఖర్, రూరల్ సర్కిల్ సీఐ  సద్గురుడు, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తదితరులు తమదయిన స్టైల్లో కేసునుల్లోతుగా దర్యాప్తు ...

కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

  కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెం ఘాట్ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. అడ్డతీగల మండలంలోని సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి తమ గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ చింతవానిపాలెం ఘాట్ కు వెళ్ళే సరికి ఒక్కసారిగా బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో బైక్ అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకొనిపోయి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాంబాబు భార్య కాసులమ్మ, అతడి కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తల్లి కూతుళ్లకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తమ సిబ్బం...

BREAKING: సజ్జలపై క్రిమినల్ కేసు

 BREAKING: సజ్జలపై క్రిమినల్ కేసు AP: వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదైంది.

నిన్న కోర్టులో ఊరట.. నేడు రిటైర్మెంట్

  *నిన్న కోర్టులో ఊరట.. నేడు రిటైర్మెంట్* AP: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేడు రిటైర్ కాబోతున్నారు.  నిన్న ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబీవీ.. ఆ ఉత్తర్వులను CS జవహర్ రెడ్డికి అందజేశారు.  ఈ అంశాన్ని పరిశీలిస్తానని సీఎస్ చెప్పారు.  కాగా, టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసింది.

విశాఖ మధురవాడ ప్రైవేట్ అపార్ట్మెంట్లో రెంటుకు ఉంటున్న ఉపాధ్యాయుడు పై

  విశాఖ  మధురవాడ ప్రైవేట్ అపార్ట్మెంట్లో రెంటుకు ఉంటున్న ఉపాధ్యాయుడు పై  అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్యూరిటీ.  దాడి  అపార్ట్మెంట్ కి సంబంధించిన రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయని ప్రశ్నిస్తే నేను రిటైర్ డిఎస్పి ని నువ్వు ఎవరో చెప్పుకుంటా వో చెప్పుకో.. రిటైర్ డి.ఎస్.పి గా చలామణి అవుతు   దుర్భాష లాడి ఇష్టమైనట్టు ప్రవర్తించి స్కూల్ ఉపాధ్యాయుడు  పై దాడికి దిగిన రిటైర్ డి.ఎస్.పి

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లు సీజ్

 అన్నమయ్య జిల్లా మదనపల్లె  *నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్లు సీజ్* మదనపల్లెలో తొమ్మిది ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారి దేవశిరోమణి తనిఖీ చేశారు. తిరుమల, రేయిన్ బో ఆసుపత్రిపై చర్యలకు సిఫార్సు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించలేదన్నారు. మూతపడ్డ స్కానింగ్ కేంద్రంలో ఓ ప్రభుత్వ డాక్టర్ విధులు నిర్వహించడం గుర్తించిన్నట్లు తెలిపారు

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను ఎస్కార్ట్‌ల సాయంతో త‌ర‌లించాలి

 ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ *పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను ఎస్కార్ట్‌ల సాయంతో త‌ర‌లించాలి* *స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలను త‌నిఖీ చేసిన‌ జిల్లా క‌లెక్ట‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం, మే 30 ః పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స్థానంలో పోలైన పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను జూన్ 02వ తేదీన ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ ఎస్కార్ట్‌ల సాయంతో మెయిన్ స్ట్రాంగ్ రూమ్ కు త‌ర‌లించాల‌ని రెవెన్యూ, పోలీసు విభాగాల‌ అధికారుల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున ఆదేశించారు. క‌మ్యునికేష‌న్ ఇంజ‌నీరింగ్ బిల్డింగ్ లో భ‌ద్ర‌ప‌రిచిన బ్యాలెట్ల‌ను ఈ.ఈ.ఈ. బ్లాక్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన పార్ల‌మెంటు కౌంటింగ్ కేంద్రం స‌మీపంలోని మెయిన్ స్ట్రాంగ్ రూమ్‌కు త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని ఆ మేర‌కు ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప‌రిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎం, పోస్ట‌ల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌ల‌ను జాయింట్ పోలీసు క‌మిష‌న‌ర్ ఫ‌క్కీర‌ప్ప‌తో క‌లిసి గురువారం సాయంత్రం ఆయ‌న త‌నిఖీ చేశారు. అక్క‌డ భ‌ద్ర‌తా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీళ్ల‌ను, అమ‌ర్చిన సీసీ టీవీల‌ను ప‌రిశీలించారు. పార్ల‌మెంటు, అసెంబ్ల...

సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  విశాఖ :  సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను డీకొన్న కారు.. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

CBSE, IIT & OLYMPIAD రాజంపేటలో ఏ పాఠశాలలో ఉన్నాయో అధికారులే ప్రకటన చేయాలి.

  అన్నమయ్య జిల్లా   CBSE, IIT & OLYMPIAD రాజంపేటలో ఏ పాఠశాలలో ఉన్నాయో అధికారులే ప్రకటన చేయాలి. అనుమతి లేకుండా అక్రమ అడ్మిషన్ చేస్తున్న యాజమాన్యాలకి అమ్ముడుపోయిన విద్యాశాఖ అధికారులుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.   గత కొంతకాలంగా రాజంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో విద్యను వ్యాపారంగా మార్చుకొని ఆ పాఠశాలలోనే విద్యార్థులకు ముందుగానే పార్టీ పుస్తకాలు వల్ల స్కూల్ పేరుతో ప్రింట్ చేపించి విక్రయిస్తున్నారని ప్రైవేట్ టీచర్లను ఆసరాగా ఉంచుకొని గొప్పల ప్రగడబాలు పలికి దాత ఒక 3,000 నుంచి 5000 వరకు ముందస్తు అక్రమ అడ్మిషన్ చేస్తూ వసూలు చేస్తున్నారని మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడియస్ యూ జిల్లా అధ్యక్షుడు నేటి నాగేశ్వర స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్  ఇండియా జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ నిరసన తెలిపారు.                   పట్టణంలో ఉన్న ఏ ప్రైమరీ స్కూల్ కు కూడా షిరిడి సాయి రెయిన్బో స్కూల్, BSC ప్రైమరీ స్కూల్, మరో రెయిన్బో హైస్కూల్లో CBSE, IIT & OLYMPIAD ఉన్నాయని తల్లిదండ్రు...

144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్సై రమేష్ బాబు

 144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్సై రమేష్ బాబు   జూన్ నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు సందర్భంగా అందరూ శాంతియుతంగా  ఎలాంటి అమాచినేయ సంఘటనలు జరగకుండా సామరశ్యంగా ఉండాలని సీఐ తులసిరామ్ తెలిపారు   మండల పల్లెల్లో చేసుకొనే సంబరాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, ముఖ్యంగా బెట్టింగ్లు జోలికిపోయిజీవితాలు నాశనం చేసుకోవద్దని, గతంలో జరిగిన చిన్నిపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఫలితాలు ఎలా వచ్చినా మనో  భావనలను గౌరవిస్తూ శాంతియుతంగా ఉండాలని రాయచోటి సీఐ తులసిరామ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం  మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మతసామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో  సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నమండెం  సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ  మండలంలో ప్రజలంతా మంచి సోదరుభావంతో మెలిగేవారని,  గతంలో  జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా  ఈ కార్యక...

జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం....సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ..

  జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం....సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ.. ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది..ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని   సాదారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది..మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..

అనకాపల్లి జిల్లా పోలీస్* *పత్రికా ప్రకటన*

  *అనకాపల్లి జిల్లా పోలీస్*  *పత్రికా ప్రకటన*  *ఈవీఎం స్ట్రాంగ్ రూముల చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించబడింది : అనపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు.* *అనకాపల్లి, మే 30:* గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్., వారి ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు అనకాపల్లి మండలం, శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్దగల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్  చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించారని తెలియజేశారు. ఈ ప్రకటన ద్వారా స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఉన్న గగనతలంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను 2 కిలోమీటర్ల మేర నిషేధించడం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... ఈ రెడ్ జోన్ నిబంధనలు వెంటనే అమలులోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించినారు. ఈ రెడ్ జోన్ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని అన్నారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించిన ఎడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించ...

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట*

  *ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట* ఆంధ్ర ప్రదేశ్ :  సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.  మూడు వారాల క్రితం ABV సస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

AP Election 2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటూగా స్పందించిన: సీఈఓ ఎంకే మీనా

  AP Election 2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటూగా స్పందించిన: సీఈఓ ఎంకే మీనా అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena)ఘాటుగా స్పందించారు. గురువారం మచిలిపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఈఓ ఎంకే మీనా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ రోజు లోపల హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.. అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామనివార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు..

మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేసిన గిరిజనులు*

  *అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేసిన గిరిజనులు* ఈరోజు అనగా తేదీ 30.05.2024న మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బోయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. మావోయిస్టులారా మా అల్లూరి జిల్లాకు రావద్దు అని నినాదాలు చేసినారు. ఇంతకుముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరియు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీని నిర్వహించినారు. గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న టవర్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాలు గురించి చెబుతూ, ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్ళమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు విశాఖపట్నం తిరగడానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుంది అని తెలుసుకుని ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ ర్యాలీలో మావోయ...

ఫుట్ పాత్.ల పై ఉన్న ఆక్రమణలను

 విశాఖ సౌత్ ట్రాఫిక్ ఏసిపి రాజీవ్ కుమార్ పరివేక్షణలో మల్కాపురం ట్రాఫిక్ ఎస్ఐ జి అప్పారావు దగ్గరుండి జీవీఎంసీ సచివాలయం సిబ్బంది అధికారులు కలిసి సిండియా నుంచి ఆర్కే పురం వరకు ఫుట్ పాత్.ల పై ఉన్న ఆక్రమణలను తొలగించారు ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ నివారణ సాధ్యమవుతుందని ముఖ్యంగా ఆక్రమణలు ట్రాఫిక్ ఇబ్బందులపై పోలీసు యంత్రాంగం సిపి ఆదేశాల మేరకు దృష్టి సారించమని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

  ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్  న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు (AP Election Results) మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు..ఇటు ఎన్నికల కమిషన్‌ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టయ్యింది. ఇటు హైకోర్టుకు.. అటు ఆదేశాలు..! ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బల్లెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్‌గా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈ రోజు వైసీపీ లంచ...

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు

  భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు టీ20లో భాగంగా జూన్ 9న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. ‘‘ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేం కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రతే మాకు ముఖ్యం. దాని కోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీని నియమించాం. ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’’ అని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు.

విశాఖ పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు సీఐ సమక్షంలో

  విశాఖ పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు సీఐ సమక్షంలో విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం లో మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సనఉల్లాహ్ స్వీయ పర్యవేక్షణలో గురువారం తోటి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉష్ణతాపంతో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమని సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుదల..

  నేడు ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాలు విడుదల..  ఉదయం 11 గంటలకు ఏపీ ఈసెట్ ఫలితాలు..  సాయంత్రం 4గంటలకు ఏపీ ఐసెట్ విడుదల..

YS జగన్మోహన్ రెడ్డి అనే... నేను...!!

  *YS జగన్మోహన్ రెడ్డి అనే... నేను...!!* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నేటికి సరిగ్గా ఐదేళ్ళు.... ఆనాడు ప్రమాణ స్వీకార వేదికపైనే... ఆనందపరవశురాలై... తన బిడ్డను ముద్దాడిన ఆ దృశ్యం... రాజకీయాలకు అతీతంగా ప్రతి హృదయాన్నీ తాకిందనడంలో సందేహం లేదు... ఆనాడు ఆ తల్లి కళ్ళలోని ఆనందం.... ఐదేళ్ళు గిర్రున తిరిగే సరికి ఎందుకు ఆవిరైపోయింది...?? అన్న వదిలిన బాణం... అన్నకే శరాఘాతం ఎందుకయ్యింది...?? కసిగా ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన 151 స్థానాల చారిత్రాత్మక విజయ ప్రస్థానం... నేడు ఏ తీరానికి చేరబోతోందో... మరో నాలుగు రోజుల్లో తేటతెల్లం కానుంది...

ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్

  ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.342కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా వెల్లడించారు. రూ.107.96 కోట్ల నగదు జప్తు చేయగా.. వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.78 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.35.61కోట్ల విలువైన మాదకద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రూ.123.64కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు.

కర్రోడా అన్నందుకు విడాకులు..!

  *కర్రోడా అన్నందుకు విడాకులు..!* భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.  ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు.  దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు.  హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది.  ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది.  భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.  ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది...

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!

  అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు! అంబటి రాయుడు భార్యకు కోహ్లి ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్పాల్ వెల్లడించారు. '1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు. IPL గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లిపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

  *ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!* ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ, కూటమి నేతల హంగామా మొదలైంది. తమ పార్టీదే అధికారం అంటూ సందడి చేస్తున్నారు.  వైసీపీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి వైజాగ్లో రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నారని టాక్. మరోవైపు అమరావతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  దీంతో జూన్ 9వ తేదీన అటు వైజాగ్..ఇటు అమరావతిలో హోటళ్లు అన్ని సోల్డ్ అవుట్ బోర్డులు కనిపిస్తున్నాయి.

కొత్త ప్రభుత్వం వస్తే???

  *కొత్త ప్రభుత్వానికి సవాలే..!* జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు.  కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం.   జగన్ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే కూటమి అధికారంలోకి వస్తే మాత్రం.. చంద్రబాబుకు కత్తి మీద సామే. రాష్ట్ర సర్కార్ కు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం పై ఉంది.  కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామని కూడా చెప్పుకొచ్చారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువుకు ప్రోత్సాహం, సాగుకు పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది.  ఇవన్నీ అమలు చేయడం కష్టతరం.అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చేందుకు తప్పనిసరి అయి పెద్ద ఎత్తున పథకాలు ప్ర...

మరో నెలలో పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

  *మరో నెలలో పదవీ విరమణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది.* *గతంలో చాలామంది అధికారులకు ఎదురైన పరిణామాలే.. జవహర్ రెడ్డి ఎదుర్కోక తప్పదు.*  *ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జవహర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.*  *అందుకే ఆయన ఎక్కువగా ఆందోళనతో ఉన్నట్లు సమాచారం*

పోలీస్ శాఖ లో పనిచేసే అధికారులు ,సిబ్బందిపై వచ్చే ఫిర్యాదుల పై విచారణ

  *పోలీస్ శాఖ లో పనిచేసే అధికారులు ,సిబ్బందిపై వచ్చే ఫిర్యాదుల పై విచారణ* *జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుంది* *పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి నుండి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి వరకు వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికారి సంస్థ గుంటూరు, చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు* ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్టిక్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ (పరిపాలన & విధానం) అథారిటీల ఏర్పాటు పనిచేయడం గురించి గుంటూరు ప్రధాన కేంద్రంగా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల అధికార పరిధిగా కాజా గ్రామం లోని లాస్య రెసిడెన్సి 2 లో 106 అండ్ 107 ప్లాట్ నెంబర్లలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అథారిటీ చైర్మన్ నిరంజన్ తెలిపారు చైర్మన్ తో సహా ముగ్గురు సభ్యులు ఉంటారని అన్నారు.పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  స్థాయి అధికారి పై పై వచ్చే ఫిర్యాదులను జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుందని ఆ సంస్థ చైర్మన్, రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు. మం...

జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు

 *జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులు* ఆంధ్ర ప్రదేశ్ :  జూన్ 1న సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేని వారు, వీల్ ఛైర్లో ఉండేవారికి మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేయనుంది. పింఛన్లను ఏప్రిల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయగా, గత నెలలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.

ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!

 AP Election 2024 Counting Update: ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు! ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్లు అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. అదే టైంలో లెక్కింపుపై కూడా ప్రభావం చూపబోతున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్స్‌. ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల (Postal Ballot) వివాదం నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో బ్యాలెట్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ఈసీ.. ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది.  - వైసీపీ అభ్యంతర...

మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..

 రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా.. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

*కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా*

  *కౌంటింగ్ రోజు ఏపీ అంతటా 144 సెక్షన్: ముకేశ్ కుమార్ మీనా*

టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే

T20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే T20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5న న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో పోటీపడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లన్నీ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. కాగా గ్రూప్-Aలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి.

పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది.

  *పిఠాపురంలో స్టిక్కర్ల వార్_*  పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది.  స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్' అంటూ రాయించుకుంటున్నారు.  అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత' అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు.  ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీకే చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది.. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు...

చెట్టు కొమ్మ పడి రోడ్డు పై వెళ్తున్న ఆటో పై

  విశాఖ అక్కయ్యపాలెం చెట్టు కొమ్మ పడి రోడ్డు పై వెళ్తున్న ఆటో పై పడటం వల్ల ఆటో ముందుభాగం ద్వంసం అయింది.. స్థానికుల కథనం ప్రకారం ఒక అరగంట ముందు ఒక భారీ వాహనం ఆ చెట్టుని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని తెలుస్తుంది.

బిల్టు ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన 69 కోట్లు వేతనాలు ఇవ్వకుండా...వేదిస్తున్న బిల్టు ఫ్యాక్టరీ యాజమాన్యం పై అలుపెరగని పోరాటం చేస్తున్న డా. ఆకుల గణేష్....

  బిల్టు ఫ్యాక్టరీలో 40 సంవత్సరాల నుండి పనిచేసి కర్మాగారం ఒడిదుడుకులలో పాలుపంచుకున్న కార్మికుల కు రావాల్సిన వేతనాలు ఇవ్వకుండా బిల్ట్ యాజమాన్యం కార్మిక నాయకులతో కుమ్మక్కై కర్మాగారాన్ని 2014 ఏప్రిల్ 6న బందు చేసి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు తీరని అన్యాయం చేసారు అని ప్రముఖ సమాజ సేవకులు న్యాయవాది డా ఆకుల గణేష్ మాట్లాడుతు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి అని అన్నారు. కర్మాగారంలో ఉత్పత్తికి డిమాండ్ లేదనే సాకు తో యాజమాన్యం కార్మికులను అర్ధాంతరంగా బయటకు పంపించింది.  అప్పుడున్న సమయంలో ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేసినప్పటికీ యాజమాన్యం కార్మికులను పట్టించుకోకుండా కేవలం కార్మిక నాయకులతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చింది అని విమర్శించారు. రోజు గేటు లోకి వచ్చి సంతకాలు చేస్తేనే కార్మికులకు వేతనాలు ఇస్తారని లేకుంటే ఇవ్వరు అని చెప్పి కార్మిక జేఏసీ నాయకులు భయపెడితే బయట పనులకు కూడా వెళ్లకుండా ఫ్యాక్టరీ కి వెళ్లినసరే  జీతాలు ఇవ్వలేదు ఇల్లు గడవక .ఆపద కాలంలో పనికి వస్తాయని ఇదివరకు ఎల్ఐసి చేసుకున్నాము. కానీ మధ్యలోనే ఎల్ఐసీలు ఆపివేసి కుటుంబాలను ఆదుకున్నాము అయినా అవి సరిపోక ...

జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.🇮🇳 జైహింద్🇮🇳 సత్యమేవ జయతే🇮🇳

సిఎం జగన్‌పై దాడి కేసుకు సంబంధించి కోర్టులో విచారణ

  *సిఎం జగన్‌పై దాడి కేసుకు సంబంధించి కోర్టులో విచారణ* నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది.  8 వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.  దీని పై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.

సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!

సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్వేడుకలు! అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలుమొ దలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువే డుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ప్రయాణించనుంది. మొత్తం 800మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్,ధో నీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీసేవలుఅందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈపార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.

విశాఖలో ఇద్దరు మందుబాబులు బుల్లెట్ వాహనంపై వీరంగం..

  విశాఖలో ఇద్దరు మందుబాబులు బుల్లెట్ వాహనంపై వీరంగం.. * *విశాఖ:* విశాఖలో కాన్వెంట్ జంక్షన్ వద్ద పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తాగిన మత్తులో డ్యూటీలో ఉన్న పోలీసు వారిని రాయల్ ఎన్ఫీల్డ్ టూవీలర్ వాహనంతో గుద్ది తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్స్ కిందన పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న బాలరాజు అనే ఒక హోంగార్డ్ చాకచక్యంగా వాడిని వెంబడించి పట్టుకొనడం జరిగింది. స్వల్ప గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ రాజు.  ఆ తాగుబోతులు నడుపుతున్న వాహనానికి ముందు ఒక నంబర్ వెనక ఇంకొక నెంబర్ ఉండడం గమనించిన పోలీసు వారు మరి తాగిన మత్తులోనూ లేదా వాహనానికి ఉన్న నంబర్ తప్పు కదా అను తాగుబోతుల దుశ్చర్య. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్న ప్రజలు..❗ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వాహనంతో ఢీకొని తప్పించుకునే ఇటువంటి వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ❓ ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడే వాహనదారుల్ని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు ఇంకెవరు చేయకుండా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత పోలీసు వారి పై ఉన్నది ❗

ఐపీఎల్ విజేత KKR

  ఐపీఎల్ విజేత KKR కోల్కతా నైట్రెడర్స్ IPL-2024 విజేతగా నిలిచింది. SRHతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. SRH ఇచ్చిన 114 పరుగుల టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ 52*, గుర్బాజ్ 39 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు.