Skip to main content

Posts

Showing posts from July, 2025

పెట్రోల్ బంక్ సిబ్బంది వినియోగదారుడుతో

 పెట్రోల్ బంక్ సిబ్బంది వినియోగదారుడుతో ఖచ్చితంగా  మర్యాదగా ప్రవర్తించవలసిందే అని వినియోగదారుల చట్టం 2019 స్పష్టం చేస్తుంది. ....... మురికిపూడి ప్రసాద్  కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు  పెట్రోల్ బంకులను తరచుగా పర్యవేక్షించి కొలతలు సరిగా వస్తున్నాయా రావటం లేదా అనే అంశాన్ని నిర్ధారించి వినియోగదారులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే . ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో 400 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ పెట్రోల్ వచ్చిందని వినియోగదారుడు వాపోయాడు. ఇదే అంశాన్ని ప్రధాన వార్తా పత్రికలు చానల్స్ ప్రచారం చేశాయి.  ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత సంబంధిత అధికారులు ఆ బంకును పరిశీలించి కొలతలు కరెక్ట్ గానే ఉన్నాయని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో ఆయా బొంకుల యజమానులు కొలతలు సరి చేసుకునే చిప్ ఉపయోగించి సరిచేసుకునే అవకాశం ఉంది. అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడు మాత్రమే.  పెట్రోల్ తగ్గినప్పుడు వినియోగదారుడు, బంక్ సిబ్బంది చొక్కా చొక్కా పట్టుకొని పరిస్థితి ఎన్నడూ రాకూడదు. డబ్బు చెల్లించిన వినియోగదారుడికి 100% న్యాయం చేయవలస...

శ్రీ శిరిడీ సాయి సత్సంగ మందిరంలో ఈ రోజు

వెల్కమ్ టు న్యూస్ నైన్ నేను మీ దీప్తి మార్కాపురం పట్టణంలో శ్రీ జవహర్ నగర్ కాలనీలో వెలసినటువంటి శ్రీ శిరిడి సాయి సత్సంగ మందిరంలో ఈరోజు గురుపౌర్ణమి పర్వదినం పునస్కరించుకొని శ్రీ సాయినాథుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు  ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండి జూలై పాటించి అత్యంత భక్తి శ్రద్ధలతో మ్రొక్కులు తీర్చుకున్నారు ఆలయంలోని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాయినాధుని సేవకులు ఏర్పాట్లను చేశారు ఆలయ వ్యవస్థాపకులు పూజ్యులు గౌరవనీయులు అయినా శ్రీ ఆర్ రామచంద్రా రావు గారు ఆధ్వర్యంలో గురుపూర్ణిమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులచే సాయి సత్య వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా షిరిడీ సాయి సేవాసదనం కార్యక్రమం పేరుతో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మరియు దుప్పట్లు, కండువాలు బహూకరించారు మధ్యాహ్న సమయంలో సాయినాధునికి ప్రత్యేక హారతి ఇవ్వడం జరిగింది. తదుపరి భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు జై సాయిరాం జై జై సాయిరాం🙏🙏

తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం

 చిలకలూరిపేట...  8వ వార్డు లోని మున్సిపల్ పాఠశాల లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతిక ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రామానికి తల్లిదండ్రులు, విద్యార్థులు  పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా 8వ వార్డ్  కౌన్సిలర్ కొత్త కుమారి  పాల్గొని విద్యార్థులు కు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్డు కౌన్సిలర్ కోత్త కుమారి  మాట్లాడుతూ  విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో భావితరానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు  ఆదర్శంగా నిలవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో  స్కూలు పిల్లలకు యూనిఫార్మ్స్, బూట్లు మరియు తల్లిదండ్రులకు మొక్కలు అందజేయడం జరిగినది

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో

 వెల్కమ్ టు న్యూస్ నైన్ మార్కాపురం పట్టణంలో  శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో గురు పూర్ణిమ పర్వదినాన్ని పునస్కరించుకొని మన అందరికీ ఆచార్యులు అయినటువంటి శ్రీశ్రీశ్రీ జగద్గురు రామానుజుల వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకుడు అయినటువంటి శ్రీపతి అప్పనాచార్యుల చేతుల మీదుగా స్వామివారికి విశేషంగా అభిషేకము అర్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి స్వామివారికి స్తోత్ర పారాయణ  పారాయణాలు విష్ణు సహస్రనామ పారాయణం చదవడం జరిగింది తదనంతరం మంగళహారతి ప్రసాద వితరణ ఇవ్వడం జరిగింది. జై శ్రీమన్నారాయణ జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ🙏🙏🌺🌺

అవినీతి ఉద్యోగులపై హైకోర్టు సంచలన తీర్పు..

 అవినీతి ఉద్యోగులపై హైకోర్టు సంచలన తీర్పు.. అవినీతి అధికారులను దేశద్రోహులుగా ప్రకటించాలి: మద్రాస్ హైకోర్టు అవినీతికి పాల్పడే అధికారులు, ప్రజాసేవకులను దేశద్రోహులుగా ప్రకటించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలతో సస్పెండైన పి. శరవణన్ అనే వీఆర్వో మార్చి 28న చేసిన పిటిషన్ ను విచారిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం సుబ్రహ్మణ్యం ఈ విధంగా వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో అవినీతి భారత రాజ్యాంగానికి అతి పెద్ద శత్రువుగా ఆయన అభివర్ణించారు. వివిధ రూపాల్లో పెచ్చురిల్లిపోతున్న అవినీతిని అరికట్టడానికి న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వోద్యోగికి లంచం ఇవ్వడమనేది దేశంలో ఒక పెద్ద జాఢ్యంగా మారిందని, పుట్టబోయే బిడ్డకు కూడా ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇస్తేనే పనవుతుందన్న విషయం తెలుసని అన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగా నిలిచే అవినీతి అధికారులు దేశద్రోహుల లెక్కలోకే వస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దేశంలో అలజడులు సృష్టించి, పురోగతిని అడ్డుకునే ఉగ్రవాదులకు, అవినీతి అధికారులకు మధ్య పెద్ద తేడా లేదని ఆయన అన్నారు. అవినీతిపరులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని పే...

కోనేటి బజారులో వెలసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి

 వెల్కమ్ టు న్యూస్ నైన్ న్యూస్ నైన్ కి స్వాగతం నేను మీ దీప్తి మార్కాపురం పట్టణంలోని కోనేటి బజారులో వెలసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి లక్ష్య మల్లెల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి పైడా చక్రధర్ శర్మ శ్రీపతి అప్పనాచార్యులు చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం మరియు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం చేశారు తదనంతరం స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది.

ప్రకటన ద్వారా మోసపోవద్దు

 ప్లాట్లు కొనేముందు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి.. ప్రకటన ద్వారా మోసపోవద్దు.       కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్  లేఅవుట్ వేసిన వెంచర్లు అని లేదా గేటెడ్ కమ్యూనిటీ అనీ వచ్చే ప్రకటనల్లో నిజా నిజాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని ప్రసాద్ అన్నారు. సినిమా యాక్టర్లు, టీవీ ఆర్టిస్టులు, లేదా ఇతర రంగాల్లోని ప్రముఖులు ఆ ప్రకటనల్లో చెప్పారని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ఇటీవల ఒక లేఅవుట్ ప్రకటనలో సినీ నటుడు మహేష్ బాబు ఒక వెంచర్ గురించి ప్రకటనలో పాల్గొని కొనుగోలు చేయమని చెప్పగా. అది విని లేదా చూసి సినీ నటుడు మహేష్ బాబు పై నమ్మకంతో వినియోగదారులు ఆ ప్లాట్లు కొన్నారు. కానీ నిజంగా అక్కడ లే అవుట్ కూడా లేదు. ఈ మేరకు వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు   కోర్టు నోటీసులు మహేష్ బాబు కు పంపించింది. కాబట్టి ప్రకటనలు నమ్మి కొనవద్దు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు చేయాలని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ వినియోగదాన్ని కోరారు.

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో

  న్యూస్ నైన్ న్యూస్ స్వాగతం సుస్వాగతం నేను దీప్తి :   సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవార్లకి ఆషాడం సారే అందజేత  మార్కాపురం:- .                                           సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్లు ,సభ్యులు 40 మంది ఆధ్వర్యంలో పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ, కాలేజీ రోడ్డులో గల పోలేరమ్మ, కనకదుర్గమ్మలకు ఆషాడం సారె అందజేయడం జరిగింది   ఈ ఆషాడం సారే కార్యక్రమాన్ని  ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఘన స్వాగతం తో మహిళలందరూ  అమ్మవార్లకి భక్తిశ్రద్ధలతో  సారే అందజేసి పూజలు చేశారు    ఈ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి అర్చకులు మాట్లాడుతూ పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక్కొక్క విశిష్టత ఉందని అందులో ఆషాడ మాసంలో అమ్మవారికి సారె మరియు వివిధ రకాల పూజలు చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయని, ఈ మాసానికి దైవ బలం ఎక్కువ అని, ఈ మాసంలో మంత్రోచ్ఛరణ చేయడం వలన కుటుంబం అభివృద్ధి చెందుతుందని, పలు రకాల దోషాలకి హోమాల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన ...

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో వికాస తరంగణి ఆధ్వర్యంలో

 SRI lakshmi Channa kesava Swami temple Markapur.వెల్కమ్ టు  న్యూస్ నైన్ న్యూస్ స్వాగతం సుస్వాగతం నేను దీప్తి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో వికాస తరంగణి ఆధ్వర్యంలో భగవద్గీత 18 అధ్యాయములు పారాయణం కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.....

ప్రతి వ్యక్తికి ముఖ్యమైన నంబర్ల జాబితా, అన్ని నంబర్లు టోల్ ఫ్రీ...

 *ప్రతి వ్యక్తికి ముఖ్యమైన నంబర్ల జాబితా, అన్ని నంబర్లు టోల్ ఫ్రీ...* _________________________ CM ఫిర్యాదు పోర్టల్👉181 విద్యుత్ సేవ👉1912 జంతు సేవ👉1962 పోలీస్ సేవ👉112,100 అగ్నిమాపక సేవ👉101 అంబులెన్స్ సేవ👉102 ట్రాఫిక్ పోలీస్👉103 విపత్తు నిర్వహణ👉108 చైల్డ్ లైన్👉1098 రైల్వే విచారణ👉139 అవినీతి నిరోధకం👉1031 రైలు ప్రమాదం👉1072 రోడ్డు ప్రమాదం👉1073 CM హెల్ప్‌లైన్👉1076 క్రైమ్ వ్యంగ్యం👉1090 మహిళల హెల్ప్‌లైన్👉1091 భూకంపం👉1092 పిల్లల దుర్వినియోగ సహాయం👉1098 రైతు కాల్ సెంటర్👉1551 పౌర కాల్ సెంటర్👉155300 రక్త బ్యాంకు👉9480044444 సైబర్  క్రైమ్👉1930. 🙏 మండల సమాచార కేంద్రం. MCIC ఇంచార్జ్ బొబ్బిలి. CRPFI. విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షులు & జాతీయ వినియోగదారుల హక్కులు పరిరక్షణ సమితి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ డి సురేష్.PR. 9133366449.🇮🇳 జైహింద్🇮🇳

ఆమలక లక్ష్మీనారాయణ స్వామి కోవెలలో

 Welcome to news9 న్యూస్ నైన్ కి స్వాగతం సుస్వాగతం నేను దీప్తి ఈరోజు ఆషాడ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామి కోవెలలో భగవత్ గీత 18 అధ్యాయాలు పారాయణం  జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు*

 *వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు* ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.  వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.  ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ  https:/consumerhelpline.gov.in/  వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో పొందుపరుస్తోంది.🙏 ...

ప్రముఖ పుణ్య క్షేత్రం కోటప్పకొండ లో భక్తులతో కిటకిట లాడుతుంది

 చిలకలూరిపేట న్యూస్9: తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ పుణ్య క్షేత్రం కోటప్పకొండ లో భక్తులతో కిటకిట లాడుతుంది

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక సంబంధిత అవినీతి అధికారుల పైన ఆదాయ పన్నుశాఖ వారికి ఫిర్యాదు చేయవచ్చు. 🙏 మండల్ సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇంచార్జ్ ఎం నరసింహారావు బొబ్బిలి విజయనగరం జిల్లా.CRPFI. గౌరవ అధ్యక్షులు  & జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. 🇮🇳CRPFI 🇮🇳 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ డి సురేష్. 9133366449.PR🙏 ఆదాయానికి మించిన అధికారులు వారి ఆస్తులుపై గుర్తించి వారికి సంబంధించిన ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో ఎస్.ఆర్ లో ఉన్న ఆస్తులు, చేరిన తరువాత వారు కొన్న ఆస్తులు,వారి బినామీ పేర్లతో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆదాయపన్నుశాఖ ఓ అధికారి మాట్లాడుతున్న సందర్భంలో వారుపై వివరాలు వెల్లడించారు.                అందువలన ప్రజలు వారి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳ఈ రాష్ట్ర ప్రజలు భావి తరాల భవిష్యత్తు కోసం అవినీతి అంతం వైపు అడుగుల వేయండి...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.*

 *ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.*   *ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు.   *లంచగొండి అధికారులపై కేసులు పెట్టే వారికి రక్షణ కోసం..*   *ఏడీజీపీ స్థాయి అధికారికి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు.*   *నోడల్‌ అధికారిగా ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా నియామకం.🌹🙏🌹*🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి, 🇮🇳CRPFI🇮🇳 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీPR. డి. సురేష్, 9133366449. & మండల సమాచార కేంద్రం,MCIC ఇంచార్జ్ ఎం నర్సింగరావు బొబ్బిలి విజయనగరం జిల్లా. Crpfi. గౌరవాధ్యక్షులు.🇮🇳 Jay Hind,🇮🇳 ఈ రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి చేయి చేయి కలపండి🫱🏾‍🫲🏼 భావితరాల భవిష్యత్తు కోసం. గూగుల్ సెర్చ్🫱🏾‍🫲🏼🙏 సత్యమేవ జయతే🙏

అడ్మిషన్లను తిరస్కరిస్తే....

 విద్యార్థి తల్లిదండ్రుల మనవి... *You ask them the orders...*   *నువ్వు వాళ్ళని ఆర్డర్స్ అడగు....* విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవైట్ పాఠశాల లు యాజమాన్యాలు..  వారికి ఏదో చట్టంపై అవగాహన ఉన్నట్లు... విద్యా చట్టాన్ని వారే రూపొందించినట్టు... అడ్మిషన్లను తిరస్కరిస్తే.... ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో... పాఠశాల యాజమాన్యాన్ని.. విద్యాశాఖ అధికారులను.. రాతపూర్వకంగా లెటర్ అడగండి... వీరు చెప్పే చట్టం ఉత్తర్వులను చూపమనండి .. లేదా వీరు చెప్పే.. కోర్టు ఉత్తర్వులు చూపమనండి.. ఉచిత విద్య అడ్మిషన్లు ఇవ్వనంటే... తిరస్కరిస్తే.. విద్య హక్కు చట్ట ప్రకారం... పాఠశాల యాజమాన్యాలు... విద్యాశాఖ అధికారులు చట్టం దృష్టిలో దోషులే... *"ఒక పాఠశాల ఉచిత విద్య అడ్మిషన్ ను తిరస్కరిస్తే, అది విద్యా హక్కు చట్టం 2009లోని సంబంధిత నిబంధనలను (ముఖ్యంగా సెక్షన్ 12, 13 మరియు 15) ఉల్లంఘించినట్లు అవుతుంది మరియు పాఠశాల యాజమాన్యం మరియు అధికారులు చట్టపరమైన చర్యలు, జరిమానాలు లేదా గుర్తింపు రద్దు వంటి శిక్షలకు గురవుతారు."* __________ -తలిదండ్రులారా... మారుదాం....! మారుద్దాం...

మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు

  మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్‌ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బార్‌ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🫱🏾‍🫲🏼 ఈ ప్రజా కూటమి  ప్రభుత్వం. ఆదేశాలను  పాటించని స్థానిక నియోజకవర్గం అవినీతిపరులను. సిండికేట్ దోపిడీదారుల ను అవినీతి సంబంధిత శాఖ అధికారులను వారికి సపోర్ట్ చేస్తున్న వారిని. ఈ రాష్ట్ర ప్రజలుపట్టించండి. ఎంతటివారినైనా వదలొద్దు  గూగుల్ సెర్చ్ టోల్ ఫ్రీ 🇮🇳కేంద్ర రాష్ట్ర నిజాయితీ గలCBI. IT. ఐబీ.ACB. విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేయండి. మీ మొబైల్ లో  మెయిల్ ద్వారా ఫ్యాక్స్  గూగుల్  వినియోగించండి. X గ...

పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా

 పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా... టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా...  ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా...  పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా... పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన... పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన...  పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు... ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు. ఇండియన్ ఆయిల్-1800233355 భారత్ పెట్రోలియం-1800224344 హెచ్పిసిఎల్-18002333555 రిలయన్స్-18008919023.. 🙏 మండల సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇన్చార్జ్. &CRPFI 🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ D. సురేష్. 9133366449🙏🇮🇳 జై హింద్🇮🇳 మేలుకో వినియోగదారుడా🫱🏾‍🫲🏼

వంగ‌వీటి మోహ‌న రంగా 78వ జ‌యంతి సందర్భంగా వంగ‌వీటి మోహ‌న రంగా విగ్రహావిష్కరణ

 విజయవాడ... *విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 14వ డివిజ‌న్ లో వంగ‌వీటి మోహ‌న రంగా 78వ జ‌యంతి సందర్భంగావంగ‌వీటి మోహ‌న రంగా విగ్రహావిష్కరణ  *వంగ‌వీటి మోహ‌న రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన   ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, టిడిపి రాష్ట్ర నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ‌కృష్ణ‌, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌న‌కుమార్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, పెనుములూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పాల్గొన్నారు.. *వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హానికి పూల‌మాల ఘ‌నంగా నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, టిడిరాష్ట్ర నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ‌కృష్ణ‌ *బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి వంగ‌వీటి మోహ‌న రంగా అంటూ ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడిన ఎంఎల్ఏ  గద్దె రామ్మోహన్ రావు *పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన్ రంగ చివరి శ్వాస వరకు కృషి చేశారు.. *వంగవీటి మోహన్ రంగా ఒక వర్గానికి చెందిన నేత కాదు ప్రజా నాయకుడు.. అన్నదాన కార్యకరం కూడా ఏర్పాట్టు చేసారు  ఈ కార్యక్రమంలో కూటమి  నేతలు మరియు రాధా రంగా మిత్ర...

రాణి గారి తోట‌లో వంగ‌వీటి రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

 రంగా ఒక వ్య‌క్తి కాదు ఒక శ‌క్తి  :  ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  రాణి గారి తోట‌లో వంగ‌వీటి రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ రంగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ‌కృష్ణ‌ రంగా సేవ‌ల‌ను కొనియాడిన ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు విజ‌య‌వాడ :  వంగ‌వీటి మోహ‌న రంగా ఒక వ్య‌క్తి కాద‌ని, ఒక శ‌క్తి అని  విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.. వంగ‌వీటి మోహ‌న రంగా 78వ జ‌యంతి సందర్భంగా రాణిగారితోట‌లో రాధ రంగామిత్ర‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో  వంగ‌వీటి రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, టిడిపి రాష్ట్ర నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ‌కృష్ణ‌, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు సామినేని ఉద‌య్ భానుల‌తో క‌లిసి వంగవీటి మోహ‌న రంగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంతరం రంగాకి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించ...