కొరత మరియు విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడుతున్న ప్రభావం
తేదీ: 27-01-2026 విజయనగరం జిల్లా గౌరవనీయులైన మంత్రి వర్యులు, ఉన్నత విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం: JNTUGV విజయనగరం - అధ్యాపకుల కొరత మరియు విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడుతున్న ప్రభావం - నివారణ చర్యలకై విన్నపం. ఆర్యా, ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం JNTU విజయనగరం (JNTUGV)ను స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుత పరిపాలనాపరమైన మరియు అధ్యాపకుల విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయంలో తమరి జోక్యాన్ని కోరుతూ ఈ క్రింది అంశాలను విన్నవించుకుంటున్నాము: 1. ఉత్తరాంధ్ర విద్యార్థుల ప్రయోజనాలు: JNTU విజయనగరం ప్రధానంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం. ఇక్కడ నియమితులైన అధ్యాపకులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల, స్థానిక విద్యార్థులు నిపుణులైన బోధకుల సేవలను కోల్పోతున్నారు. 2. అకడమిక్ ప్రమాణాలు మరియు ప్రాజెక్టులు: అధ్యాపకుల కేటాయింపులో స్పష్టత లేకపోవడం వల్ల పరిశోధనలు (Research), స్టూ...