Posts

Showing posts from December, 2025

సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి*

Image
 *సామాజిక  స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి* *ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జర్నలిస్ట్ మస్తాన్ వలి ని సత్కరించిన సీపీఐ నాయకులు*  సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి అని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మస్తాన్ వలి నీ   సీపీఐ కార్యాలయంలో ద్దుశాలువా, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మస్తాన్ వలి జర్నలిస్ట్ గానే కాకుండా సేవ కార్యక్రమాల్లో ముందుంటారని  అన్నారు.జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జర్నలిజానికి వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల,AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,ఎఐటియుసి కార్యదర్శి దాసరి వరహాలు,వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలికా శ్రీనివాసరావు, ఏరియా కౌన్సిల్ సభ్యులు CR సృజన్, నాయకులు కొండల రావు,నానా, మంత్రూ నాయక్,కరిముల్ల ...

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్

Image
 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్  పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం సర్వర్ పనిచేయకపోవడంతో కక్షిదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధిత సర్వర్ మోరాయించడంతో సాయంత్రం అయినప్పటికీ పూర్తిగా కాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ. నిర్దేశించిన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. కొద్దిసేపు సర్వర్ రావడం మరికొద్ది సేపట్లో వెంటనే పోవడంతో  కక్షీదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం  వద్దనే పడి కాపులు కాశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు కోరేరు.