Posts

Featured Post

🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳

Image
🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳 ప్రియమైన తల్లిదండ్రులారా... భావి భారత పౌరుల నిర్మాణ శిల్పులారా... ఈ రోజు మన దేశానికి అత్యంత పవిత్రమైన రోజు – భారత రాజ్యాంగ దినోత్సవం! కానీ... కేవలం శుభాకాంక్షలు చెప్పుకుని సరిపెడదామా? మన గొంతు మూగబోయిందా? 😔 ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి!  * మీ పిల్లల విద్య హక్కును – దేశ భవిష్యత్తును – మీ కళ్ల ముందే దూరం చేస్తుంటే...  * రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు – ఉచిత, నిర్బంధ విద్య ఆశయాలు – అటకెక్కుతుంటే...  * విద్య చట్టాలు కాగితాలకే పరిమితమై, అమలుకు నోచుకోకుంటే...  * జ్ఞానాన్ని అమ్మకపు వస్తువుగా మార్చి, విద్యతో బహిరంగ వ్యాపారం చేస్తుంటే... మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఈ రాజ్యాంగం మీకిచ్చిన అత్యంత విలువైన ఆయుధం – ప్రశ్నించే హక్కు! మీరు ఈ హక్కును ఎందుకు కోల్పోయారు? ఎందుకు వదులుకున్నారు? ప్రశ్నించండి! భయం వీడండి! స్వార్థం వదిలేయండి! మీ ఒక్కరి బిడ్డ కోసం కాదు, రేపటి సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం... 🔥 ధైర్యంగా నిలబడండి! గట్టిగా అడగండి! 🔥 ఓ తల్లి గా ఓ తండ్రి గా..  రాజ్యాంగం సాక్షిగా... మన పిల్లల భవిష్యత్తు సాక్షిగా... విద్య హక...

వినియోగదారుల సంఘం ఫిర్యాదుతో చీరాల రోడ్ ను బాగు చేసిన జాతీయ రహదారి అధికారులు

Image
 వినియోగదారుల సంఘం ఫిర్యాదుతో చీరాల రోడ్ ను  బాగు చేసిన జాతీయ రహదారి అధికారులు  పట్టణంలో కళామందిర్ సెంటర్ నుంచి చీరాల వెళ్ళు జాతీయ రహదారి గుంటలు పడి రెండు సంవత్సరాలు  అయింది. జాతీయ రహదారి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం తెలుసుకున్న కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫారం ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఫిర్యాదు నెంబర్ PLND 20025103036 గా నమోదు చేయడంతో జాతీయ రహదారి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఈ రోడ్డును జాతీయ రహదారి అధికారులు బాగు చేశారు.   పట్టణానికి అనేక గ్రామాల నుంచి వచ్చే రహదారి కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం

Image
 *"ఐబొమ్మ" ఇమ్మడి రవి వలన చిత్ర పరిశ్రమకు నష్టం ఎంత,,? సినిమాల వలన యువత  భవిత కు వాటిల్లుతున్న నష్టం ఎంత? ..సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్* *హీరో అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం*  ఐబొమ్మ ఇమ్మడి రవి వలన చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది కనుక రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ తీర్పులు వ్రాసేస్తున్న సినిమా పెద్దలు, సినిమాల వలన మన యువత విలువైన సమయాన్ని, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారనే విషయం గుర్తించాలని సామాజికవేత్త భాను ప్రసాద్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సినిమాలో నటించేవారి వారు అభినయించే పాత్రలను బట్టి "కథానాయక పాత్రధారులు"  లేక "హీరో పాత్రధారి" అని సంబోధించడానికి బదులుగా ,పదాలను పూర్తిగా మార్చేసి నేటి ఎంటర్టైన్మెంట్ మీడియా నిర్వాహకులు *హీరో* అనే పదం వాడుతున్నారని, అంతేకాకుండా వాళ్లకి లేనిపోని తోకలనూ తగిలిస్తున్నారని, పత్రికలే ఆ రకంగా వ్రాస్తే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. విద్యార్థులు హై స్కూల్ స్థాయి నుండి నటీనటులను మరి ముఖ్యంగా హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల కం...

ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.🇮🇳

Image
  ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.🇮🇳 డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.🇮🇳 హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి నిందితులపై క్రిమినల్‌ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది.🇮🇳 డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించ కూడదని ధర్మాసనం పేర్కొంది.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 జైహింద్ 🇮🇳crpfi🇮🇳

అన్నదాత సుఖీభవ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్

Image
 కృష్ణాజిల్లా   పెనమలూరు *అన్నదాత సుఖీభవ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్* ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తెలిపారు  పోరంకి లక్ష్మీపురం కాలనీలోని వ్యవసాయ సహకార బ్యాంకు నందు నాలుగో విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని అన్నదాత సుఖీభవ రైతులకు చెక్కుల పంపిణీ చేశారు.  *ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ..*  గత ప్రభుత్వం రైతులకు అప్పు పెట్టిన 1700 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది,  రైతు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తోందని.. కూటమి ప్రభుత్వం రైతుకి ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటివరకు 14000 అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో  జమ చేశారని పేర్కొన్నారు.

నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు

Image
 *విజయవాడ* *మహేష్ చంద్ర లడ్డా... అడిషనల్ డి.జి*   *బిగ్ బ్రేకింగ్* *నేడు కూడా ఏజెన్సీలో  నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయి* ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు నిఘా వర్గాలు వారి కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టాం యన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ,‌కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది  మావోయిస్టులు లను పట్టుకున్నాం ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమం కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నాం వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్,  750 గ్రాముల వైర్,  ఇతర సామాగ్రి ని పట్టుకున్నాం మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు ఇందులో  పాల్గొన్న వారం...

నాసా ముక్త్ భారత్ కుషాల్ భారత్,నాసా ముక్త్ భారత్ అభయం 5 సవంత్సరాల సెలబ్రేషన్

Image
 న్యూస్ 9 channel ఎన్టీఆర్ జిల్లా విజయవాడ1  8/11/25 నాసా ముక్త్ భారత్ కుషాల్ భారత్,నాసా ముక్త్ భారత్ అభయం 5 సవంత్సరాల సెలబ్రేషన్ ను విజయవాడ లయోలా కళాశాలలో జరిగింది. ఈ సెలబ్రేషన్ కు ముక్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయులు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఈగల్ టీం సి ఐ, ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాలా వీరాంజనేయులు, గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ నేటి యువత చెడు మార్మార్గంలో నడుస్తున్నారని,చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారన్నారు. యువత అంతా కూడా బాగా చదివి ఉన్నత శిఖరానికి చేరుకోవాలని,చెడు వ్యసనాలకు అలవాటు పడితే సమాజంలో గుర్తింపు ఉండదన్నారు.ఏ అలవాటులు లేకపోతే సమాజంలోను, కుటుంబాలలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.విశాఖ నగరంలో సి ఐ ఐ సమావేశం జరిగిందని,వైజాగ్ లో 13 లక్షల పెట్టుబడులురావడం ద్వారా 13 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు .మత్తు పదార్థాలను ప్రోత్సహించవద్దు అని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,  మంత్రులు అనిత, నారా లోకేష్ తదితరులు కోరుతున్నారన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Image
 *పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ  B.కృష్ణా రావు ఐపిఎస్ .*  ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి. ★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని  ఎస్పీ  సూచించారు. ★ చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఫిర్యాది డ్వాక్రా గ్రూప్ యానిమేటర్ గా పనిచేస్తున్నట్లు, ఆమెకు చిలకలూరిపేట లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు అకౌంట్ ఉన్నట్లు,ఫిర్యాది ఖాతా నుండి 99,500/- రూపాయలు  వేరే ఖాతా కు బదిలీ అయినట్లు బ్యాంక్ వారు తెలిపినట్లు, కావున తన ప్రమేయం లేకుండా వేరే ఖాతాకు బదిలీ అయిన విషయం గురించి విచారణ చేసి న్యాయం చేయవలసిందిగా  ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.  ★ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్...

గురుకుల పాఠశాల పనుల ఆలస్యం ఆగ్రహ వ్యక్తం చేసిన బి.శ్రీను నాయక్.

Image
 చిలకలూరిపేట న్యూస్ 9 గురుకుల పాఠశాల పనుల ఆలస్యం ఆగ్రహ వ్యక్తం చేసిన బి.శ్రీను నాయక్. చిలకలూరిపేట/ గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.4.36 కోట్ల నిధులు ఉన్నా పనులు చేపట్టలేదని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ సోమవారం అధికారులపై మండిపడ్డారు.స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పనులు వెంటనే ప్రారంభించకపోతే వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మన్యం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పల్నాడు, మన్యం, ఇతర జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిధులు ఉన్న అధికారులు పనులు చేయడం లేదని డిప్యూటి సి.యం పవన్ కల్యాణ్ చెప్పు తున్నారు. ఓ జి,హరి హర వీరమల్లులాంటి సినిమాల్లో చేసినట్టుగా రియల్ గా ఎందుకు అధికారుల చేత పని ఎందుకు చేయించటము లేదని నాయక్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఫ్ పట్టణ కన్వీనర్ బి.రాంబాబు ఉన్నారు.

శాఖా గ్రంథాలయ వారోత్సవాలు

Image
 *చిలకలూరిపేట న్యూస్ 9   శాఖా గ్రంథాలయం, మురికిపూడి లో   *ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు  శాఖా గ్రంథాలయం మురికిపూడి నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో నాలుగోవ రోజు సందర్భంగా పాల్గొన్న ఎం. పి. పి. ఎస్. హెచ్. మరియు ఎం. పి. పి. ఎస్. సి. సి. పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల చేత ముందుగా గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎం. పి. పి. ఎస్. సి. సి. ప్రధానోపాధ్యాయులు శ్రీ మందపాటి చిన్నయ్య గారు మాట్లాడుతూ ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించడం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ అలవడుతుంది. ఇది వారి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందిని. ఆటలలో విజయాలు సాధించడం లేదా మెరుగుపడటం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని తెలియజేశారు.  అనంతరం వారి ఆధ్వర్యంలో 3, 4 మరియు 5వ తరగతి వారికి మ్యూజికల్ చైర్స్ పోటీలు  నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రైవేటీకరణ వ్యతిరేక* *ప్రజా ఉద్యమ ర్యాలీలో నింగినంటిన* *నిరసన జ్వాలలు* !

Image
 *పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట  లో మెడికల్ కళాశాలల* *ప్రైవేటీకరణ  వ్యతిరేక* *ప్రజా ఉద్యమ ర్యాలీలో నింగినంటిన* *నిరసన జ్వాలలు* !   *ర్యాలీలో భారీగా పాల్గొన్న యువత!*    *శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో* *నింగినంటిన నీలిరంగు* *జెండా!*   *ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీతో కూటమి  ప్రభుత్వానికి సవాల్ విసిరిన* *వైయస్సార్ కాంగ్రెస్* *పార్టీ!*   *మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా* *కూటమి ప్రభుత్వం 10000 కోట్ల* *స్కాంకు పాల్పడింది!*   *కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి* !   *గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం* *ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు* *అనుమతిస్తే ప్రజలు తమ* *నిరసనలతో అప్పటి*  *ప్రభుత్వాన్ని కూల్చివేశారు!*   *ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలను* *ప్రజలు చీదరించుకుంటున్నారు* !   *తక్షణమే ప్రభుత్వ మెడికల్ కళాశాలల* *ప్రైవేటీకరణ నిర్ణయాన్ని* *కూటమి ప్రభుత్వం వెనక్కి* *తీసుకోవాలి _ప్రజా ఉద్యమ ర్యాలీలో పల్నాడు* *జ...

ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.

Image
 వినియోగదారుల హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వినియోగదారుల సంఘం సభ్యులు  ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.  వస్తువులు కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుడు ఒక వినియోగదారుడైననీ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ అన్నారు.  మంగళవారం పట్టణంలోని  కూరగాయల మార్కెట్, నిత్యవసర వస్తువులు దుకాణాల వద్ద, గడియారపు స్తంభం వద్ద వినియోగదారులు కరపత్రాలు పంపిణీ చేసి వారి హక్కుల గురించి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న crpfi పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 నీ వినయకధాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం కూడా ఈ మేరకు వినియోగదారులు హక్కులు కల్పించడం ప్రచారాలు చేయాలని చెప్పి ఆయన కోరారు. వినియోగదారుల తమ సమస్యలు ఏమైనా ఉంటే 1915కి లేదా నేషనల్ కన్జ్యూమర్ ఫోరం వెబ్సైట్ను సంప్రదించి తమ సమస్యల్లో పొందుపరిచి పరిష్కరించుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవి నాయక్, జాయింట్ సెక్రెటరీ విక్రమ్, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన హీరోయిన్స్

Image
 న్యూస్ నైన్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 7/11/25 మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన హీరోయిన్స్ నిధి అగర్వాల్ ,ఈషా రెబ్బ..... విజయవాడ సెంట్రల్, నియోజకవర్గం  గవర్నర్ పేట జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్” హీరోయిన్స్ నిధి అగర్వాల్ ,ఈషా రెబ్బ ప్రారంభోత్సవంలో  పాల్గొన్నారు. హీరోయిన్స్  చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.పవన్ కల్యాణ్ తో కలిసి 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు.

నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్

Image
 *బ్రేకింగ్ న్యూస్* *నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు*

నిత్యం వివాదాలలో ఉంటూ మరల తెరపైకి స్వర హాస్పిటల్

Image
న్యూస్ నైన్ ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బ్రేకింగ్ న్యూస్....  1/11/25 విజయవాడలో రెచ్చిపోతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా.... ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నిత్యం వివాదాలలో ఉంటూ మరల తెరపైకి స్వర హాస్పిటల్ విజయవాడ జక్కంపూడి కళని లో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆస్పత్రిలో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది అని చెప్పడం జరిగింది   రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులు ఎత్తిన డాక్టర్లు రాత్రి విద్యార్థి మరణం రోగి తాలూకా బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది   ప్రస్తుతం స్వర ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం  ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు

షాపులపై పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి

Image
 **పల్నాడు–గుంటూరు జిల్లాల్లో మెడికల్ షాపులపై పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి — మానవ హక్కుల సంస్థ డిమాండ్** గుంటూరు:  ఔషధాల నాణ్యత, ప్రజల ఆరోగ్య భద్రత పట్ల మరింత జాగ్రత్త వహించాలని మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. శనివారం గుంటూరులోని ఔషధ నియంత్రణ సహాయ సంచాలక కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ డి. లక్ష్మణ్‌ను నేషనల్ ఫండమెంటల్ లీగల్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ. రాంబాబు, మానవ హక్కుల సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిర్రా రాజేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని మెడికల్ షాపులు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షణను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత విభేదాల కారణంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, వాటిని విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని సూచించారు. ప్రజల్లో మెడికల్ షాపులపై నమ్మకం పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మందుల సరఫరాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఔషధ నియంత్రణ శాఖ తరచుగా తనిఖీలు నిర్వహించి, నియమాలు ఉల్లం...

నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)**గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

Image
 గుంటూరు: సాధారణ బదిలీలలో భాగంగా గుంటూరు రేంజ్ కార్యాలయం నుండి బదిలీ అయిన సి.హెచ్. ప్రభాకర్ రావు గారు, **నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)**గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసరావుపేట పరిధిలో చట్టవ్యవస్థను కఠినంగా అమలు చేస్తూ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తానన్నారు. స్థానిక ప్రజల సహకారంతో శాంతి భద్రతలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం

Image
 వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (జీఎస్ఆర్ గారు) ఆదేశాల మేరకు మంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినుకొండ రోడ్ పరిసర ప్రాంతాల్లోని వరద బాధితులకు నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ఎస్.కే. కరీముల్లా గారు, 6వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు మైలూరి మార్క్ గారు పాల్గొన్నారు. జీఎస్ఆర్ గారు ప్రజల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని నాయకులు తెలిపారు.

నరసరావుపేట లోని తుఫాను

Image
 న్యూస్ 9 రిపోర్టర్ *నరసరావుపేట లోని తుఫాను* *ప్రభావిత ప్రాంతాల్లో* *పర్యటించి ప్రజలకు పులిహోర* *పొట్లాలు మరియు మంచినీళ్లు అందించిన* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ కార్యనిర్వాహక* *అధ్యక్షులు డాక్టర్* *శ్రీ గోపిరెడ్డి* *శ్రీనివాస్ రెడ్డి గారు!  *తుఫాను సహాయక చర్యలను చేపట్టాలని* *ముఖ్యమంత్రి పదే పదే చేసిన హెచ్చరికలను* *బేఖాతరు చేసిన నరసరావుపేట ప్రభుత్వ యంత్రాంగం* !   *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో*   *ప్రజలకు ఆహారం మరియు మంచినీటి* *సరఫరా కూడా చేయలేని దుస్థితిలో నరసరావుపేట* *ప్రభుత్వ యంత్రాంగం!*   *స్థానిక శాసనసభ్యులు అటు ఇటు* *తిరుగుతాడు తప్ప* *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో* *ప్రజలు పడుతున్న* *ఇబ్బందులను గురించి* *పట్టించుకోవడం లేదు* !  *తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న* *ఇళ్లకు నష్టపరిహారం తక్షణమే అందజేయాలి* !  *సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం* *చేయటం వల్లనే  తుఫాను* *సహాయక చర్యలకు* *అంతరాయం!*    *తుఫాను సహాయక చర్యల్లో* *నిర్లక్ష్యాన్ని వీడండి _* *పల్నాడు జిల్లా వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహ* *అధ్యక్ష...

తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!

Image
 *తుఫాను సహాయక చర్యల్లో నరసరావుపేట అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు!* *వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు మరియు డామేజ్ జరిగిన ఇళ్లకు సర్వే చేయించి వెంటనే ఆర్థిక సహాయం అందించాలి!* *చంద్రబాబు నాయుడు కాలనీలో 10 లైన్లు బరంపేటలో రెండు లైన్లు నీట మునిగిపోయాయి!* *బరంపేటలో విద్యుత్ స్తంభం విరిగిపడిన చెట్లు కూలి పోయినా సంబంధిత అధికారులు ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదు!* *ముఖ్యమంత్రి పదేపదే విజ్ఞప్తి చేసిన నిధులు విడుదల చేసినా నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు ఎక్కడా పునరావస కేంద్రాలు గాని ,వర్షాభావ ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు అందించటం గాని చేయలేకపోయాయి!* *నరసరావుపేట మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు!*       ************ *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం జరిగింది,* *ఈ పర్యటనలో భాగంగా ఆయన సత్తనపల్లి రోడ్ లోని స్టేడియం మరియు చంద్రబాబు నాయుడు కాలనీ ,బరంపేట ప్రాంతాల లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా...

సత్తెనపల్లి రోడ్డు ,స్టేడియం

Image
  సత్తెనపల్లి రోడ్డు ,స్టేడియం, బీసీ కాలనీ ,బరంపేట ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించిన పల్నాడు డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు! *

మోకాల్లోతు లో వరద నీరు

Image
 నరసరావుపేట news9 రిపోర్టర్ : నరసరావుపేట సత్తెనపల్లి రోడ్ లోనే స్టేడియం పక్కన కెనాల్.. రోడ్డుమీద ప్రవహిస్తున్న.. వరద చంద్రబాబు నాయుడు కాలనీలో మోకాల్లోతు లో  వరద నీరు చేరుకున్నాయి.

కరెంటు పోల్ కూలీ రోడ్డు మీద పడింది

Image
 నరసరావుపేట పల్నాడు బస్టాండ్ మదర్ తెరిసా హాస్పిటల్ దగ్గర కరెంటు పోల్  కూలీ రోడ్డు మీద పడింది

బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది

Image
 @నరసరావుపేట మండలంలోని రావిపాడులో సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో నరసరావుపేట నుండి నకరికల్లు వెళ్లే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది  @ సంబంధిత అధికారులు వెంటనే చెట్టును తొలగించాలని స్థానిక ప్రజలు కోరారు థాంక్యూ  పల్నాడు పోలీస్ *థాంక్యూ  పల్నాడు పోలీస్*  జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ  రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్. ఐ కిషోర్ దగ్గర ఉండి పడిపోయిన చెట్లను వేంటనే తొలగించారు.. త్వరిత గతిన పోలీసులు స్పందించిన తీరును ప్రజలు కొనియాడారు..