Posts

వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ* ఇంద్రకీలాద్రి

Image
*పౌర్ణమి నాడు ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణ, వేలాదిమంది భక్తజనలతో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ*  గిరి ప్రదక్షిణలతో సర్వ పాపాలు సమస్యలు తొలగిపోతాయి ఇంద్రకీలాద్రి క్షేత్ర క్షేత్ర అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది.  పొద్దున్నే 5.55 లకు ప్రదక్షిణలు మొదలవుతాయి.. ఇంద్రకీలాద్రి ఎంట్రన్స్ వద్ద నుంచి తిరిగి 9.30 లకు ప్రదక్షిణలు పూర్తి అయ్యి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ దివ్య ప్రదక్షిణ సమయంలో అందరికి అవకాశం ఉంటుంది దివ్య రథాన్ని స్వామి, అమ్మవార్లతో కొలువైన రథాన్ని భక్తులు కూడా పాల్గొనే భాగ్యం ఉంది మొత్తం 7.km లు ఉంటుంది. 3,4 గం.ల లోపు ప్రదక్షిణ సమయం పడుతుంది.

భక్తులను దోచుకుంటున్న శ్రీశైలం

Image
  విశ్వ హిందూ పరిషత్ - కర్నూలు జిల్లా. పత్రిక ప్రకటన: *హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అటవీశాఖ చేస్తున్న ఆర్థిక దోపిడిని అరికట్టాలి* . పర్యావరణ పరిరక్షణ పేరిట అటవీశాఖ హిందూ ఆలయాలకు వెళ్లే భక్తుల నుంచి చేస్తున్న ఆర్థిక దోపిడీని నిరసిస్తూ హిందువులు తిరుగుబాటు చేయాలనీ *బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ తూముకుంట ప్రతాప్ రెడ్డి* పిలుపునిచ్చారు. శ్రీశైల శివ దీక్ష అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర ఈరోజు (24/2/24) నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న *విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ* మాట్లాడుతూ ఇప్పటికే శ్రీశైలానికి వెళ్లే మార్గంలో నాలుగు చెక్ పోస్టుల వద్ద వాహనాలు సుమారు రూ.200, శ్రీశైలంలో సాక్షి గణపతి, హటకేశ్వరం క్షేత్రాల వద్ద పార్కింగ్ రుసుము రూ.50, ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే రూ.1000, రుద్రకోటీశ్వరుని క్షేత్రానికి వెళ్లాలంటే వాహనానికి రూ.300 వసూలు చేస్తున్నారు. ఇవి చాలవని ఏకంగా శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల నుంచి రూ.10 అటవీశాఖ వసూలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని దుయ్యబట్టారు. *బిజెపి రాష్ట్ర నాయకులు కగ్...

రాజకీయపార్టీల హామీలపై ఎన్నికల సంగం కీలక వాఖ్యలు

Image
  CEC On Election Promises : ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీల ఇచ్చిన హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల ఎన్నికల్లో ఇచ్చే హామీల సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్​ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో నగదు, ఉచితాల పంపిణీని నిరోధించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు. CEC On Election Promises : రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, అయితే ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఎన్నికల్లో నగదు, ఉచితాల పంపిణీని నిరోధించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు. ఆన్​లైన్ లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యతలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(NPCI) అప్పగించామని తెలిపారు. ఈ మేరకు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈ...

వైసీపీలో బాంబు పేల్చిన వై. వి సుబ్బారెడ్డి

Image
  ఇప్పటివరకు 7 జాబితాలో ప్రకటించిన వారు సమన్వయకర్తలేనని వాళ్లు అభ్యర్థులు కారని స్పష్టం...* *మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడి...* *టికెట్లు దక్కక పక్క పార్టీల వైపు చూస్తున్న నేతలు వైసీపీలో ఉండేందుకే సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి..* *మరోవైపు సీటు మాదే అనుకొని డబ్బు ఖర్చు పెడుతున్న కొందరు నేతలు ఈ వ్యాఖ్యలపై అయోమయంలో పడ్డారు...* *చివరి నిమిషంలో సీటు వేరే వాళ్లకు ఇస్తే మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారు..*

సీట్ల ప్రకటన తర్వాత పవన్ వ్యాఖ్యలు

Image
  అమరావతి *బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుంటున్నాను-పవన్ కళ్యాణ్, జనసేన అధినేత:-* సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారు మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నాం చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారు గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేది ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదు పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపు లో చూపించాలని ఉంది బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించు కుంటున్నాము రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం

జగన్ పై పోటీచేయబోయే టీడీపీ అభ్యర్థి

Image
ఏపీ శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ పై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) పోటీచేయనున్నారు. రవీంద్రనాథ్ టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ ఎక్కడ పోటీచేస్తే తాను అక్కడ పోటీచేస్తానంటూ గతంలో పలుమార్లు రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి రవీంద్రనాథ్ బరిలో దిగనుండటం గమనార్హం.

దొండపర్తి లో చోరీ

Image
విశాఖ... దొండపర్తి బాలాజీ మెట్రో రెసిడెన్షియల్ లో భారీ చోరీ రిటైడ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారి ఇంట్లో 100 తులాల బంగారం మాయం. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన మహిళ పై అనుమానించిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో నిందితురాల ను గుర్తించిన పోలీసులు.. శుక్రవారం రాత్రి సంఘట స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ,డిసిపి, క్లూస్ టీం లు

మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

Image
ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌! ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం..

టీడీపీ, జనసేన 21 ఎకరాల్లో బహిరంగసభ

Image
ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన - టిడిపి బహిరంగసభ* 21 ఎకరాలు స్థలంలో ఈ సభ. జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల ప్రతినిధులు జనసేన నుంచి 250 మంది, టిడిపి నుంచి 250 మంది స్టేజ్ మీద ఆశీనులవుతారు.

ప్రధాని విశాఖ పర్యటన

Image
విశాఖపట్టణం, ఫిబ్రవరి 23:- భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పరిశీలించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసే నిమిత్తం మార్చి 1న దేశ ప్రధాని విశాఖపట్టణం వస్తున్న నేపథ్యంలో ఏయూ వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషన్ డా. ఎ. రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ , హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. దేశ ప్రధాన మంత్రి వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బలమైన బ్యారికేడ్లు వేయాలని, విద్యుత్ సంబంధిత సమస్యకు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటి వసతి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఏయూ ఇంజీరింగ్ కళాశాల మైదానంలో ఉన్న హెలిప్యాడ్ ను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.  పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఏయే వి...

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Image
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు.. ''రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు, తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్‌ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెదేపా-జనసేన ఆందోళనలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్‌ల వద్ద నిరసనలు తెలియజేస్తాం. వైకాపా అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫొటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం'' అని అచ్చెన్న తెలిపారు..

గుర్తుతెలియని వ్యక్తి ఉరి

Image
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వయస్సు సుమారు 60 సంవత్సరాలు సింహాచలం తొలి పావంచ వద్ద దేవస్థానం సంస్కృతి పాఠశాల మెయిన్ గేట్ పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నట్లు ఆ చనిపోయిన ఆసామి యొక్క వివరాలు సేకరించగా అతని పేరు ఆనంద్ అని తెలిసినట్లు అతను ఊరు గరవ జగ్గ రాజుపేట గ్రామం అని తెలిసినట్లు రక్త బంధువులు వివరాలు తెలియలేనందున అతను సుమారు మూడు సంవత్సరాల నుండి సింహాసనం తొలి పావంచ వద్ద భిక్షాటన చేసుకొని జీవిస్తున్నట్లు తెలిసినది అతని పూర్తి వివరాలు తెలియలేనందున పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అతను వివరాలు తెలిసినట్లు అయితే గోపాలపట్నం ఎస్ హెచ్ ఓ గారికి ఈ ఫోన్ నెంబర్లకు తెలియపరచవలెను 9440796020 6303844772 8331041648

టీడీపీ-జనసేన తొలి జాబితా

Image
రేపు టీడీపీ-జనసేన తొలి జాబితా.. 70 సీట్లు ప్రకటించే ఛాన్స్! AP: టీడీపీ-జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు.. అధికారికంగా రేపు(శనివారం) ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి. . ఉదయం 9 గంటల వరకల్లా పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటివరకు వేచి ఉండకుండా వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించిన ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం..

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

Image
  అమరావతి: జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు.. పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఉద్యోగులపై బొత్స చిరాకు.. బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్‌ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు..

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే

Image
  ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి సంబంధించి ఏడోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. లిక్కర్‌ కేసు వ్యవహారం కోర్టులో ఉన్న తరుణంలో విచారణకు నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని ఆప్‌ ఆరోపిస్తుంది. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఇంతకుముందు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంతో మనీలాండరింగ్‌ కేసులో విచారణకు కేజ్రీవాల్‌ హాజరుకాకపో...

జగన్ పర్యటనల కోసమే

Image
AP CM జగన్ పర్యటనల కోసం... విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.... నెలకు ₹1,91,75,000/ (కోటి తొంభై ఒక్క లక్ష డెబ్భై అయిదు వేల రూపాయలు) మరియు ఇతర ఖర్చులతో రెండు హెలికాప్టర్ లను అద్దెకు తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రాజపత్రము.

సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు

Image
*సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందంటూ నిఘా నివేదిక* సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని వెల్లడి ముఖ్యమంత్రికి అత్యంత భద్రత కల్పించాలని సిఫారసు రెండు హెలికాప్టర్లు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం జగన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. మరి కొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.   ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఒక హెలికాప్టర్ ను విజయవాడలో, మరో హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకోనున్నారు. ఇవి రెండు ఇంజిన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు.  ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్లు లీజు...

ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి... ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి అల్టిమేటం....!*

Image
  *ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి... ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి అల్టిమేటం....!*                                                     నేడు రాష్ట్ర వ్యాప్తంగా... అక్రమంగా అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు పదివేల మందిని రాత్రిలోపల విడిచిపెట్టకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రేపు జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం.

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

Image
  *15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్..* *కర్నూలు జిల్లా:* కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు.. మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..  ఇంకా దర్యాప్తు చేస్తున్నా ఏసీబీ అధికారులు..

అమర్నాథ్ చిత్ర పటానికి కోడిగుడ్ల తో కొట్టారు మంత్రి అమర్నాధ్ కు వ్యతిరేకంగా

Image
 

విశాఖ టీడీపీలో సీట్ల చిచ్చు

Image
  సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది నేను విశాఖ నార్త్‌ నుండి పోటీ చేయడం లేదు విశాఖ నార్త్‌ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా..? పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది గంటా శ్రీనివాసరావు , టీడీపీ సీనియర్ నేత

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

Image
  ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది

కాశ్మీర్‌లో స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతున్న సచిన్

Image
 

భారత ఉప రాష్ట్రపతికి ఆత్మీయ వీడ్కోలు

Image
విశాఖపట్నం , ఫిబ్రవరి 22 : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్, నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.గురువారం మిలాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం 12.30 గం.లకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు.  అక్కడ ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, తూర్పు నావికాదళ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలు నాయుడు, శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పోలీస్ కమీషనర్ డా.ఎ.రవిశంకర్, నేవీ కమోడోర్ దిలీప్ సింగ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సెనా, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.42 గం.లకు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు

Image
  .  సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు.  ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు.  హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

*రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు లేఖ*

Image
జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు లేఖ*  *రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రిపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన చంద్రబాబు*  *లేఖలో పేర్కొన్న అంశాలు..*  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది.  • మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పై దాడులు నిత్యకృత్యమయ్యాయి.  • రానున్న ఎన్నికల నేపథ్యంలో కుట్రపూరితంగా వైసీపీ రౌడీలు మీడియాపై దాడులను తీవ్రతరం చేశారు.  • గత వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు దాడులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు.  • అమరావతిలో న్యూస్ టుడే కంట్రీబ్యూటర్ పరమేశ్వరరావు, రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ, కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి, మద్దికెరలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వీరశేఖర్ పై దాడులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు.  • చొక్కా చేతులు మడతపెట్టండి అంటూ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడమే రాష్ట్రంలో నేటి పరిస్థితికి కారణం.  • ముఖ్యమంత్రిగాన...

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

Image
ఫ్లాష్ ఫ్లాష్  డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ  హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ  పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఎస్ జి టి టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ఎఎస్ జి టీ పోస్టులకు బీ ఇ డి అభ్యర్థులను అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం  సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ జీవో పై స్టే విధిస్తూ ఆదేశాలు నియామక ప్రక్రియ కొనసాగించాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సంచల...

చిలకలూరిపేట లో ఏసీబీ రైడ్

చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు ... రూరల్ ఏఈ 55 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకోవటం జరిగింది......  ఏసీబీ అధికారులు రైడ్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

అభిమాని అంటూ ఎన్టీఆర్ నే మోసం చేసిన ఘనుడు..

Image
  Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:.. విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత (TDP)బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని అంటే మోసమని.. నాని అంటే నమ్మించి నిండా ముంచడం అని వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR) మద్దతుతో హరికృష్ణ బిక్షతో రాజకీయంగా ఎదిగారన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కొడాలి నాని బాధితుడే అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయలు తీసుకున్నారని.. అది నిజమా? కాదా? నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.. హైదరాబాద్ శివారులోలో తప్పుడు పత్రాలు సృష్టించి 12 ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్‌కు ఎకరం రూ. 85 లక్షలు చొప్పున అమ్మి మోసం చేశారని విమర్శించారు. ఆ తరువాత వచ్...

మూడేళ్ళ పాపను కిడ్నాప్ చేసిన దుండగులు

మూడేళ్ళ పాపను కిడ్నప్ చేసేందుకు వచ్చిన దుండగులు... నిన్నటి నుండి రెక్కీ నిర్వహించినట్టు గుర్తించిన స్థానికులు... ఈ రోజు ఉదయం నేరుగా ఇంట్లో కి చొరబడి 3 ఏళ్ల చిన్నారిని కిడ్నప్ చేసేందుకు వచ్చిన ఇద్దరు కిడ్నాపర్స్ పట్టుకుని చితకొట్టి 4th టౌన్ పోలీస్ లకు అప్పగించిన స్థానికులు

విశాఖలో దర్జాగా దొంగల చోరీలు

  విశాఖలో దర్జాగా దొంగల చోరీలు. పెందుర్తి సమీపంలోని సూర్యా నగర్ కామాక్షి అపార్ట్ మెంట్ లోకి అర్ధరాత్రి దుండగలు చొరబడి ఓ ఫ్లాట్ లో గోల్డ్ చోరీ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. *పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

27న ఛలో విజయవాడ

Image
  . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న 'ఛలో విజయవాడ' కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు చాయ్, బిస్కెట్లకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్

Image
ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్,ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారు..ఆ సంస్థ నుంచి బయటకు రండి  రెండు నెలలు తర్వాత మేము అధికారంలో వస్తాం..అప్పుడు  సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు? మేము అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి రేపు మీ సాక్షి కి కూడా ఇదే గతి పడుతుంది శారద పీఠానికి సిఎం జగన్ వేస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణం ఈవెంట్ మేనేజర్ ను పెట్టి... రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటి? ఎయిర్ పోర్ట్ నుంచి శారద పీఠం వరకు టిడిపి జండాలను పోలీసులు పీకేశారు వైసిపి జండాలను మాత్రం ఉంచారు ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏమిటి? జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి కొడాలి నాని గంజాయి నాని ఆయన టివి చానల్స్,పత్రికల ప్రతినిధుల పై పై చేసిన వ్యాఖ్యలు పట్టించు కోవాల్సిన అవసరం లేదు గుడివాడ అమర్ నువ్వు విశాఖకు ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పాలి గుడివాడ అమర్ పరిస్థితి గాలిలో ఉంది ఆయనకు టికెట్ కూడా ఇవ్వ లేదు

రైలు ఎక్కుతుండగా జారీపడి యువకుడి మృతి రైలు ఎక్కుతుండగాజారిపడి యువకుడు మృతి.

Image
టెక్కలి మండలం  నౌపడ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన చెంచుల భానుచందర్రావు (35) యువకుడు రైలు బండి ఎక్కుతూ జారీ కింద పడిపోయాడు. మూడు రోజుల క్రితం సంతబొమ్మాలి మండలం యామాల పేట గ్రామానికి వచ్చి తిరిగి విశాఖపట్నం వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వెంటనే పడిపోయిన యువకుడుని ఆసుపత్రికి తరలించి చేర్పించగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.

Image
  ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి.... పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు.... మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..... పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు... కోళ్లు, విదేశీ పక్షుల రక్త నమూనాలు సేకరిస్తున్న రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్....

సీఎం విశాఖ పర్యటన

Image
*సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ..

Image
నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ..  రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్...

సయ్యద్ రెహాన్ పై నగర బహిష్కరణ పొడిగింపు

Image
                                                                  పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అయిన సయ్యద్ రెహాన్ @మున్నా పై ఉన్న నగర బహి ష్కరణ మరో ఆరు నెలలు (నేటి నుండి ) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కమీషనర్ అఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ

డీసీపీ-2 మేకా సత్తిబాబు కామెంట్స్

Image
  విశాఖ.. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్.. సుమారు మూడు కోట్ల నల్ల నకిలీ కరెన్సీ కాకానీనగర్ లో పట్టుకున్న ఏర్పోర్ట్ పోలీసులు.. డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశాం... భాస్కర రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు  భాస్కర రాజుకు అన్నవరం కి చెందిన గన్ని రాజు అనే వ్యక్తి తో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది... ఫేక్ కరెన్సీ ని నిజమైన కరెన్సీ అని నమ్మించడం కోసం మొదట అన్నవరం కాన్సెప్లో సిగరెట్లు కొని కొంత మొత్తం మార్చి నమ్మించాడు పూర్తి నమ్మకం కలిగిన తర్వాత  మూడు కోట్ల విలువ చేసే నోట్లను 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు  ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారు... బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లు గా మారుతాయి... ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నం మూడో ముద్దాయి గని రాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి వీరిద్దరి నుండి మూడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, మూడు సెల్ ఫోన్లు, ఓ కార్, వేల రూపాయల నగద...

నేషనల్ హైవే పక్కన గుర్తు తెలియని మృతదేహం

Image
                                                                                 తేదీ 20.02.2024 తెల్లవారుజామున GVMC పారిశుధ్య కార్మికులు సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు గల ఒక అజ్ఞాత వ్యక్తి మృతదేహాన్ని NH-16 రహదారి పక్కన, దిశ మహిళా PS, యెండాడకు ఎదురుగా పడి ఉండడాన్ని గుర్తించి, PM పాలెం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. నేను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పుష్ కార్ట్ వ్యాపారులను విచారించగా మృతుడు యాచకుడని, 3 నుంచి 4 నెలల నుంచి జూ పార్క్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడని, మృతులపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదని తేలింది. శరీరం. మృతదేహాన్ని విశాఖపట్నం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. జివిఎంసి సూపర్‌వైజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదినచవలెను. 0891-2721333,...

మిలన్ 2024 కి పోలీస్ సిబ్బందికి సూచనలు

Image
  *పోలీస్ సిబ్బందికి సూచనలు @ మిలన్-2024.* డా. ఏ. రవిశంకర్,ఐపీఎస్,కమీ షనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఉత్తర్వులు మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐపీఎస్,జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో మిలన్-2024 కి విధులు నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికి డీ.సీ.పీ-1(ఎల్ &ఓ) వి.ఎన్.మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్, ఏయూ కాన్వికేషన్ హాల్లో బ్రీఫింగ్ నిర్వహించి పలు సూచనలు చేయడమైనది కార్యక్రమానికి వచ్చే వృద్ధులకు,మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నేహ పూర్వకంగా మెలగాలని,ట్రాఫిక్ అంతరాయం లేకుండా విధులు నిర్వర్తించాలని కోరారు సందర్శ కులుకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సుమారు 5000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ.

రూ.15 కోట్ల వరకు ఆస్తులు గుర్తింపు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి.. ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు.. ప్లాట్లు, ఫ్లాట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించిన ఏసీబి  హైదరాబాద్ మాసబ్‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. జగజ్యోతి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు నిన్న (సోమవారం) దొరికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్‌ ఈఈ‌ జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వారి నివాసంలో 65 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. జగజ్యోతి గారి నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.           మాసబ్‌ ట్యాంక్‌ లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెం...

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా

Image
 ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా? సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్‌, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్‌రెడ్డీ? అని చంద్రబాబు సవాలు చేశారు..

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు హై స్పీడ్ రైలు

Image
  హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది.  ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్‌) రూపొందించనున్నారు. దీని వల్ల రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం కానుంది..

జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించాలి

Image
 జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ ips ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయి ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నాం ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత...వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా... బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి... ముందస్తు చర్యలు తీసుకుంటాం.

సరుబుజ్జిలి బంగారం షాప్ లో చోరీ

*ఆముదాలవలస నియోజక వర్గం* శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మి జ్యువెలర్స్ లో చోరీ సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగి 35 తులాల వెండిని చోరీ చేసినట్లు యజమాని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసుల సీసీ కెమెరాలు లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కలసి చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ చేసిన పోలీసులు. దొంగతనం చేసిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

విశాఖలో రూ 3 కోట్లు నకిలీ కరెన్సీ పట్టివేత

Image
*కాకాని నగర్ లో అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు* *పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు* *వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం* విశాఖలో మూడు కోట్లు విలువైన నకిలీ కరెన్సీ పోలీసులకు దొరికింది. సోమవారం అర్ధరాత్రి పోలీసుల నైట్ రౌండ్స్ తనిఖీల్లో భాగంగా ఈ కరెన్సీని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాకాని నగర్ ప్రాంతంలో శ్రీ కట్టల మాదిరిగానే తెల్లని పేపర్లు కట్టలు కట్టి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నకిలీ కరెన్సీ ని ఆటోలో తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దొంగ నోట్లు ముద్రించే ముఠాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ నోట్ల ముఠా నకిలీ కరెన్సీని ముద్రించి జనాలు లోకి చలామణి చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విశాఖపట్నంలో గడిచిన కొంతకాలంగా ఈ దొంగ నోట్ల ముఠా ప్రభావం ఎక్కడ కాన రాలేదు. కాగా ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఎరవేసేందుకు ఓటుకు నోటు పంచే ప్రక్రియలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దొంగ నోట్ల నుంచి చాలామంది చేసేందుకు కొన్ని ముఠాలు...

జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడండి

Image
  ** *మధురవాడ జర్నలిస్టుల ఆధ్వర్యం లో ధర్నా*  *పీ.ఎం.పాలెం సిఐ కు వినతిపత్రం అందజేత* మధురవాడ అనంతపురం జిల్లా రాప్తాడు లో ఈనెల 18వ తేదీన సిద్ధం సభలో వైయస్సార్సీపి కొందరు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై కొందరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ మధురవాడ జర్నలిస్టు మిత్రుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం,మరియు పీ.ఎం.పాలెం సిఐ వై రామకృష్ణ కు మధురవాడ జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి, పత్రిక స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ముందుగా జీవీఎంసీ జోన్ -2 కార్యాలయం అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆంధ్ర జ్యోతిపత్రికా ప్రతినిధి పై దాడిని నివసిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాడ జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.

ప్లాష్... ప్లాష్... ప్లాష్..భారత ఎన్నికల సంఘం. ప్లాష్...

Image
 ప్లాష్... ప్లాష్... ప్లాష్... ప్లాష్... *ప్రధాన ఎన్నికల అధికారి - ఆంధ్రప్రదేశ్* *భారత ఎన్నికల సంఘం. *  *12-3-2024 = ఎన్నికల నోటిఫికేషన్* *28-3-2024 = నామినేషన్ ప్రారంభమవుతుంది.* *19-4-2024 = పోలింగ్ రోజు*   *22-5-2024 = కౌంటింగ్ (ఫలితం)*   *30-5-2024 = కొత్త ప్రభుత్వం.*🤷‍♂️

డాగ్ స్క్వాడ్ ను, పోలీస్ హ్యాపీ హోమ్స్, పునరనిర్మాణం.

Image
                      ఈ రోజు అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి సమక్షంలో నగర ఆర్ముడ్ రిజర్వ్ అవరణలో గల పునర్నిర్మించిన డాగ్ స్క్వాడ్ ను, పోలీస్ హ్యాపీ హోమ్స్ నూ ఆయా విభాగాల ఆర్.ఐ ల చేతుల మీదుగా తిరిగి ప్రారంభించారు.                         సీపీ గారు నగర పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాల భవనాలను సందర్శించిన విషయం విదితమే, అందులో భాగముగా నగర డాగ్ స్క్వాడ్ భవనాన్ని , పోలీస్ సిబ్బంది యొక్క డార్మిటరీ మరింత ఆధునికరించవలసిన అవసరం గుర్తించి , తగు నిధులు ఏర్పాటు చేసి పూర్తిగా ఆధునీకరించడం జరిగినది.                          ఈ రోజు సీపీ గారి సమక్షంలో పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని కే.రవి కుమార్ RI(CSB) గారు , పోలీస్ హ్యాపీ హోమ్స్ ను పి.వెంకటేశం RI(QM) గారు ప్రారంభించారు. ఈ సందర్భముగా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం సీపీ గారు చూపిన చొరవకు ప్రతీ ఒక్క పోలీసు...