Posts

ఖరారైన వైసీపీ ఎంపీ అభ్యర్థులు

Image
 *ఇప్పటివరకు ఖరారైన వైసీపీ ఎంపీ అభ్యర్థులు..* శ్రీకాకుళం – పేరాడ తిలక్ విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి (ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు) ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (తొలిసారి బరిలోకి, తణుకు ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు) విజయవాడ – కేశినేని నాని (సిట్టింగ్ ఎంపీ, టీడీపీ వీడి వైసీపీలో చేరిక) కర్నూలు – గుమ్మనూరు జయరాం (ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు) తిరుపతి – కోనేటి ఆదిమూలం (సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి స్థానంలో.. గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యేగా బరిలోకి..కుండ మార్పిడి) హిందూపురం – జే. శాంతమ్మ (కర్నాటక మాజీ మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీరాములుకి సోదరి.. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ నిరాకరణ) అనంతపురం – శంకరనారాయణ (పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పని చేశారు) *ముగ్గురు సిట్టింగ్ లకు టికెట్ నిరాకరణ* గోరంట్ల మాధవ్- హిందూపురం ఎంపీ కోటగిరి శ్రీధర్ – ఏలూరు (ఎన్నికల్లో పోటీ చేయను అని 6 నెలల క్రితమే చెప్పేశారు) డాక్టర్ సంజీవ్ కుమార్ – కర్నూలు *మళ్లీ ఛాన్స్ దక్కించుకున్న ముగ్గురు...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(ఏపీ పీసీసీ)గా వై.ఎస్. షర్మిల నియమితులయ్యారు

Image
 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(ఏపీ పీసీసీ)గా వై.ఎస్. షర్మిల నియమితులయ్యారు . తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎటూ తేల్చని చంద్రబాబు కేసు

Image
  చంద్రబాబు కేసులో ట్విస్ట్ *చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మసనం ఎలాంటి తీర్పు వెలవరించలేదు.* *ఈ కేసులో 17-A వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పు తెలిపారు.* *విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని చెప్పారు.* *గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదని తెలిపారు.* *అయితే చంద్రబాబు పిటిషన్ 17-A వర్తించదని జస్టిస్ త్రివేది తెలిపారు.* *2018 లో వచ్చిన సవరణ ఆధారంగా కేసును క్వాష్ చేయలేమన్నారు.*

వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ..త్వరలోనే జాబితా లిస్ట్ విడుదల

Image
 *అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ..త్వరలోనే జాబితా లిస్ట్ విడుదల ..* ఆంధ్రపదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మరింత దూకుడుగా ముందుకెళ్తోంది అధికార వైసీపీ. అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు… ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల కాగా.. పండగ తర్వాత మరో లిస్టును రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతుండటంతో.. ఇంకెన్ని మార్పులు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పండగకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. మార్పులు, చేర్పులు కొనసాగుతాయని అధిష్టానం నుంచి సంకేతాలొస్తున్నాయి.. ఒకట్రెండు రోజుల్లో నాలుగో జాబితా విడుదలకు రెడీ అవుతోంది. అయితే, ఇప్పటికే 60మంది దాకా ఇన్‌ఛార్జుల మార్చిన వైసీపీ అధిష్ఠానం.. ఆ సంఖ్యను మరింత పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి లిస్ట్ లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్‌లో 27 మందిని మార్చారు. మూడో లిస్ట్ లో 21 మంది ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో 59మందికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్లు ఖరారు చేశారు. అయితే, నాలుగో లిస్ట్ కాక.. లాస్ట్‌ మినిట్ వర...

నాడు భారత్ సాయం చేయకపోయి ఉంటే... మాల్దీవుల పరిస్థితి ఏమిటి?

Image
భారత ప్రధాని మోడీ పై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో "బాయ్ కాట్ మాల్దీవ్స్" ఇష్యూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారతీయులు మాల్దీవుల పర్యటనలు విరమించుకోగా.. ఈస్ మై ట్రిప్ సంస్థ మాల్దీవులను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తున్న మాల్దీవులకు గతం గుర్తు చేస్తున్నారు! అవును... ప్రస్తుతం భారత్ - మాల్దీవులమధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో... తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా అండతో శృతిమించుతున్న ఈ మాల్దీవులను.. ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి భారతే రక్షించిందని గుర్తుచేస్తున్నారు. నాడు సాయంకోసం భారత్ వైపు చూసినప్పుడు.. మన సైన్యం మాల్దీవులపై దాడిచేస్తున్న శత్రుమూకలను తరిమికొట్టింది. ప్రపంచ దేశాలు కొనియాడిన ఆ "ఆపరేషన్‌ కాక్టస్‌" గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంమరిచి శృతిమించి భారత్ పై వ్యాఖ్యానిస్తున్న మాల్దీవులకు నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన...

మల్దీవులపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

Image
భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య వివాదం కొనసాగుతోంది. భారత ప్రధాని మోడీ పైనా.. భారత్ పైనా మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. అనంతరం చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే. తమ దేశంలో ఉన్న భారత్ కు చెందిన 88 మంది సైనికుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. చైనా చేస్తున్న ప్రకటనలు మరో ఎత్తు. ఇలాంటి వేళ.. ఈ అంశంపై ఓపెన్ గా ఎలాంటి ప్రకటన.. వ్యాఖ్య చేయని కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తాజాగా స్పందించారు. తొలిసారి మాల్దీవుల వివాదంపై స్పందించిన ఆయన.. విదేశీ విధానంలో రాజకీయం.. రాజకీయమేనని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదంపై మాట్లాడుతూ.. ఏ దేశమైనా తప్పనిసరిగా భారత్ కు మద్దతుగా ఉంటుందని చెప్పలేమన్న ఆయన.. పొరుగు దేశం మొదటి ప్రాధాన్యం ఏమిటో తెలుసకొని దాని ప్రకారమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రతి దేశం భారత్ తో సఖ్యతగా.. మద్దతు ఇచ్చేలా ఉంటుందన్న హామీని తాను ఇవ్వలేనన్న ఆయన.. గడిచిన పదేళ్లలో భారత్ - మాల్దీవులతో పటిష్టమైన సంబంధాల్ని ఏర్పర్చినట్లుగా ...

చంద్రికా రావి బ్యూటిఫుల్ లుక్ ఇన్ యెల్లో సారీ

Image
 

ఈ ముగ్గురు కుర్రాళ్లు నాటు బాంబులు

Image
కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్‌ మొదలుకానుంది. అన్ని టీమ్‌లు ప్రస్తుతం దాదాపుగా సన్నాహాలు మొదలుపెట్టాయి. టీమ్‌లో లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌లు ఎక్కువగా ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్‌ టీమ్‌ తరచూ ఫీల్గింగ్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాటింగ్‌ టీమ్‌కి మేలు చేస్తుంది. అంతే కాకుండా లైనప్‌లో లెఫ్ట్ హ్యాండర్లు, రైట్ హ్యాండర్ల కలయిక ఉంటే లైన్‌లు, లెంగ్త్‌లను అడ్జస్ట్‌ చేసుకోవడం బౌలర్‌లకు కష్టం అవుతుంది. టీమ్‌లో టాప్, మిడిల్ ఆర్డర్‌లో పవర్-ప్యాక్డ్ లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే ఫీల్డింగ్ చేసే టీమ్‌కి సవాళ్లు తప్పవు. ఇప్పుడు టీమ్ ఇండియా ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్ల డెడ్లీ కాంబినేషన్‌ని తీసుకొచ్చింది. ముగ్గురు ప్లేయర్‌ల ఆటతీరు విభిన్నంగా కనిపిస్తున్నా.. అందరిలో కనిపించే లక్ష్యం పవర్‌ హిట్టింగ్‌. ఆ ప్లేయర్స్‌ ఎవరు, టీమ్‌ ఇండియా ప్లాన్స్‌ ఎలా ఉండాలో? ఇప్పుడు చూద్దాం. అదరగొడుతున్న లెఫ్ట్‌ హ్యాండర్లు T20 ప్రపంచ కప్ 2024కి ముందు భారత్‌కు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రింకూ సింగ్ రూపంలో బెస్ట్‌ ఆప్షన్లు లభించాయి. ఈ లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్లు ముగ్గురూ మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చేయ...

మంచు కొండల్లో కాజల్

Image
పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దసరాకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే కాజల్ తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ తన భర్త, కొడుకుతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే మాటలు కాదనే చెప్పోచ్చు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.. జల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప...

వైరల్ అవుతోన్న పిక్స్

Image
నిహారిక హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels Web Series)లో నటించింది. వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా సోలో టూర్స్ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా థాయ్ ల్యాండ్ వెళ్లింది. అక్కడి నుంచి తన కొత్త నేస్తంతో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

అబ్బురపరిచే విజువల్స్‌తో ఫైటర్ ట్రైలర్

Image
  లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫైటర్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు.  ట్రైలర్ లో హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, చెబుతున్న డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. యాక్టన్, ఎమోషన్ కలగలిపి హృతిక్ ఇస్తున్న పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్ గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఊపిరి సలపని అనుభూతిని పంచుతున్నాయి.  2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగ...

చిక్కుల్లో టాప్ హీరోయిన్

Image
బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్న సినిమాలు భార‌త‌దేశంలో తెర‌కెక్కుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే తార‌లు త‌మ ఫీజులుగా భారీ మొత్తాన్ని వసూలు చేయడం చూస్తున్నాం. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ప్రియాంక చోప్రా పేరు మార్మోగుతోంది. ప్రతి చిత్రానికి రూ.40 కోట్లు వసూలు చేస్తుందని క‌థ‌నాలొచ్చాయి. చాలా చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అందాల భామ బాలీవుడ్ లో ఔట్ సైడ‌ర్ గానే ప్ర‌వేశించి నిల‌దొక్కుకుంది. కెరీర్ ఆరంభం అందిలానే చాలా ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు పాప్ గాయ‌కుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత 2003లో ప్రియాంక చోప్రా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ తో సినీఎంట్రీ ఇచ్చింది. సన్నీ డియోల్- ప్రీతి జింటాతో కలిసి అనిల్ శర్మ 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై' చిత్రంతో పీసీ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది....

పలాస బైపస్ రోడ్ లో విషాదం..రెండు బస్సులు ఢీ

Image
పలాస బైపస్ రోడ్ లో విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది ! శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు. ఈ తరుణంలోనే… క్లీనర్ దినేష్ (25 ) మృతి చెందాడు.. మరో 20 మంది టూరిస్టుకు గాయాలు అయ్యాయి. దీంతో అలర్ట్‌ అయిన స్థానికులు… క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ నుంచి పూరి, రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాశీబుగ్గ పోలీసులు. అదే సమయంలో 54 మంది బస్సులో ప్రయానిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముందు బస్సులోని ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని…కేవలం వెనుక ఉన్న ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు..

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

Image
.. శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని అయ్యప్ప భక్తులు భావిస్తారు..

విశాఖ సాగర తీరంలో సంక్రాంతి..గాలిపటాల జోరు

Image
 సంక్రాంతి పండుగకు విశాఖ సాగర తీరంలో ఆకాశం అంతా గాలి పటాలతో కనువిందు చేస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పతంగులను ఎగురవేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, మహిళలు యువతులు పోటీ పడుతున్నారు. విభిన్న ఆకృతుల్లో పతంగులు ఆకాశంతో ఎగరవెస్తూ సందడి చేస్తున్నారు. మార్వాడి మంచ్ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో చిన్నా , పెద్దా అంతా పాల్గొని పతంగుల పండుగను జరుపుకున్నారు. తెలుగువారింట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సాంప్రదాయ పద్దతిలో భోగి, సంకాంత్రి, కనుమగా జరుపుకుంటారు. ఇక ఏపీ ఆర్దిక రాజధాని విశాఖలో సంక్రాంతి సందడి మాములుగా ఓరేంజ్‌లో ఉంది. ఒకవైపు బీచ్‌లో కైట్‌ ఫెస్టివల్..మరోవైపు నెహ్రు యువ కేంద్రంలో బొమ్మల కొలువుతో ఎంజాయ్ చేస్తున్నారు విశాఖ వాసులు.సాగర తీరం అంతా రంగులమయమైంది. విశాఖకు వచ్చిన పర్యాటకులు సాగర తీరంలో ఈ సందడి వాతావరణాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు ఆకాశంలో ఎగురుతూ పక్షులను ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర్ తీరంలో పతంగులు ఎగరవేయడం తమకు ఎంతో ఆనందానిచ్చిందని నగరవాసులు చెబుతున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు!

Image
స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు వాదనలు విని.. తీర్పు రిజర్వ్‌ చేసిన బెంబ్‌

నేడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ..

Image
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 1.30కి వీరభద్ర స్వామి ఆలయంలో పూజ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3.30కి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి వెళ్లి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. IRS లోని కస్టమ్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ విభాగానికి చెందిన 74, 75 బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాట్లాడతారు. అళాగే భూటాన్‌కి చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ముచ్చటిస్తారు..

అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు

Image
  వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు. * . * మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు * చిన్నారుల అశ్లీల చిత్రాలను మొబైల్‌లో చూసినట్టు యువకుడిపై కేసు చూసింది నిజమే కానీ అవి చిన్నారులవి కావన్న యువకుడు యువకులు మద్యానికి, ధూమపానానికి బానిసలు అయినట్టే ఇప్పటి పిల్లలు అశ్లీల చిత్రాలకు బానిలవుతున్నారన్న కోర్టు నిందలు మాని వారు ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని సలహా మొబైల్ ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నిన్న ఈ కేసు విచారణకు రాగా.. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడడం నిజమేనని, కాకపోతే తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని కోర్టుకు తెలిపాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. వాదోపవాదాల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఉత్తర్...

నూతన సంవత్సరంలో మీసేవ కు పూర్వ వైభవం కలగాలని ఆకాంక్ష...

Image
విశాఖపట్నం మీసేవ ఆపరేటర్ల తరపున మీసేవకు 2024లో పూర్వ వైభవం రావాలని, ఆపరేటర్లకు మంచి రోజులు రావాలని కోరుకుంటూ విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాధన్ కు, మరియు డి. ఎల్.డి.ఓ. మీసేవ విజిలెన్స్ అధికారిని పూర్ణిమ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందచేసి విశాఖ మీసేవ ఆపరేటర్లు అందరి తరపున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను   తెలిపిన ఆపరేటర్లు.  ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అధికారి అశోక్, నాగు, శ్రీనివాస్, నాగరాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - ఎంపీ చింతా అనురాధ

Image
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ నూతన సంవత్సర (2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమంతో పాటు, అభివృద్ధి జరుగుతోందని, పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు సరికొత్త దశ దిశా ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలను అందించాలని, వారు ఆశించినవన్ని జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ చింతా అనురాధ తెలిపారు. ఎంపీ క్యాంపు కార్యాలయం, మొగళ్లమూరు

ప్రమాదకర స్థాయికి భారత అప్పులు..!

Image
జిడిపిలో 100 శాతానికి మించొచ్చు..ఐఎంఎఫ్‌ హెచ్చరిక న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యస్థ కాలానికి జిడిపిలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని మంగళవారం హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్‌కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఏడాది కాలం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)కి సమానమైన అప్పులను 100 శాతంగా భావిస్తారు.”ప్రాధాన్యంగా రాయితీతో కూడిన ఫైనాన్సింగ్‌ వనరులు, అదే విధంగా ప్రయివేటు రంగ పెట్టుబడులు, సమానమైన యంత్రాంగం అవసరం. అసాధారణమైన ఆర్థిక సహాయం లేకుండా లేదా డిఫాల్ట్‌కు వెళ్లకుండా ప్రభుత్వం దాని ప్రస్తుత, భవిష్యత్తు చెల్లింపు బాధ్యతలన్నింటినీ తీర్చగలిగితే దేశం రుణం స్థిరమైనదిగా పరిగణించబడుతుంది.” అని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ”అధిక మూలధన వ్యయం, ఉపాధి ఆధారంగా ఇటీవల భారత వృద్ధి రేటు అంచనాలను మధ్యస్థ కాలాని...

ప్రజలారా... అవకాశమీవ్వండి...ఆదరించండి...ఆశీర్వదించండి.

Image
ఈనాడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కట్కూరి సందీప్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. అన్నా అంటూ పిలిస్తే ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ప్రజల పనే తన పని అనుకోని సాయం చేసే వ్యక్తి కట్కూరి సందీప్. గత 15 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఓడినా, గెలిచినా పార్టీకి విధేయుడుగా ఉంటూ, ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కట్కూరి సందీప్. ప్రజల్లో ఒకడిగా ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదిగినవాడు కట్కూరి సందీప్. ఇలాంటి నాయకుడికి ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చాలా మంది కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.  అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులతో మాట్లాడి న్యాయం చేయటంలో సందీప్ ముందుంటాడని ప్రజలు అనుకుంటున్న మాట. ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయమని మరియు పెద్దపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి జరగాలంటే సందీప్ ని గెలిపించుకొని తీరాలని ప్రజలు కోరుకుంటున్నారు, కావున  అధిష్టానం గుర్తించి నాలాంటి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ నమ్మకాన్ని వమ్ము ...

ఉప్పల్ పైవంతెనఊగిసలాట

Image
హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఆరువరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7KMమేర ఫ్లెఓవర్ నిర్మించాల్సి ఉంది. దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా మిగిలాయి. గుత్తేదారుసంస్థ దివాలా ప్రక్రియలో ఉండటంతో నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

కాంగ్రెస్ లో కి దిల్ రాజు?

Image
  TS: ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్ లో  కి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజుతో పలువురు కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

విశాఖలో ఉద్రిక్తత

Image
  AP: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసనలో భాగంగా పారిశుధ్య కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కేఆర్ఎం కాలనీలోని జీవీఎంసీ చెత్తవాహనాల యార్డును ముట్టడించి చెత్తవాహనాలను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

నటి జయప్రద కోసం పోలీసుల గాలింపు

Image
బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నిమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో రామూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది.

పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..!

Image
Petrol Price: మోదీ నూతన సంవత్సర కానుక... పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.. ఇంధన ధరల్లో భారీ కోత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరపై రూ.10 వరకూ తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు వరుసగా రూ.8, రూ.6 తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. పెట్రోలియం శాఖ మంత్రి చమురు ధరలను తగ్గించనున్నట్టు ప్రకటించారు.. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చమురు సంస్థలను లాభాల బాటలో నడిపించాయి. దీంతో లీటర్‌పై రూ.10 వరకూ లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం రాయితీలు, ఆర్థ...

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు

Image
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు: సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చిన ఏకైక వ్యక్తి, గొప్ప మానవతా వాది, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ధీరుడు అతనే కొయ్యూరు సిఐ అల్లూ స్వామి నాయుడు. ప్రజలు, యువతీ యువకులు, మేధావులు, విద్యావంతులు ఏ సమస్యనైనా, ఏ బాధనైనా మనసులోనే దాచుకోకుండా, దిగమింగకుండా.. వ్యక్తపరిచే స్వేచ్ఛని ఇచ్చిన ఏకైక వ్యక్తి సిఐ అల్లూ స్వామి నాయుడు. కొయ్యూరు మండలం మారుమూల గ్రామాల్లోని యువత, ప్రజలు సైతం ఏ బాధనైనా ఇట్టే చెప్పేవారు. పోలీసులు, పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉండాలి ధోరణిని అవలంభించిన వ్యక్తి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు పరిచిన మానవతా విలువలు కలిగిన వ్యక్తి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా కులాలకు, మతాలకతీతంగా నడిచిన వ్యక్తి. ఇతని విలువలు తప్పు చేసిన వ్యక్తి యొక్క నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేయగలవు. ప్రతీ ఒక్క పోలీస్ అధికారి ఇలానే ఉంటే, సమాజంలో మార్పు ఖచ్చితంగా తీసుకురావచ్చు అనేది నా అభిప్రాయం. ఈయనను చూస్తే, కేవలం కేసులు నమోదు చేస్తేనే, శిక్షలు కఠినంగా అమలు చేస్తేనే మార్పు రాదు అనడంలో ...

Bigg Boss OTT Season 2: బర్రెలక్కకు ఛాన్స్

Image
  బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీలోకి కర్నె శిరీష (బరైలక్క) ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సోషల్మీడియాలో ఆమెకు ఫ్యాన్బోస్ ఎక్కువగా ఉంది. ఈ ఇమేజ్ను బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. అలాగే సింగర్ పార్వతిని కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లోకి తీసుకుంటారని సమాచారం.

భారత్ కు ప్రముఖ కార్ల తయారీ ఫ్యాక్టరీ!

Image
  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో తన తొలి మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయనుందని తెలిపాయి. దీనిని జనవరిలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమావేశంలో వెల్లడించనున్నారని, ఇందుకోసం టెస్లాకు గుజరాత్ ప్రభుత్వం అన్ని విధాల సహాయపడనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా దీనిపై ఇప్పటివరకు టెస్లా, గుజరాత్ ప్రభుత్వం స్పందించలేదు.

టైబ్రేక్ లో పోరాడి ఓడిన తెలుగు గ్రాండ్ మాస్టర్

Image
  భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తాచాటింది. ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకుంది. గురువారం ఆఖరిదైన 11వ రౌండ్లో కేథెరీనా (రష్యా)పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన ఆమె గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించింది. ప్రత్యర్థికి మించి ఎత్తులు వేయడంతో దూకుడుతో సాగింది. హోరాహోరీగా సాగిన టైబ్రేక్ లో హంపి పోరాట పటిమ ప్రదర్శించినా.. చివరకు పరాజయంవైపు నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ మీదుగా అమృత్ భారత్ రైలు

Image
ఆంధ్ర ప్రదేశ్: రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది.

మాస్కులు తప్పనిసరి?

Image
దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపో తున్నాయి. తాజాగా బుధవారం కేరళ రాష్ట్రంలో కొత్తగా 74 కోవిడ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దక్షిణ కన్నడ, మైసూరు జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కో బాధితుడు. బెంగళూరులో ఇవాల కొత్తగా 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హాసన్ 4, బెంగళూరు రూరల్ జిల్లాలో 4, చిక్కబల్లాపూర్ 3, మాండ్య, మైసూర్ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటకలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం. ఆలాగే బాధితులకు 7 రోజుల క్వారంటైన్‌ విధించింది. JN.1 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో సిద్ధరామయ్య సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 464, బెంగళూరులో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 376, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1.15%. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిపుణులతో మాట్లాడి...

డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం

Image
డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) విస్తృత స్థాయి సమావేశం డిజెయు విశాఖ జిల్లా నూతన కార్యవర్గం విశాఖపట్నం: డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (డిజెయు) జాతీయ కో-ఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ కమిటీ సభ్యులు యు.వి.రావ్ ఉప్పినివలస సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ పర్యవేక్షణలో  ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటగా డిజెయు విశాఖ జిల్లా కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. డిజెయు (డ్రమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్) నూతన విశాఖ జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సుంకసూరి శారా జ్యోతి (శారా) ఉపాధ్యక్షులు డి.రాజారావు, కార్యదర్శి పి.వి.వి.శేఖర్, సహాయ కార్యదర్శి ఎం.గురువా రెడ్డి (ఎం.జీ.అర్.), కోశాధికారి నాగరాజు, కార్యనిర్వాహకులు (ఆర్గనైజర్) నాగల రాజేష్, మరియు కమిటీ సభ్యులు గా కరుకు రమేష్ చంద్ర, దుర్గాప్రసాద్, కొప్పల మహేష్, బి.కే.కిషోర్, చదరం రమేష్, బలివాడ కన్నబాబు తదితరులను సమావేశం ఆమోదించింది.  ఈ కార్యక్రమంలో స్థానిక, అనకాపల్లి పరిసర ప్రాంతాల జర్నలిస్ట్లు హాజరయ్యారు.

విశాఖ జిల్లాలో డీ జేయు జిల్లాస్థాయి కార్యవర్గ ఎన్నిక విజయవంతం

Image
జాతీయ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల నేతృత్వంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీల ఏర్పాటు  డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్  జిల్లా కమిటీల ఏర్పాటు కార్యక్రమం విశాఖపట్నం నందు జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహ, జాతీయ సభ్యులు యు. వెంకట రావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధమంగా విశాఖపట్నం నందు విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  విశాఖపట్నం జర్నలిస్టులు మరియు పరిసర ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు జర్నలిజం వృత్తిలో తమ స్వీయ అనుభవాన్ని తెలియజేస్తూ పరిచయంతో సమావేశాన్ని ప్రారంభించారు.  ఈ సమావేశంలో నూతన సభ్యత్వం తో పాటు జర్నలిస్టుల బాధ్యతలు హక్కులు, జర్నలిజం వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను, యూనియన్ బలోపేతానికి సభ్యత్వం పొందిన జర్నలిస్టుల సహకారము, మరియు జాతీయ కమిటీ తో రాష్ట్ర కమిటీ సమన్వయము, విధి విధానాలు పై జర్నలిస్టులందరూ చర్చించారు. అనంతరం విశాఖ పట్టణం, పరిసర ప్రాంతాల సభ్యత్వం పొందిన జర్నలిస్టులు అందరూ  ఏకగ్రీవంగా జిల్లా కమిటీని...

మాకివ్వాల్సిన కూలిడబ్బు కోసం ఉద్యమాలు చేయాలా?

Image
సర్వీస్‌ రూల్స్‌, పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్టు 7న విశాఖలో ‘ఏపీఎంఈఎస్‌ఏ’ తొలి మహా సభ  ఏపీ ఎమ్ ఇ ఎస్ ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ  ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విశాఖపట్నం: ఉద్యోగులు దాచుకున్న, పని చేస్తున్న కూలి డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గతంలో 92రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం రూ.6,500కోట్లు విడుదల చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు.  రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లయినా ఇప్పటికీ సర్వీస్‌ రూల్స్‌ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. పదోన్నతల విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఎంఈఎస్‌ఏ) తొలి మహా సభ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్టు బొప్పరాజు స్పష్టం చేశారు.  సిబ్బంది లేని మున్సిపాలిటీలు: ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బందినివ్వలేదని, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని ...

అమ్మ నీకు జోహార్.......

Image
అమ్మ నీకు జోహార్....... వ్యవసాయ రంగంలో కష్టాలు వచ్చి.... నా తల్లి జైబోరన్నగారి లక్ష్మీదేవి యాదవ్ ఎన్నో కష్టాలను చవిచూసిందనీ ప్రజా సేవకుడు.... ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్నీరు పెట్టుకున్నారు . ముందు వెనక నా అనేవారు లేక  17 డిసెంబర్ 1983 పసి బిడ్డలుగా ఉన్న... ( నా చెల్లి అప్పటికి పాలు అమ్మపాలు తాగుతుంది ) అనాధలుగా చేసి .... మమ్మల్ని వదిలి నేటికి 40 సంవత్సరాలు..అనీ బోసన్నా తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు... నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చిన అమ్మ కంటిపాపలా మమ్ము  కాచి పెంచాల్సిన అమ్మ పసి పాదాలు తాకితే పులకరించాల్సిన అమ్మ బోసి నవ్వులు చూసి మురిసిపోవాల్సిన  అమ్మ బిడ్డల అడుగులు తడబడితే వేలు పట్టి  ముందుకు నడిపించాల్సిన అమ్మ   ప్రేమానురాగాలు అద్ది తీర్చి దిద్దాల్సిన అమ్మ  గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెద్దవాళ్ళను చేయాల్సిన  అమ్మ బిడ్డలకు అనురాగ ఋణం పంచాల్సిన అమ్మ బాల్యంలోనే మమ్ముల ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి.... అమ్మ.... నీకు జోహార్... అమ్మ నువ్వెక్కడ ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా... నీ ...